
నెల్లూరు (దర్గామిట్ట): రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. శనివారం ఉదయం నెల్లూరు సంతపేటలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి మీద ప్రతిపక్ష నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం, నైతికత లేకుండా బూతులు తిట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ప్రధానమంత్రిని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన కోరాలి అనే ఆలోచనలో ఉన్నారని.. దీన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అనంతరం సీపీఐ నెల్లూరు జిల్లా సమితి సభ్యులు, శాఖ కార్యదర్శుల వర్క్‌షాపు జరిగింది.