
ఘంటసాల(అవనిగడ్డ)/సాక్షి, అమరావతి: చట్ట సభల్లో కోటీశ్వరుల ప్రభావం పెరిగిపోతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఘంటసాల ఆదిశేషు సంతాపసభ కృష్ణా జిల్లా ఘంటసాల గోటకం కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించారు. ఘంటసాల ఆదిశేషు నిబద్ధతను గౌరవిస్తూ ప్రత్యేక సంచికను విడుదల చేయడం గర్వకారణమని రామకృష్ణ తెలిపారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జెల్లి విల్సన్ మాట్లాడుతూ నిబద్ధత గల నేత ఆదిశేషు అన్నారు. వామపక్షాలు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
మున్సిపల్ సిబ్బంది జీతాలనూ ప్రభుత్వమే చెల్లించాలి
పంచాయతీ ఉద్యోగులకు మాదిరే మున్సిపల్, నగరపాలకసంస్థల సిబ్బంది వేతనాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఈమేరకు ఆయన ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment