
సాక్షి, విజయవాడ : టీడీపీ నేతల కనుసన్నల్లో కోడి పందాలు జరుపుతూ.. వేల కోట్లు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విచ్చలవిడిగా కోడి పందాలు, వేలకోట్ల బెట్టింగ్‌లు జరుగుతుంటే హోంమంత్రి పట్టించుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలిగేలా టీడీపీ నేతల పాలన ఉందని విమర్శించారు.
మాజీ సీఎం కూతురు, ప్రతిపక్ష నేత చెల్లెలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందిపోయి, ఆమె రాజకీయం చేస్తుందని చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. షర్మిల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక మహిళగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి షర్మిల ఫిర్యాదు చేశారంటే ఆమె ఎంత బాధపడిఉంటుందో అర్థమవుతుందన్నారు. 40 ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు.. షర్మిల వ్యవహారంలో ఇలానేనా వ్యవహరించేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment