సాక్షి, విశాఖపట్నం : కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకే బ్యాంకుల విలీనం జరిగిందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ది జరిగిన తర్వాత ఆంధ్రాబ్యాంక్ విలీనం చేయడం దారుణమన్నారు. మహారాష్ట్ర బ్యాంకులను ఎందుకు విలీనం చేయరని ప్రశ్నించారు. ఆంధ్రాబ్యాంకు విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 28న విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
కాగా, గత నెల 30న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ బ్యాంక్‌ల విలీన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పది బ్యాంక్‌లు విలీనమై నాలుగు బ్యాంకులుగా అవతరించనున్నాయి. తొంభై ఆరేళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్రాబ్యాంక్ యూనియన్ బ్యాంకులో విలీనం కానుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ సింధ్ బ్యాంక్‌లు యధాతధంగా కొనసాగుతాయి. ఆంధ్రాబ్యాంక్ విలీనంపై అన్ని వర్గాలనుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.
Comments
Please login to add a commentAdd a comment