'ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి' | CPI Leaders takes on Chandrababu | Sakshi
Sakshi News home page

'ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి'

Published Fri, Feb 26 2016 2:26 PM | Last Updated on Mon, Aug 13 2018 6:24 PM

CPI Leaders takes on Chandrababu

కడప : ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అమరావతి చుట్టు తిరుగుతూ రాయలసీమను పట్టించుకోవడం లేదని సీపీఐ నాయకులు  మండిపడ్డారు. శుక్రవారం కడపలో ఆ పార్టీ నాయకులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ... చివరికి తాను రాయలసీమ ద్రోహి కాదని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. 

చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఈ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలని చంద్రబాబు సర్కార్పై బీవీ రాఘవులు, కె. రామకృష్ణ నిప్పులు చెరిగారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement