
సాక్షి, అనకాపల్లి జిల్లా: రాష్ట్రంలో సీఎం జగన్ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లుగానే.. మోదీ ప్రభుత్వం ఉపాధి కల్పించాలని సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ సూచించారు. స్థానిక నెహ్రూచౌక్‌లో జిల్లా సీపీఐ మొదటి మహాసభలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
బీజేపీ 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి యువతను నట్టేట ముంచిందన్నారు. కేంద్రంలో సైనికుల దళాన్ని నిర్వీర్యం చేసేందుకు ‘అగ్నిపథ్’ పేరుతో పన్నాగాలు పన్నడంతో యువత కేంద్రంపై విరుచుకుపడుతోందన్నారు.
చదవండి: (‘గడప గడప’పై పచ్చటి విషం)
Comments
Please login to add a commentAdd a comment