Cockfight
-
‘లైవ్’ కోడి స్పెషల్!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సంక్రాంతి సంబరాలకు కూటమి సర్కారు కొత్త భాష్యం చెప్పింది. పండుగ సంప్రదాయం ముసుగులో ప్రైవేట్ సైన్యాల పహారాలో యథేచ్ఛగా కోడి పందేలు, లైవ్‌లో బెట్టింగ్‌లు, ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో క్యాసినోలను తలదన్నే రీతిలో నిర్వహించిన జూద క్రీడలు, బెల్టు షాపులు పచ్చ ముఠాలకు కాసులు కురిపించాయి. ఇసుక (Sand) నుంచి మద్యం దాకా ప్రజలను పిండేస్తున్న కూటమి నేతలు సంపాదనే లక్ష్యంగా బరి తెగించి వ్యవహరించారు. మునుపెన్నడూ లేని విధంగా ఊరూవాడా కోడి పందాలు, పేకాట, గుండాటలను (Gundata) యథేచ్ఛగా నిర్వహించారు. పండుగ 3 రోజుల్లో రూ.ఐదు వేల కోట్ల మేర దందా సాగింది. పలుచోట్ల కోడి పందేలను కూటమి ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రారంభించడంతోపాటు వారి ఫొటోలతో బరుల వద్ద పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. నిశ్చింతగా వచ్చేయండి... సంక్రాంతికి ముందు కూడా కూటమి నేతల కనుసన్నల్లో, పోలీసుల సహకారంతో బాపట్ల, కృష్ణా, భీమవరం, కోనసీమ (Konaseema) తదితర జిల్లాల్లో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కోడి పందేలు, జూద శిబిరాలు కొనసాగాయి. కొద్ది నెలల ముందు నుంచే పందేలు కాసేవారికి ఆహ్వానాలు అందాయి. ‘మా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే కనుసన్నల్లోనే బరులు ఏర్పాటవుతున్నందున ఇబ్బందులేమీ ఉండవు. 3 రోజులు ఉండేలా మీరు నిశ్చింతగా వచ్చేయండి. హోటళ్లలో గదులు కూడా సిద్ధం చేశాం’ అని ఆహ్వానాలు పంపారు. కొత్త వారికి గేలం.. పందెంరాయుళ్లతో ఉన్న పాత పరిచయాలను బలోపేతం చేసుకుంటూనే కొత్తవారిని రప్పించేందుకు నిర్వాహకులు పలు మార్గాలు అనుసరించారు. సోషల్ మీడియాలో ప్రచారంతో హైప్ సృష్టించారు. విదేశాల్లో ఉన్నవారితో పాటు హైదరాబాద్ తదితర నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తున్న వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఆకర్షించేందుకు నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ముందే గెట్ టు గెదర్లు ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద బరుల సంఖ్య ఈదఫా పెరిగాయి. 2 నెలల క్రితమే సమాచారమిచ్చి రహస్యంగా గెట్ టు గెదర్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని కూటమి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను రప్పించారు. మందు, విందు భోజనాలతో జరిగిన ఈ పార్టీల్లోనే సంక్రాంతి బరుల్లో కోడి పందేలపై పందెంరాయుళ్లు అవగాహనకు వచ్చారు. బరుల విస్తీర్ణం, పోటీ జోడీలు, తేదీలు, సమయాలు, వ్యయం తదితరాలు అప్పుడే ఖరారైపోయాయి. రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాల నుంచి ఎవరెవరిని ఆహ్వానించాలనేది నిర్ణయించి ఆ మేరకు అమలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ప్రొఫైల్స్ సిద్ధం.. బరులు నిర్వహించిన వారు భవిష్యత్తులో నిర్వహించబోయే ఆటలకు మంచి లాబీయింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సంపన్న వర్గాల నుంచి కొత్తగా వచ్చిన పందెంరాయుళ్ల బలాలు, బలహీనతలను అంచనా వేసుకుని ప్రొఫైల్స్ సిద్ధం చేసుకున్నారు. రానున్న రోజుల్లో నిర్వహించబోయే జూద కార్యకలాపాలకు ఆహ్వానాలు పంపి జేబులు నింపుకునేలా రూట్‌మ్యాప్‌ల తయారీలో నిమగ్నమయ్యారు. శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్ తదితర దేశాల్లో జరిగే పేకాట, క్యాసినో శిబిరాలకు కూడా వీరిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. భీమవరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారితోపాటు ఆక్వా రంగంలోని పలువురు ప్రముఖులు హైదరాబాద్, విశాఖ, విజయవాడలకు చెందిన వారిని కోళ్ల పందేలకు ఆహ్వానించి పండుగ మూడు రోజులు రాచమర్యాదలు చేసి పంపడం గమనార్హం.లైవ్‌లో బెట్టింగ్‌లు...ఈసారి భారీ బరుల వద్ద పందేలను లైవ్ టెలికాస్ట్ చేయడం ద్వారా క్రికెట్ తరహాలో బెట్టింగ్‌లు నిర్వహించారు. లైవ్ లింక్ ద్వారా దేశ విదేశాల్లోని పందెంరాయుళ్లు కోడిపందేలపై బెట్టింగ్‌లు కాయడం గమనార్హం. ఇదివరకెన్నడూ లేని విధంగా డేగాపురం, వెంకట్రామన్నగూడెం, సీసలి, ఎస్.యానాం, కొయ్యలగూడెం, వీరవాసరం, మురుముళ్ల తదితర ప్రాంతాల్లో పెద్దపెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏకంగా ‘కోడిపందెం లీగ్ (కేపీఎల్)’ పేరిట బరి నిర్వహించడం విశేషం. చదవండి: మహా కుంభమేళా.. ‘కొబ్బరి’ ఆనంద హేలబీచ్ ఫెస్టివల్ పేరిట సంగీత విభావరి ముసుగులో విభిన్న రకాల జూదాలను కొనసాగించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు ఇతరచోట్ల బరులు ఏర్పాటు కాకుండా, తమ బరివద్దకే పందెం రాయుళ్లు వచ్చేలా గుత్తాధిపత్యం చలాయించారు. ఇక మహిళా బౌన్సర్లు ఈసారి ప్రత్యేకం. పందెంరాయుళ్లు ఫోన్ పే ద్వారా డబ్బులు బదిలీ చేస్తే అయిదు నుంచి పది శాతం కమీషన్ తీసుకుని నగదు అందించేలా బరుల వద్ద ఏర్పాట్లు చేశారు. -
సింహపురి ‘కోడల్లుళ్లు’ వచ్చేశారోచ్!
సంక్రాంతి పందేల్లో కాలు దువ్వేందుకు సింహపురి నుంచి కోడి పుంజులొచ్చేశాయి. నెల్లూరు ప్రాంతంలో పెంచిన కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల పుంజులు పందేలరాయుళ్లను ఆకర్షిస్తున్నాయి. రకాన్ని బట్టి ఒక్కొక్క పుంజు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారులు రావులపాలెం–ఏలూరు హైవే, రద్దీ రోడ్ల వెంబడి వీటిని విక్రయిస్తున్నారు. – సాక్షి, భీమవరం భీమవరం బ్రీడ్నే అక్కడ పెంచి..సంక్రాంతి కోడి పందేలకు ఉమ్మడి గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, వెంప, సీసలి, దుంపగడప, తూర్పు గోదావరి జిల్లాలోని మురమళ్ల, కాట్రేనికోన, వేట్లపాలెం కోడిపందేలకు పేరొందాయి. పెద్ద బరుల్లో రోజుకు 25 నుంచి 30 వరకు పందేలు జరిగితే.. గ్రామాల్లోని చిన్న బరుల్లో జరిగే పందేలకు లెక్కే ఉండదు. సంక్రాంతి మూడు రోజులు వేలాదిగా జరిగే పందేలకు రెట్టింపు కోడిపుంజులు అవసరమవుతాయి. పందేలకు వినియోగించే ‘భీమవరం బ్రీడ్’ పుంజులకు గిరాకీ అంతాఇంతా కాదు. సంక్రాంతి పందేల కోసం ఉండి, ఆకివీడు, చెరుకుమిల్లి, చినఅమిరం, కాళ్ల, కోనసీమలోని అమలాపురం, లంక, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో భీమవరం బ్రీడ్ కోడిపుంజుల పెంపకం ద్వారా గోదావరి జిల్లాల్లో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. భీమవరం బ్రీడ్ పుంజులకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని నెల్లూరీయులు వీటిని అక్కడ పెంచుతున్నారు. అనంతరం వాటిని గోదావరి జిల్లాలకు తెచ్చి విక్రయిస్తున్నారు.నెల ముందే వ్యాపారుల రాకవారం రోజుల్లో సంక్రాంతి నెల పట్టనుండగా.. నెల్లూరు జిల్లాకు చెందిన నాటుకోళ్ల పెంపకందారులు, వ్యాపారులు అప్పుడే గోదావరి జిల్లాల్లో అమ్మకాలు చేసేందుకు కోడి పుంజులతో తరలివస్తున్నారు. ఒక్కొక్కరు 15 నుంచి 20 పుంజులను తెస్తున్నారు. నలుగురైదుగురు గుంపుగా వచ్చి రావులపాలెం–ఏలూరు హైవే వెంబడి, రద్దీ రోడ్లు పక్కన ఖాళీ ప్రదేశాల్లో పుంజుల్ని ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. పందెం కోళ్లలోని దాదాపు అన్ని రకాల జాతులు వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. సాధారణంగా పందేల కోసం గోదావరి జిల్లాల్లో సిద్ధం చేసే పుంజులు చాలా ధర ఉంటాయి. పందెం పుంజులను కొత్త అల్లుళ్ల మాదిరిగా పెంచుతుంటారు. వాటికి మూడు నెలల ముందునుంచే మటన్ కీమా, డ్రైఫ్రూట్స్ వంటి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తుంటారు. శరీర పటుత్వాన్ని పెంచేందుకు వాకింగ్, ఈత కొట్టించడం, నీళ్లపోతలు, శాఖాలు తదితర రూపాల్లో ప్రత్యేకంగా ట్రైనర్లతో శిక్షణ ఇస్తుంటారు. వాటికందించే ఆహారం, శిక్షణను బట్టి ఒక్కొక్క పుంజు ధర రూ.25 వేల నుంచి రూ.లక్ష కూడా దాటిపోతోంది. చూసేందుకు స్థానిక పుంజులకు ఏమాత్రం తీసిపోని విధంగా సైజులు, రంగుల్లో నెల్లూరు పుంజులు ఉంటున్నాయి. పుంజు రంగు, ఎత్తు, బరువును బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేలలోపే ధరలు ఉండటంతో వీటి కొనుగోలుకు పందెంరాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. వాటి కాళ్ల సామర్థ్యం, ప్రత్యర్థిపై దాడిచేసే వేగాన్ని పరీక్షించేందుకు అక్కడే డింకీ పందేలు కట్టి బాగున్న వాటిని బేరమాడి తీసుకుంటున్నారు. నెలరోజుల పాటు వాటికి తగిన మేతను అందించి శిక్షణ ఇవ్వడం ద్వారా పందేలకు సన్నద్ధం చేసే వీలుంటుందంటున్నారు.ఇక్కడే గిరాకీ బాగుంటుంది సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడిపుంజులకు గిరాకీ బాగుంటుంది. నెల్లూరు జిల్లా నుంచి చాలామంది పెంపకందారులు, వ్యాపారులు ఇక్కడకు కోడిపుంజులు తెచ్చి విక్రయిస్తుంటారు. నేను సొంతంగా పెంచిన వాటితో పాటు అక్కడ కొనుగోలు చేసిన పుంజులను తీసుకువచ్చాను. – వెంకటేష్, నెల్లూరు ముందుగానే వచ్చాం నాలుగేళ్లుగా ఏటా సంక్రాంతి ముందు కోడి పుంజులను తీసుకువస్తున్నాం. గతంలో రెండు వారాల ముందు వచ్చేవాళ్లం. మరింత ముందుగా వస్తే పందేలరాయుళ్లు మా వద్ద కొనుగోలు చేసిన పుంజులను పెంచుకునేందుకు బాగుంటుందని కొందరు చెప్పడంతో ఈ ఏడాది నెల రోజులు ముందే వచ్చా. అమ్మకాలు బాగుంటే రూ.10 వేల వరకు మిగులుతాయి. – సంగయ్య, నెల్లూరు -
తూర్పు గోదావరిలోని కోళ్ల పందెల్లలో విషాదం
-
ఏపీలోని వివిధ జిల్లాల్లో కోడి పందాల జోరు
-
తూర్పుగోదావరి జిల్లా: కోడిపందేల్లో విషాదం
-
సంక్రాంతి : కత్తి దూసిన పుంజులు (ఫోటోలు)
-
Cockfight: ‘మకాం’ వేసిన పందెం కోళ్లు
తగరపువలస(భీమిలి): సంక్రాంతి బరిలో కయ్యానికి పందెం కోళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఏడాది పాటు వీటికి శిక్షణ ఇచ్చి, ఆహారాన్ని పెట్టుబడిగా పెట్టిన వ్యాపారులు, రైతులు ప్రస్తుతం వీటి విక్రయాలపై దృష్టి సారించారు. పందెం కోళ్లను సిద్ధం చేసే ప్రాంతాలను మకాం అంటారు. ప్రస్తుతం ఇలాంటి మకాంలు ఉత్తరాంధ్రలో 250కు పైగా ఉన్నాయి. మకాంలలో లక్షలాది పందెం కోళ్లు పోరాటంలో శిక్షణ పొంది కాలు దువ్వుతున్నాయి. వీటిలో పైచేయి సాధించే కోళ్ల కోసం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పందెం రాయుళ్లు ఉత్తరాంధ్రకు వచ్చి మకాంలలో సరైన కోడి కోసం డేగ కళ్లతో వేట మొదలెట్టారు. చదవండి: Good Governance Index 2021: సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ ఇలాంటి మకాంలు ఎక్కువగా భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాలు, తిమ్మాపురం, సాగర్‌నగర్, ఆరిలోవ, నర్సీపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నాయి. పందెం కోళ్లలో సేతువ, కక్కెర, సవల, పాస, రసంగి, డేగ, పచ్చకాకి, అబాస్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏడాది వయసున్న కోళ్లు రూ.15 వేల నుంచి 20 వేలు, ఏడాదిన్నరవి రూ.30 వేలు, నాలుగేళ్ల వయసు వరకూ ఉన్నవి రూ.40 వేల వరకూ ధర పలుకుతున్నాయి. ఒక్క ఉత్తరాంధ్రలోనే రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ వ్యాపారం జరుగుతుందంటే పందెం కోళ్లకున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఒక్కో మకాంలో 50 నుంచి వందలాది కోళ్లుంటాయి. వీటికి ప్రత్యేకంగా రోజుకు నాలుగు బాదం పప్పులు, కోడిగుడ్లు, వారానికోసారి ఖైమా, చోళ్లు, గంట్లుతో పాటు రోజూ రెండు పూటలా తడిపిన ధాన్యాన్ని ఆహారంగా ఇస్తారు. మధ్యాహ్నం వేళల్లో అలసిపోయే వరకూ ఈతకు వదులుతారు. ఏడాది కాలంలో ఒక్కో కోడిపై రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తారు. వీటిని చంటిపిల్లల్లా చూసుకుంటారు. రోగాలు రాకుండా యాంటీబయోటిక్ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇస్తుంటారు. విదేశీ బ్రీడ్లకు భలే డిమాండ్ విశాఖకు చెందిన ఒక మకాం యజమాని రూ.18 లక్షలు వెచ్చించి విదేశాల నుంచి మైలా బ్రీడ్ పుంజును కొనుగోలు చేశారు. దానితో దేశవాళీ కోడిపెట్టలను సంకరం చేయించి.. వెయ్యి పిల్లలను పొదిగించి ఒక్కో కోడిని రూ.5 వేలకు విక్రయించడం ద్వారా ఏడాదిన్నరలో రూ.50 లక్షల ఆదాయం పొందినట్టు చెప్పాడు. ఈ కోళ్లు బరిలోకి దిగితే రూ.లక్షలాది రూపాయలు కొట్టుకొస్తాయని పందెం రాయుళ్లకు గట్టి నమ్మకం. అలాగే ఫిలిప్పీన్స్, పెరూ దేశానికి చెందిన మేలు జాతి కోడి పెట్టలు ఒక్కోటి రూ.6–7 లక్షలు పలుకుతున్నాయి. వీటిని కూడా సంకరం చేయించడం ద్వారా మంచి ఆదాయాన్నిచ్చే పందెం పుంజులను సృష్టిస్తున్నారు. ప్రత్యేక శిక్షణ పొంది పందేలకు సిద్ధంగా ఉన్న కోడిపుంజులు ప్రభుత్వ అనుమతులే కీలకం గతేడాది ప్రభుత్వం అనుమతులు లేని కారణంగా ఉత్తరాంధ్రలో పందెం కోళ్ల వ్యాపారం జరగలేదు. ఒక్క పందెం కోడి పుంజు కూడా విక్రయం కాలేదు. ఈ ఏడాది ప్రభుత్వం అనుమతిపైనే వ్యాపారం ఆధారపడి ఉంటుంది. చాలామంది వచ్చి వారికి నచ్చిన బ్రీడ్లను ఎంపిక చేసుకుంటున్నారు. హైదరాబాద్, ఏలూరు, భీమవరం, నర్సీపట్నం, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల వారితో కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తుంటాం. – ఎన్.వరాహరఘునాథరెడ్డి, తగరపువలస కోళ్లకు రోగం వస్తే.. ఇక అంతే... పందెం కోళ్ల పెంపకం రిస్క్‌తో కూడుకున్నది. పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తున్నప్పటికీ వాటికి సోకే రోగాలపై అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఒక్కోసారి రూ.లక్షలు పోసి కొనుగోలు చేసినా ఎలాంటి ఆదాయం రాకుండానే మృత్యువాత పడుతుంటాయి. నాటు కోళ్లతో పోలిస్తే పందెం కోళ్లకు తెగుళ్లు తక్కువ. ప్రస్తుతం రైతులంతా నాటుకోళ్ల పెంపకంపైనే ఆసక్తి చూపుతున్నారు. రిస్క్ కూడా ఎక్కువే. – నమ్మి ఎర్రినాయుడు, ఆనందపురం -
పోలీసులకు తలనొప్పిగా మారిన పందెం కోడి !
సాక్షి, జగిత్యాల : పందెం కోడి వ్యవహారం పోలీసులకు తలనొప్పిని తెచ్చింది. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైన కోడిని పోలీస్‌స్టేషన్‌లో ఉంచితే.. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పోలీసులు కోడిని అరెస్ట్ చేశారంటూ సోషల్‌మీడియాలో చేసిన పోస్టు చర్చనీయాంశమైంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్‌లో ఈ నెల 22న కొందరు కోడిపందేలు ఆడారు. జిల్లాలోని వెల్గటూర్ మండలం కొండాపూర్‌కు చెందిన తనుగుల సంతోష్ సైతం లొత్తునూర్ ఎల్లమ్మ గుట్ట వద్ద కోడిపందెంలో పాల్గొన్నాడు. సతీశ్ తన కోడికి కత్తులు కట్టి వదిలేందుకు వంగగా.. అది ఒక్కసారిగా లేచి తన్నడంతో సతీశ్ మర్మాంగాలకు గాయమై మృతిచెందాడు. గొల్లపల్లి ఎస్సై జీవన్ సంఘటన స్థలానికి చేరుకుని సతీశ్ మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణం పోయేందుకు కారణమైన కోడి అక్కడే ఉండడంతో ఠాణాకు తీసుకొచ్చి, కొద్దిసేపటి తర్వాత సంరక్షణ కోసం కోళ్ల ఫారానికి తరలించారు. అంతలోనే గుర్తు తెలియని వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కోడిని ఫొటో తీసి పోలీసులు కోడిని అరెస్ట్ చేశారంటూ సోషల్‌మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. దీంతో రాష్ట్రస్థాయి పోలీసు అధికారులు జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన గొల్లపల్లి ఎస్సై జీవన్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సంఘటన ప్రాంతంలో కోడి ఉండటంతో సంరక్షించేందుకే పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చామని, అరెస్ట్ చేయలేదని తెలిపారు. అరగంట తర్వాత కోళ్లఫారానికి తరలించామన్నారు. కోడిపందేలలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చదవండి: కల్లు తాగి వెనక్కి, ఆమె ఒత్తిడి చేయడంతో... తమ్ముడి ఆత్మహత్య.. ఆవేదనతో అన్న కూడా -
చంద్రబాబూ.. ఇలాగేనా వ్యవహరించేది?
సాక్షి, విజయవాడ : టీడీపీ నేతల కనుసన్నల్లో కోడి పందాలు జరుపుతూ.. వేల కోట్లు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విచ్చలవిడిగా కోడి పందాలు, వేలకోట్ల బెట్టింగ్‌లు జరుగుతుంటే హోంమంత్రి పట్టించుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలిగేలా టీడీపీ నేతల పాలన ఉందని విమర్శించారు. మాజీ సీఎం కూతురు, ప్రతిపక్ష నేత చెల్లెలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందిపోయి, ఆమె రాజకీయం చేస్తుందని చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. షర్మిల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక మహిళగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి షర్మిల ఫిర్యాదు చేశారంటే ఆమె ఎంత బాధపడిఉంటుందో అర్థమవుతుందన్నారు. 40 ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు.. షర్మిల వ్యవహారంలో ఇలానేనా వ్యవహరించేదని విమర్శించారు. -
పేటలో బరితెగింపు
పేకాటను కట్టడి చేయాల్సిన పోలీసులే కాపు కాస్తున్నారు.. అరికట్టాల్సింది వారే ఆటాడిస్తున్నారు.. భయపెట్టాల్సి వారే ముడుపుల ముందు మోకరిల్లుతున్నారు. అధికార పార్టీ ఆగడాలను ఆడ్డుకోవాల్సిన వారే అన్యాయాలకు రక్షణ కంచె కడుతున్నారు. ఇదే అదనుగా నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో కోడి పందేలు, పేకాట నిర్వహిస్తూ టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. అమాయక నిరుపేదలను జూదానికి బలి చేసి పచ్చని కుటుంబాల్లో కన్నీటి చిచ్చు రేపుతున్నారు. పర్యవేక్షించాల్సిన పోలీసు ఉన్నతాధికారులు కళ్లుమూసుకుని పోలీసు చట్టాలను వల్లె వేస్తున్నారు. నరసరావుపేట టౌన్: నరసరావుపేట డివిజన్లో జూదం మళ్లీ పురుడు పోసుకుంది. కొంత మంది అవినీతి అధికారుల పుణ్యమా అంటూ జూదం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఫలితంగా అనేక కుటుంబాలు రోడ్డున పడాల్సిన దుíస్థితి నెలకొంది. నివారణకు చర్యలు తీసుకోవాల్సిన పోలీసు సిబ్బందిలో కొందరు జూదంలో ప్రత్యక్షంగా, మరి కొందరు ముడుపులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. కోడి పందేలకు రంగం సిద్ధం నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లొ పేకాట జోరుగా కొనసాగుతుంది. దీనికి తోడు ఏడాది చివరి రోజు వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కోడి పందేలు నిర్వహించేందుకు అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. నరసరావుపేట, రొంపిచర్ల మండలాల సరిహద్దు ప్రాంతంలోని ఓ సరివి తోటలో సోమవారం రాత్రి కోడి పందేల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికిగాను ఓ పోలీస్ అధికారి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు, కొందరు పోలీసుల అండతో ఇతర ప్రాంతాల నుంచి కూడా పేకాట రాయుళ్లు వస్తున్నారు. ప్రస్తుతం డివిజన్లో పోలీసుల బదిలీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూదంపై పూర్తి స్థాయి పర్యవేక్షణ కొరవడింది. దీన్ని ఆసరాగా చేసుకొన్న అక్రమార్కులు కొంత మంది పోలీసు సిబ్బందికి ముడుపులు చెల్లించి జూదం కొనసాగిస్తున్నారు. ఉత్తుత్తి దాడులే.. మండలంలోని లింగంగుంట్ల కాలనీ శివారులో గత బుధవారం రాత్రి దాడులు 8 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి 8 ద్విచక్రవాహనాలు, సుమారు రూ.లక్షా నలభై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అనేక సార్లు లింగంగుంట్ల పరిసరాల్లో పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. ఇక్కడ ఒక వ్యక్తి జూదం నిర్వహిస్తూ అనేక మార్లు పట్టుబడినా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఉప్పు అందిస్తున్న సిబ్బంది దాడులు చేసేందుకు పోలీసులు లింగంగుంట్లకు వెళ్లే లోపే కొందరు పోలీసులు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. దీంతో పేకాట రాయుళ్లు పరారవుతున్నారు. గత బుధవారం అధికారులు దాడులకు వెళ్లే కొద్ది నిమిషాల వ్యవధిలోనే అప్పటి వరకు లక్షల్లో పందేలు కాసిన సుమారు 20 మంది జారుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్లో దీర్ఘకాలికంగా పని చేస్తున్న సిబ్బంది ఒకరు ముందస్తుగా ఉప్పు అందించినట్లు సమాచారం. పట్టుబడ్డ వారిలో ఇద్దరు కానిస్టేబుళ్లు లింగంగుంట్లలో జూదం ఆడుతూ పట్టుబడ్డవారిలో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండటం గమనార్హం. క్రికెట్ బెట్టింగ్‌లో రెండు నెలల క్రితం ఓ కానిస్టేబుల్ పట్టుబడ్డారు. పట్టుబడ్డ కానిస్టేబుళ్లలో ఒకరు జిల్లా రూరల్ ఎస్పీ టీంలో విధులు నిర్వహిస్తుండటంతో పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. కొరవడిన పర్యవేక్షణ.. నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావును వారం రోజుల క్రితం తిరుపతికి బదిలీ చేసి ఆయన స్థానంలో సత్తెనపల్లి డీఎస్పీ వీ కాలేషావలిని ఇన్చార్జిగా నియమించారు. డివిజన్ స్థాయి అధికారి పర్యవేక్షణ లేకపోవటాన్ని ఆసరాగా చేసుకున్న కొంత మంది అవినీతి అధికారులు, సిబ్బంది పేకాట నిర్వహించుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యంగా నాదెండ్ల మండలం, లింగంగుంట్ల కాలనీ, కోటప్పకొండ, పమిడిపాడు, రెడ్డిపాలెం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు, పేకాట, జూదం ఎక్కువగా సాగుతున్నాయి. జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు పేకాటలో పట్టుబడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులకు నివేదించాం. పేకాట, కోడి పందేల నిర్వహణపై సమాచారం ఉంటే తెలియజేయాలి. అక్రమార్కులకు సహకరిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవు. జూదగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోం. –కాలేషావలి, డీఎస్పీ -
కో‘ఢీ’ అంటే చర్యలు తప్పవు!
సాక్షి, కదిరి: కదిరి, పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి హెచ్చరించారు. పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం ఎమ్మార్వో పీవీ రమణ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ ప్రసంగించారు. గ్రామాల్లో ఆయా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పోలీస్‌కు సహకరించి కోడిపందేలు జరగకుండా చూడాలని కోరారు. గతంలో కోడిపందేల కేసుల్లో ఉన్నవారిని ఆయా ఎమ్మార్వోల ఎదుట బైండోవర్ చేయిస్తామన్నారు. కోడి పందేల నిర్వహణకు ఎవరైనా తమ స్థలాలు, తోటలు ఇచ్చినట్లు తెలిస్తే వారిపై కూడా కేసులను నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడిపందేలు నిర్వహించిన వారిపై ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్టు, ఏపీ గేమింగ్ యాక్టుల కింద కేసులు బనాయిస్తామని తెలిపారు. ఇప్పటి నుండి ఈ నెల 24 వరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్టు అమలులో ఉంటుందన్నారు. కోడి పందేల బదులు సంక్రాంతిని పురష్కరించుకొని పట్టణంలో ముగ్గుల పోటీలు నిర్వహిద్దామని, అందులో ప్రతిభ కనబరచిన మహిళలు బహుమతులు అందజేద్దామని సీఐ గోరంట్ల మాధవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు హేమంత్‌కుమార్, సహదేవరెడ్డి, మగ్బుల్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
పందెంకోడి ఆన్లైన్
సాక్షి, అమరావతి: నెట్టింట్లో పందెం కోడి కూత పెడుతోంది. సంక్రాంతికి నెల రోజుల ముందుగానే పుంజుల సందడి మొదలైంది. ఒకప్పుడు పల్లెలకే పరిమితమైన పుంజుల విక్రయం ఇప్పుడు ఆన్లైన్ స్థాయికి ఎదిగింది. పలు వెబ్‌పోర్టల్స్‌లో జాతి కోడి పుంజుల పేరుతో జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. ఉభయ గోదావరితోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలలో సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతుంటాయి. 60 ఏళ్ల క్రితం గోదావరి జిల్లాల్లో మొదలైన ఎడ్ల పందేలు క్రమంగా కోళ్ల డింకీ పందేల(కత్తుల కట్టకుండా) వైపు మళ్లాయి. 25 ఏళ్ల నుంచి పుంజులకు కత్తులు కట్టి బరిలోకి దించి డబ్బులు పందాలు వేసే పద్ధతి మొదలైంది. షామియానాలు వేసి ప్లడ్‌లైట్ల కాంతిలో కోడిపందాలు జాతరను తలపిస్తాయి. పహిల్వాన్లను తలపించే పుంజులు... పందాల కోసం కోడి పుంజులను ప్రత్యేక శిక్షణతో పెంచడం దాదాపు 15 ఏళ్ల నుంచి ప్రారంభమైంది. ఉదయాన్నే ఈత, వేడి నీటి స్నానం, అల్పాహారంగా కోడిగుడ్డు, వేటమాంసం, బాదం, పిస్తా, చోళ్లు, గంట్లు మేత. ఆరోగ్యం కోసం విటమిన్ టాబ్లెట్లు, పశుసంవర్థక శాఖ డాక్టర్లతో వారానికో పర్యాయం వైద్య పరీక్షలు.. ఇలా వీటి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు చాలానే ఉన్నాయి. తరలివస్తున్న ప్రముఖులు మూడు రోజుల కత్తుల సమరం కోసం కోడి పుంజులను ఏడాదిపాటు పహిల్వాన్ల తరహాలో అపురూపంగా సాకుతారు. బరిలో పందెం కోడి కాలుదువ్వి గెలిస్తే దాని ఆసామి విజయగర్వంతో మీసం మెలేస్తాడు. సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలను తిలకించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ, సినీ ప్రముఖులు తరలివస్తుంటారు. గతేడాది క్యాష్‌లెష్.. ఈసారి ఆన్లైన్.. గతేడాది కోడి పందేలపై కోట్లాది రూపాయల బెట్టింగ్‌లకు పెద్ద నోట్ల రద్దు ఇబ్బందికరంగా మారడంతో క్యాష్‌లెష్ పందాలు జరిగాయి. నేరుగా నగదు మార్చకుండా ఆన్లైన్లో నగదు బదిలీ, కాగితాల్లో పందాల మొత్తాలు రాసుకుని బ్యాంక్‌ల ద్వారా లావాదేవీలు సాగాయి. ఈసారి ఆన్లైన్లో కోడి పుంజుల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఓఎల్ఎక్స్, క్విక్కర్, జెడ్ఎజెడ్స్పాట్ డాట్‌కామ్, పిఒఎస్ఒటిడాట్క్లాస్ తదితర వెబ్సైట్లలో పుంజుల ఫొటోలతో సహా అమ్మకాలకు పెట్టడం విశేషం. ఒక్కో పుంజు ధర కనీసం రూ.3,500 నుంచి రూ.50 వేల వరకు ఉంది. పుంజు పెంపకం, జాతి, రంగు, ఎత్తు, బరువును ప్రస్తావిస్తూ ఆన్లైన్ వెబ్సైట్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. రెండు తరాలుగా అమ్మకాలే జీవనాధారం.. సంక్రాంతి సీజన్ కోసం ఏడాదిపాటు కష్టపడి కోడి పుంజులను పెంచుతాం. రెండు తరాలుగా కోడి పుంజుల అమ్మకాలపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మా నాన్న నుంచి మా అన్నదమ్ముల వరకు అంతా కోడి పుంజులను పెంచి అమ్ముకుంటున్నాం. ఈసారి పుంజులు కొనేవారి సంఖ్య తగ్గింది. – తోట నర్సింహారావు, మచిలీపట్నం(కృష్ణా జిల్లా) పందేలను చూసేందుకు రెండు కళ్లూ చాలవు మా ప్రాంతంలో జాతరలా జరిగే కోడి పందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. కొందరు ముందుగానే పందెం కోళ్లు పెంచుతారు. మరికొందరు కొనుక్కుని పందాలు వేస్తుంటారు. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా కొంటున్నారు. – పుచ్చకాయల అబ్బులు, పెదగరువు(పశ్చిమగోదావరి) -
యదేచ్ఛగా కోళ్ల కత్తుల కోలాటం
-
‘కోడిపందాలపై ఇప్పటికిప్పుడు ఆదేశాలివ్వలేం'
న్యూఢిల్లీ: హైకోర్టు ఆదేశాలను అతిక్రమించి ఆంధ్రప్రదేశ్ లో కోడి పందాలు నిర్వహిస్తున్నారని, వాటిని వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో జాతీయ జంతు సంరక్షణ విభాగం పిటిషన్ దాఖలు చేసింది. కోడిపందాలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కొందరు వాటిని నిర్వహించేందుకు సిద్ధపడ్డారని తన పిటిషన్ లో పేర్కొంది. జంతు సంరక్షణ విభాగం సభ్యురాలు గౌరీ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. కోడిపందాలను ఆపాలని ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. -
పందెం కోఢీ!
మిర్యాలగూడ అర్బన్ : సంక్రాంతి పండుగ అనగానే వాకిట్లో రంగురంగుల రథం ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, పతంగులు గుర్తుకు వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటితోపాటు కోడి పందేలు ఆనవాయితీగా వస్తున్నాయి. ఈ పందేలు ప్రస్తుతం తెలంగాణ జిల్లాలకు పాకాయి. సంక్రాంతి పండుగ వస్తుందనగానే పందెంరాయుళ్లు కోడి పందాలకు సిద్ధమవుతూ బరులను రెఢీ చేస్తున్నారు. అంతే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా కోడి పందేలు నిర్వహిస్తూ రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారనేది విశ్వనీయ సమాచారం. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఒక వైపు పోలీసులు హెచ్చరిస్తున్నా.. పందెం రాయుళ్లు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రా ప్రాంతానికి చేరువలో కృష్ణాతీరంలో గుట్టు చప్పుడు కాకుండా ఈ పోటీలు సాగుతున్నాయి. ప్రధానంగా మిర్యాలగూడ, హుజూర్నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోని తోటలు, అటవీ ప్రాంతాన్ని పందెం రాయుళ్లు అడ్డాగా చేసుకుంటున్నారు. తాజాగా మిర్యాలగూడ మండలం బొర్రాయిపాలెం అన్నారంలో రెండు రోజులుగా కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు స్థావరంపై దాడులు చేసి కోడి పందేలు నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.10వేల నగదు, 4 ద్విచక్ర వాహనాలు, ఐదు కోడి పంజులను స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కాగా ఈ దాడిలో కోడి పందేలు ఆడుతున్న 38మందితో పాటు 18 కోడి పుంజులు, భారీగా నగదుసైతం స్వాధీనం చేసుకున్నుట్లు ప్రచారం సాగుతోంది. కానీ ఐదుగురిపై మాత్రమే కేసులు నమోదు చేయడంతో పోలీసుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు స్పందించి కుంటుబాలను వీధిన పడేసే ఇలాంటి పందేలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రూ.20వేల నుంచి రూ.లక్ష పలుకుతున్న పందెంకోళ్లు... ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందాలను నిర్వహించవద్దని అక్కడి కోర్టు తేల్చిచెప్పడంతో కొంత మంది పందెం రాయుళ్లు తెలంగాణ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. పందెంలో ఆడే కోడి పుంజులకు వాటి జాతిని బట్టి రూ.20వేల రూపాయల నుంచి రూ.1లక్ష వరకు ధర పలుకుతున్నట్లు సమాచారం. దీంతో వారు పండుగకు ముందుగానే బరులు సిద్ధం చేసి పందెం కాసేవారిని ఎంచుకుని ప్రచారం కూడా చేస్తున్నట్లు సమాచారం. పట్టణాలకు దూరంగా, తోటల్లో కోడి పందాలతోపాటు పేకాట నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి కుటుంబాలను వీధిన పడేసే కోడి పందేలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
'కోడిపందాలు సంక్రాంతి సంప్రదాయం'
భీమవరం : కోడి పందాల పోటీలు సంక్రాంతి సంప్రదాయమని, సంప్రదాయాన్ని అందరు గౌరవించాలని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. కాగా సంక్రాంతి సందర్భంగా కోలాహలంగా నిర్వహించే కోడిపందాలకు హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. కోడి పందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా సాగుతుందని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడిపందాల పేరుతో జంతువులను హింసిస్తున్నారని పేర్కొంటూ.. పీపుల్ ఫర్ యనిమల్ ఆర్గనైజేషన్, యనిమల్ వెల్ఫేర్ బోర్డు వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ సందర్భంగా కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ... తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అక్కడ తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. కోడిపందాలు ఈ ప్రాంతంలో వందల ఏళ్ల నుండి సంప్రదాయంగా వస్తున్నాయని, దాన్ని కాపాడుకుంటామని అన్నారు. కాగా సంకాంత్రి పండగ పర్వదినాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాలపై కోట్లలో బెట్టింగులు జరుగుతాయి. -
‘బరి’లో రంగ హరి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముక్కనుమనాడూ జిల్లాలో విచ్చలవిడిగా కోడిపందేలు కొనసాగాయి. భోగి పండగ ఉదయం నుంచి సంక్రాంతి, కనుమ వరకు మూడురోజుల పాటు పందేలకు అనధికారిక అనుమతులు తీసుకువచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ముక్కనుమ ఆదివారం కూడా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించాలని ఒత్తిళ్లు తీసుకువచ్చారు. ఫలితంగా ఖాకీలు పట్టించుకోకపోవడంతో ఈ మధ్యకాలంలో ఎప్పుడూలేని విధంగా ముక్కనుమ రోజూ పందెం కోళ్లకు రెక్కలు తెగాయి. ఆదివారం జిల్లావ్యాప్తంగా కోడిపందేలతో పాటు పేకాట, గుండాట, కోతాట విచ్చలవిడిగా కొనసాగాయి. ఒక్క ముక్కనుమ రోజే సుమారు రూ.100 కోట్లు చేతులు మారినట్టు తెలుస్తోంది. భీమవరం ప్రాంతంలో ఒక్క ఆదివారం రోజే కోడిపందేల్లో రూ.50 కోట్లకు పైగా చేతులు మారినట్టు తెలుస్తోంది. వెంప, గొల్లవానితిప్ప, దిరుసుమర్రు, గూట్లపాడు, లోసరి, చినఅమిరం, మత్య్సపురి పాలెం, కొణితివాడ గ్రామాల్లో కోడిపందేలతో పాటు, గుండాట, కోతాటలు జోరుగా సాగాయి. ఉండి నియోజకవర్గంలో ఆదివారం సుమారు 10 రూ.కోట్ల రూపాయల మేర చేతులు మారాయని తెలిసింది. ఆకివీడు మండలం ఆకివీడు, అయిభీమవరం, దుంపగడప, చెరుకుమిల్లి, అప్పారావుపేట తదితర గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి. కాళ్ల మండలం కాళ్ల, కాళ్లకూరు, సీసలి, పెదమిరం, మాలవానితిప్ప, పాలకోడేరు మండలం శృంగవృక్షం, పెన్నాడ, వేండ్ర, మోగల్లు, కోరుకొల్లు, కుముదవల్లి గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించగా అన్ని గ్రామాల్లో పేకాట కేంద్రాలు వెలిశాయి. దెందులూరు నియోజకవర్గం దెందులూరు, గంగన్నగూడెం, జోగన్నపాలెం, పోతునూరు, బి.సింగవరం, పెదపాడు మండలంలో పెదపాడు, అప్పనవీడు గ్రామాల్లో ఆదివారం పొద్దుపోయేవరకు కోడిపందాలు, పేకాట, గుండాట యథేచ్ఛగా సాగాయి. చిన్నపాటి పందేలైతే గ్రామగ్రామాన జరిగాయి. ఇప్పటివరకు పోలీసులు ఆ నియోజవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. నరసాపురం మండలం వేములదీవి, పసలదీవి, కొప్పర్రు, చిట్టవరం, పీతానిమెరక గ్రామాల్లోనూ, మొగల్తూరు మండలం మొగల్తూరు, కేపీపాలెం, శేరేపాలెం, పేరుపాలెంలో ఆదివారం విచ్చలవిడిగా పందేలు జరిగాయి. టీపీ గూడెంకు బెంగళూరు నుంచి.. తాడేపల్లిగూడెం పట్టణం, పెంటపాడు గూడెం మండలాలలో ఆదివారం కూడా పందేలు జోరుగా సాగాయి. రాయలసీమ ప్రాంతానికి చెందినవారితో పాటు బెంగళూరు ప్రాంతానికి చెందినవారు ఈ పందేలలో పాల్గొన్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు మూడు కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఆచంట నియోజక వర్గం పెనుమంట్ర మండలం మార్టేరులో, కొవ్వూరు మండలంలో పశివేదల, తొగుమ్మి, వేములూరు, సీతంపేట,ఐ.పంగిడి గ్రామాల్లో పందాలు నిర్వహించారు. చాగల్లు మండలంలో మీనానగరం, ఉనగట్ల, చిక్కాల, మార్కోండపాడులో నిర్వహించారు. తాళ్లపూడి మండలంలో తాళ్లపూడిలో రెండు శిబిరాలు, మలకపల్లి, పెద్ధేవం, వేగేశ్వరపురం, గజ్జరం, రావూరుపాడుల్లో యథేచ్ఛగా సాగాయి. మన్యంలోనూ జోరుగా పశ్చిమ ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం మండలంలో ఆదివారం కోడిపందేలు కొనసాగాయి. గుండాట, పేకాట, అక్రమంగా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరిగాయి. గుంజవరం, గూటాల, కోయ్యలగుడెం, రామానుజపురం, దుద్దుకూరు, భూసరాజుపల్లి, నందాపురం వీరన్నపాలెం, వేలేరుపాడులోని కమ్మరగుడెం, భూదేవిపేట, జీలుగుమిల్లిలోని తాటియాకులగుడెం, కామయ్యపాలెం, ములగలగుడెం, పి. అంకంపాలెం, రాచన్నగుడెం, కుక్కునూరులోని చీరవల్లి, టి.నర్సాపురంలోని తిరుమలదేవిపేట ప్రాంతాల్లో నాలుగురోజులుగా నిరంతరాయంగా కొనసాగాయి. మెట్టలోనూ.. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి మెట్ట ప్రాంత గ్రామాల్లో కూడా ముక్కనుమ నాడు కోడిపందేలు నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలం కలరాయనగూడెం, ములగలంపాడు , కామవరపుకోట మండలం వెంకటాపురం, కళ్లచెర్వు, బొర్రంపాలెం అడ్డరోడ్డు, జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరం, దేవులపల్లి గ్రామాల్లో ఆదివారం రాత్రి పొద్దుపోయేవరకు పందేలు నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం, గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామాలలో మధ్యాహ్నం వరకూ పందేలు జరిగాయి. ఇక న్యాయ పోరాటం.. లాయర్ రాయల్ మునుపెన్నడూ లేనివిధంగా ముక్కనుమ నాడు కూడా బరితెగించి కోడిపందేలు సాగించిన నిర్వాకంపై న్యాయపోరాటం చేస్తామని ఏలూరుకు చెందిన న్యాయవాది పీడీఆర్ రాయల్ వెల్లడించారు. ఇప్పటికే పలువురు సీఐలు, ఎస్సైలకు లీగల్ నోటీసులు పోస్ట్ చేశామని చెప్పారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వరుసగా నాలుగురోజుల పాటు పోలీసులు అనధికారిక అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. ఇప్పటికే తాము ఎవరెవరు కోడిపందేలు ఆడారు.. ఎక్కడెక్కడ ఆడించారు అనే వీడియో క్లిప్పింగ్స్ తెప్పించామని చెప్పారు. నిర్వాహకులు, పందెంగాళ్లపై కోర్టు ధిక్కార కేసులు నమోదు చేస్తామని రాయల్ తెలిపారు. -
కోళ్లతో కోట్లాట
యథేచ్ఛగా కోడి పందేలు తొలి రోజే చేతులు మారిన రూ.50 కోట్లు పందేల శిబిరాల్లో కోతాట, గుండాట బరుల్లో ఏరులై పారిన మద్యం ఏలూరు (ఆర్ఆర్ పేట) :జిల్లాలో ఎక్కడికక్కడ కోడి పందేలు యథేచ్ఛగా సాగాయి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంప్రదాయాన్ని తమనుంచి దూరం చేయలేరంటూ కోడి పుంజులను బరులకు తీసుకెళ్లి పందేలరాయుళ్లు సరదా తీర్చుకున్నారు. ఓ వైపు రాజకీయ నాయకులు.. మరోవైపు ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినీ నటులు, క్షణం తీరికలేని వ్యాపార వేత్తలు సైతం గురువారం కోడి పందేల్లో మునిగి తేలటం కనిపించింది. సినీ సంగీత దర్శకుడు కోటి, ‘స్వామి రారా’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుధీర్‌వర్మ వంటి ప్రముఖులు బరుల వద్ద తళుక్కుమన్నారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్ల వంటి ప్రజాప్రతినిధులే కోడి పందాలను ప్రారంభిం చారు. తొలి రోజున కోడి పందేల్లో సుమారు రూ.50 కోట్లు చేతులు మారాయని అంచనా. పందాల మాటున పేకాట, కోతాట, గుండాట, మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి. ఊరూరా పందేలే భీమవరం పరిధిలోని వెంప, భీమవరం ప్రకృతి ఆశ్రమం, గొల్లవానితిప్ప, లోసరి, దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, గూట్లపాడు, వీరవాసరం, కొణితవాడ, నౌడూరు, మత్స్యపురి, ఆకివీడు మండలం ఐ.భీమవరం, అప్పారావుపేట, దుంపగడప, ఆకివీడు, కుప్పనపూడితోపాటు సీసలి, శృంగవృక్షం, పాలకోడేరు, మోగల్లు, జువ్వలపాలెం, కాళ్ల గ్రామాల్లో పందేలు జోరుగా సాగాయి. ‘స్వామి. రారా’ డెరైక్టర్ సుధీర్‌వర్మ కొణితివాడ వచ్చారు. ఏలూరు సమీపంలోని జాలిపూడి, మాదేపల్లి, దెందులూరు,గోపన్నపాలెం, గాలాయిగూడెం, కొవ్వలి, కొప్పాక, పెదవేగి, బి.శింగవరం, పెదపాడు, హనుమాన్ జంక్షన్ శివారు, పెదకడిమి, దుగ్గిరాలలో పందేలు జరిగాయి. ఉంగుటూరు పరిధిలో గుండుగొలను, నారాయణపురం, నిడమర్రు మండలం పత్తేపురం, గణపవరం మండలం అర్ధవరంలో భారీస్థాయిలో పందేలు జరిగాయి. ఇవికాక నియోజకవర్గంలోని మరో 40 బరులు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూములు, పెదతాడేపల్లి, పెంటపాడు, ప్రత్తిపాడు, అలంపురంలలో పందేలు వేశారు. తణుకు పరిధిలోని వేల్పూరు, తేతలి, దువ్వ, మండపాక, ఇరగవరం, అయినపర్రు, పేకేరు, అత్తిలి, వరిఘేడు, పాలూరు, తేతలిలో పందేలు జోరందుకున్నాయి. కొవ్వూరు పరిధిలో కొవ్వూరు, తోగుమ్మి, ఐ.పంగిడి, సీతంపేట, పశివేదల, చాగల్లు మండ లం మీనానగరం, ఊనగట్ల, చిక్కాల, బ్రాహ్మణగూడెం, తాళ్లపూడి, పెద్దేవం, వేగేశ ్వరపురం, రావూరుపాడు, మలకపల్లిలో పందేలు నిర్వహించారు. చింతలపూడి పరిధిలో రాఘవాపురం, సీతానగరం, లింగపాలెం మండలం ములగలంపాడు, కొణిజర్ల, అయ్యప్పరాజుగూడెం, ధర్మాజీగూడెం, కేఎస్ రామవరం, రావికంపాడు, కళ్లచెరువు, యడవల్లి, లక్కవరం, దేవులపల్లి, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలలో పోటీలు మొదలయ్యాయి. గోపాలపురం పరిధిలో దేవరపల్లి, వెంకటాయపాలెం, రాజంపాలెం, గుడ్డిగూడెం, చిన్నాయిగూడెం, అనంతపల్లి, ప్రకాశరావుపాలెం, దూబచర్ల, పోతవరం, ద్వారకాతిరుమల, పంగిడిగూడెంలో ప్రధాన బరులు ఏర్పాటు చేయగా పలుచోట్ల మరో 15 చిన్న బరులు ఏర్పాటు చేశారు. నరసాపురం పరిధిలో చినమామిడిపల్లి, పితానిమెరక, వేములదీవి, దర్భరేవు, కొప్పర్రు, చిట్టవరం, మొగల్తూరు, వెంప, ముత్యాలపల్లి, శేరేపాలెంలలో ప్రధాన బరులు ఉండగా, మరో 10 ప్రాంతాల్లోనూ పందేలు వేశారు. నిడదవోలు, శింగవరం, ఖండవల్లి, ఉండ్రాజవరం, పెరవలిలో ప్రధాన బరులు ఏర్పాటయ్యా యి. ఉండి పరిధిలోని మహదేవపట్నం, ఉండి, పాలమూరు, వేండ్ర, చిలుకూరులో ప్రధాన బరులు ఏర్పాటయ్యాయి. పాలకొల్లు పరిధిలో పూలపల్లి బైపాస్ రోడ్డు, పూలపల్లి, కలగంపూడి, యలమంచిలి, కాజ, కొంతేరు, బూరుగుపల్లి, వడ్లవానిపాలెం, మట్లపాలెం, పోడూరు, జిన్నూరు, కవిటం బరుల్లో సందడి కనిపిం చింది. పూలపల్లి బైపాస్ రోడ్డులో బరి వద్ద సంగీత దర్శకుడు కోటి, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు సందడి చేశారు. పోలవరం పరిధిలో పోలవరం, గూటాల, సింగవరం, చేగొండపల్లి, రామానుజపురం, జీలుగుమిల్లి, తాటియాకులగూడెం, రాచన్నగూడెం, టి.నర్సాపురం, అప్పలరాజుగూడెం, తిరుమలదేవునిపేట, బుట్టాయగూడెం, దుద్దుకూరు, వీరన్నపాలెం ప్రాంతాల్లోనూ పందేలు మొదలయ్యాయి. ఆచంట, వల్లూరు, పెనుమంట్ర మండలం మార్టేరు, పోడూరు, పెనుమంట్ర, పెనుగొండ, వడలి, దొంగరావిపాలెం, గుల్లపర్రు, పెండ్లికూతురమ్మ చెరువు గ్రామాల్లోని బరుల్లోనూ కోడి పందేలు జరిగాయి. -
కదనానికి కౌంట్‌డౌన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఎవరేమన్నా, ఏదేమైనా..దాదాపు రెండు వారాలుగా సిద్ధమవుతూ వచ్చిన బరుల్లో పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. కోడిపుంజులు కంఠాలు రిక్కించి, కాళ్లే మారణాస్త్రాలుగా లంఘించే పోరు మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. జిల్లాలో కోనసీమలో లంకలు, మెట్టలో గ్రామ శివారు ప్రాంతాల్లో కోడిపందేలకు రంగం సిద్ధమైంది. కొన్ని బరుల్లో బారికేడ్లు, కుర్చీలు, ఇతర ఏర్పాట్లకు రూ.రెండు లక్షల వరకూ ఖర్చు చేశారంటే.. పందేలు ఏ స్థాయిలో సాగుతాయో ఊహించుకోవచ్చు. ఇక వీటి నిర్వహణను సైతం పోటీ పడి రూ.లక్షలు వెచ్చించి దక్కించుకున్న వారున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే పందేలకు హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల నుంచి ప్రముఖులు సైతం తరలివస్తున్నారు. ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో స్థిరపడినవారు సైతం పండగకు సొంతూరు వచ్చి.. పందేలకు సిద్ధమైపోతున్నారు. పండగ మూడురోజులూ జిల్లాలోని బరుల్లో దాదాపు రూ.వంద కోట్ల మేర చేతులు మారతాయని అంచనా. ఫ్లడ్‌లైట్లు, షామియూనాలు.. కోనసీమలో ఐ.పోలవరం మండలం మురమళ్ల, అల్లవరం మండలం గోడిలంకల్లో భారీ బరులు సిద్ధం చేశారు. ఫ్లడ్‌లైట్లు, షామియానాలతో పాటు గుండాట బోర్డులు సిద్ధం చేస్తున్నారు.ఐ.పోలవరం మండలంలో గతంలో ఎదుర్లంక, కేశనకుర్రు, మురమళ్లలో పందేలు జరిగేవి. ఇప్పుడు ఒక్క మురమళ్లలోనే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పందేలను తిలకించేందుకు కొందరు ప్రజాప్రతినిధులు, మంత్రులతో పాటు తెలంగాణ నుంచి కూడా కొందరు రాజకీయ నాయకులు వస్తారనే ప్రచారం జరుగుతోంది. కాట్రేనికోన మండలం చెయ్యేరులో గతంలో జరిగిన పందేలను ఐజీ స్థాయి పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు వీక్షించిన సందర్భాలున్నాయి. ఈ మండలంలో గెద్దనపల్లి, నడవపల్లి, దొంతికుర్రు, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, ఎస్.యానాం, చల్లపల్లి, గొల్లవిల్లి, గాడవిల్లి, భీమనపల్లి, అల్లవరం మండలం గుండెపూడి, రాజోలు నియోజకవర్గంలో మలికిపురం, వి.వి.మెరక, సఖినేటిపల్లి, ఆత్రేయపురం మండలం లొల్ల, పేరవరం, తాడిపూడి, పులిదిండిల్లో బరులు సిద్ధమయ్యూయి. మిగిలిన చోట్లా పందేలకు సై.. రాజానగరం మండలం దివాన్‌చెరువు, పుణ్యక్షేత్రం, కల్వచర్ల, తోకాడ, మల్లంపూడి, కోరుకొండ మండలం శ్రీరంగపట్నం, నర్సాపురం, సీతానగరం మండలం పెదకొండేపూడి, రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి, కవలగొయ్యి, శాటిలైట్ సిటీ, పిఠాపురం టౌన్‌తో పాటు పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోనూ బరులు సిద్ధమయ్యాయి. ఇక గుండాటలు, పేకాటలు యథావిధిగా జరగనున్నాయి. మెట్ట ప్రాంతంలో కిర్లంపూడిలో పందేలకు భారీ ఏర్పాట్లు చేశారు. సామర్లకోట మండలం వేట్లపాలెం, మేడపాడు, పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం, జి.రాగంపేటల్లో పందేలు జరగనున్నాయి. తుని మండలం తేటగుంట, వి.కొత్తూరు, వల్లూరు, తొండంగి మండలం ఏవీ నగరం, తొండంగి, కోటనందూరు మండలం కె.ఎ.మల్లవరం, అల్లిపూడిల్లో, విశాఖ-తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న కె.ఒ. మల్లవరంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరప మండలంలో గొర్రిపూడి, అరట్లకట్ట, వేళంగి, యండమూరు, పెనుగుదురు, నడకుదురు గ్రామాల్లో, కాకినాడ రూరల్ మండలంలో పండూరు, నేమాం, వాకలపూడి, వలసపాకల, తూరంగి తదితర గ్రామాల్లో పందేల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఏజెన్సీలోనూ.. ఏజెన్సీలో గంగవరం మండలం ఓజుబంద, దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్, మండల కేంద్రం వీఆర్‌పురంలలో భారీగా పందేలు జరగనున్నాయి. ఓజుబంద, ఫజుల్లాబాద్ మైదాన ప్రాంతాలకు సమీపంలో ఉండటంతో అక్కడ పందేలను చూడటానికి భారీ సంఖ్యలోనే వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. -
రూ.100 కోట్ల కోఢీ!
కోడిపందేల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతామంటూ పోలీసులు చేస్తున్న హెచ్చరికలు బేఖాతరు అవుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున పందేలు నిర్వహించేందుకు పశ్చిమగోదావరి జిల్లాలోని పలుప్రాంతాలలో ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. కోడిపందేలతోపాటు యాథావిధిగా గుండాట, పేకాట, కోత ఆటలను కూడా నిర్వహించేందుకు పందెగాళ్లు సిద్ధమవుతున్నారు. మొత్తంగా పందేలలో రూ.100కోట్లు చేతులు మారనున్నాయని అంటున్నారు. - పాలకొల్లు టౌన్ సిద్ధమవుతున్న బరులు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానంగా ఐ.భీమవరం, వెంప, నిడదవోలు, తాడేపల్లిగూడెం, పూలపల్లి, కలగంపూడి, కొప్పాక ప్రాంతాల్లో జూదాలు నిర్వహిస్తారు. ఇక్కడేగాకుండా అనేక చిన్న గ్రామాల్లో సైతం పందేల నిర్వహణకు బరులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నిర్వాహకులు రంగం సిద్ధం చేశారు. బరుల్లో కోడి పుంజు సామర్థ్యాన్ని బట్టి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ఒక పందెం జరుగుతుంది. వీటితోపాటు పందేలు చూడడడానికి వెళ్లేవారు ఒక్కొక్క పందెంపై రూ.పది లక్షల వరకు పై పందేలు వేస్తుంటారు. కోడిపందేలపై ఆసక్తి ఉన్న ఎన్ఆర్ఐలు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు పండగ మూడురోజులు ప్రత్యేక ఏర్పా ట్లు చేసుకుని ఈ ప్రాంతాలకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే కోడిపందేల ముసుగులో నిర్వహించే గుండాట, కోత ఆటల్లో సామాన్య, మధ్యతరగతిప్రజలు పెద్ద ఎత్తున పందాలు కాస్తుంటారు. వీళ్లలో నష్టపోయేవారు అధికంగా ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు జిల్లాలోని కోడిపందేల బరులకు హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, బెంగళూరు, తమిళనాడు నుంచి అనేకమంది ప్రముఖులు వస్తుంటారు. ఇప్పటికే పండగ మూడురోజులు బస చేయడానికి పందేలు జరిగే ప్రాంతాల్లోని లాడ్జిలు, గెస్ట్‌హౌస్‌లు బుక్ చేసుకున్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా పందేలకు కోళ్లను సిద్ధం చేసేవారు జిల్లాలో సుమారు 40 మంది వరకు ఉన్నారని చెబుతున్నారు. వీరు ప్రధానంగా ఢీకొట్టే నెమలి, డేగ, పచ్చకాకి, పింగళి, రసింగ్, కేతువ వంటి పందెం కోళ్లను సిద్ధం చేస్తారు. కోడిపుంజు సామర్థ్యాన్ని బట్టి పందెంగాళ్లు వారి నుంచి కొనుగోలు చేసి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన కోడిపందేల బరుల్లో దింపుతారు. కుక్కుటశాస్త్రం ప్రకారం కొనుగోళ్లు పందేల నిర్వాహకులు చాలామంది కుక్కుటశాస్త్రాన్ని అనుసరిస్తారని చెబుతున్నారు. పందెం జరిగే రోజు తిధిని బట్టి ఏ కోడిపుంజు గెలుస్తుందో అంచనా కట్టి రూ.లక్ష ల్లో కొనుగోలు చేసి మరీ పం దేలు కాస్తారని చెబుతున్నారు. జిల్లాలో కోడిపందేల నిర్వాహకులు రూ.లక్షలు ఖర్చుచేసి భారీ టెంట్లు, బరులు ఏర్పాటు చేస్తారు. సంప్రదాయంగా వస్తున్న సంక్రాంతి కోడిపందేలు జరగాల్సిందేనని నిర్వాహకులు చెబుతున్నారు. పోలీసులు ఎంత అడ్డుకోవాలని చూసినా జిల్లాలో అన్నిప్రాంతాల్లో సంక్రాంతి 3 రోజులు కోడిపందేలు జరిగి తీరతాయని నిర్వాహకులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఆస్తుల తనఖాకూ సిద్ధం కోడిపందేల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆస్తులను వడ్డీ వ్యాపారులకు తనఖా పెడుతుంటారు. గత ఏడాది యలమంచిలి మండలంలో ఒక వ్యక్తి రూ.లక్షల్లో పందేలు కాసి చివరకు చేతులు కాల్చుకుని తనకున్న ఎకరం పొలాన్ని అమ్మి వడ్డీ వ్యాపారులకు చెల్లించాడు. డెల్టాప్రాంతంలో కోడిపందేల రాయుళ్ల ఆస్తులు తనఖాలు పెట్టుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడానికి వడ్డీ వ్యాపారులు సిద్ధంగా ఉంటారు. భీమవరం కేంద్రంగా ఈ దందా నడుస్తోందనేది బహిరంగ రహస్యం. కాగా, కోడి పందేల ముసుగులో దొంగనోట్ల చలామణీ కూడా విచ్చలవిడిగా సాగుతుంది. -
‘పుంజు’కున్న ఏర్పాట్లు
కోడిపందేలకు సమాయత్తమవుతున్న పందెగాళ్లు ఆ మూడురోజులూ జరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్న నిర్వాహకులు మరోపక్క హైకోర్టు ఆదేశాలు, ఎస్పీ వ్యాఖ్యలతో ఉత్కంఠ జంగారెడ్డిగూడెం :కోడిపందేలు, జూదాలకు పోలీసులు ‘నై’ అంటున్నా పందెగాళ్లు మాత్రం ‘సై’ అంటూ ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. ఏటా సంక్రాంతి సీజన్లో పండగకు ముందు కోడిపందేలు, జూదాలపై పోలీసులు దాడులు చేయడం, వాటిపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించడం, ఆ తరువాత పండగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలివేయడం షరా మామూలైంది. ఈ నేపథ్యంలో పండగ మూడురోజులు కోడిపందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు సమాయాత్తమవుతున్నారు. ఆ మూడు రోజులు ఎట్టిపరిస్థితుల్లోను కోడిపందేలు జరిగి తీరుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారు బరులు సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, బైపాస్‌రోడ్డు జంక్షన్లో ఏటా భారీఎత్తున కోడిపందేలు నిర్వహిస్తారు. కామవరపుకోట మండలం వెంకటాపురం, కళ్లచెరువుల్లో భారీగా కోడిపందేలు జరుగుతాయి. తూర్పు, పశ్చిమ, కృష్ణా, ఖమ్మం జిల్లాల నుంచే గాక పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా పందెగాళ్లు వస్తుంటారు. భారీ, మధ్యతరహా, చిన్న స్థాయి పందేలకు వేరువేరుగా బరులు ఏర్పాటు చేస్తుంటారు. ఆ మూడురోజులు జరుగుతాయని ధీమా ఒకపక్క జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గతం కాదు, ఇప్పుడు చూడండి అని కోడిపందేలపై వ్యాఖ్యానించడం, మరోపక్క హైకోర్టు కోడిపందేలు జరగకుండా నిరోధించమని ప్రభుత్వాన్ని ఆదేశించడం, ఈ ఏడాది కోడిపందాలు జరగడంపై సందిగ్ధత నెలకొందని కొందరు పేర్కొంటున్నారు. అయితే ఏదిఏమైనా ఆ మూడు రోజులు జరిగి తీరుతాయని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఏర్పాట్లు జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో చాలాచోట్ల ఒక మోస్తరు కోడిపందేలు నిర్వహిస్తారు. బుట్టాయగూడెం మండలంలో యర్రాయగూడెం, వెలుతురువారిగూడెం, మర్రిగూడెం, దొరమామిడి, దుద్దుకూరు, అచ్చియపాలెం, కొవ్వాడలలో, టి.నరసాపురంలో, జీలుగుమిల్లి మండలంలో కామయ్యపాలెం, ములగలంపల్లి, పాలచర్ల తదితర గ్రామాల్లో, గోపాలపురం మండలం వెంకటాయపాలెం,గుడ్డిగూడెం, హుకుంపేటలో కోడిపందేలు జరుగుతాయి. కొయ్యలగూడెం మండలం రాజవరం, కన్నాపురం తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తారు. చింతలపూడి మండలం వెంకటాపురంలో పెద్ద ఎత్తున కోడిపందాలు జరుగుతాయి. సీతానగరం, చింతంపల్లి, తిమ్మిరెడ్డిపల్లి, రేచర్లలో పందేలు జరుగుతాయి. లింగపాలెం మండలం కొణిజర్ల, ములగలంపాడులో భారీ కోడిపందేలు జరుగుతాయి. జంగారెడ్డిగూడెం మండలానికి వచ్చేసరికి లక్కవరం, పేరంపేట, తాడువాయి, పంగిడిగూడెం, గుర్వాయిగూడెం, తిరుమలాపురం, కేతవరం, స్థానిక సుబ్బంపేటలలో ఒక మాదిరి కోడిపందేలు జరుగుతాయి. నిర్వాహకులు ఏర్పాట్లకు సమాయాత్తమవుతుంటే, పోలీసులు ఏం చేస్తారో అన్న ఉత్కంఠ పందెగాళ్లలో ఉంది. -
కోడి పందాలపై హైకోర్టులో విచారణ
సంక్రాంతికి ఏటా నిర్వహించే కోడి పందాలపై మంగళ వారం హైకోర్టులో విచారణ జరిగింది. పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను హై కోర్టు విచారణకు స్వీకరించింది. కోడి పందాలు చారిత్రక సంప్రదాయమని.. వాటిని కొనసాగించాలని బీజేపీ నేత రామకృష్ణం రాజు వాదించారు. మరో వైపు.. కోడి పందాలు జీవ హింసగా పేర్కొంటూ పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ సంస్థ తమ వాదనలు తెలియజేసింది. వీటి పై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. -
‘సీఎంను కలిశాం.. మంత్రులతో మనకేంటి’
‘సంక్రాంతి పండక్కి కోడిపందాలు వేయకుండా ఎవడ్రా మనల్ని ఆపేది. పండగ వరకు మీ ఇష్టమొచ్చినట్టు ఆడుకోండి.. నేను చూసుకుంటా..’ పందేల రాయుళ్లకు టీడీపీ ప్రజాప్రతినిధి ఇచ్చిన భరోసా ఇది. పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ మల్లెల లింగారెడ్డి నాలుగు రోజుల క్రితం ఏలూరు మార్కెట్ యార్డు ప్రాంగణంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి కూడా ఉన్నారు. అక్కడ అధికారులతో మాట్లాడిన అనంతరం తిరిగి వెళ్తుండగా.. పౌర సరఫరాల శాఖ గోడౌన్ల పరిసరాల్లోని యువకులు వారి వద్దకు వచ్చారు. ‘సార్.. ఈసారి కోడిపందాల పరిస్థితి ఏమిటి. పోలీసులతో ఏమైనా ఇబ్బంది ఉంటుందా’ అని ఆ ప్రజాప్రతినిధిని అడిగారు. ఆయన ‘ఆడుకోండ్రా. ఫుల్లుగా ఎంజాయ్ చేయండి’ అని అభయం ఇచ్చేశారు. కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతామని ఓ పక్క పోలీసు అధికారులు హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఎలా ఉందనేందుకు ఆ ఘటనే నిదర్శనం. వాస్తవానికి ఆ ప్రజాప్రజానిధి ఇలాకాలో ఎప్పటి నుంచో కోడిపందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అక్కడే కాదు.. ఏలూరు నగరం చాటపర్రు రోడ్డులోని ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి షెడ్డులోనూ జోరుగా పందేలు నిర్వహిస్తున్నారు. భీమవరంలోని ప్రకృతి ఆశ్రమం ప్రాంతంలోను, రూరల్ మండలం వెంప, లోసరి, వీరవాసరం మండలం కొణితి వాడ, నౌడూరు జంక్షన్లలో భారీ ఎత్తున పందేలు నిర్వహించేందుకు బరులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడిపందేలు ఆడిన, ఆడించిన చరిత్ర ఉన్న నేతలను బైండోవర్ చేయాల్సిందిగా జిల్లా పోలీసు అధికారులు ఆదేశాలిస్తే.. ఆ నోటీసులను పందెగాళ్లకు ఇచ్చే ధైర్యం కూడా ఖాకీలు చేయలేకపోతున్నారు. సంప్రదాయాల ముసుగులో విష సంస్కృతికి బీజం వేస్తున్న అధికార పార్టీ నేతలను అడ్డుకునే దమ్ము, ధైర్యంలేని పరిస్థితి చూస్తుంటేనే.. ఈసారి కళ్లెం లేకుండా పందెంకోళ్లు విచ్చలవిడిగా ఎగురుతాయని అర్థమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో ఉన్నతాధికారులు విజయవాడకు తరలిరాగా, స్వయంగా చంద్రబాబే మన జిల్లాకు రావడంతో ఇక్కడ అధికారులు ఖుషీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం వచ్చిన సీఎంను జిల్లా అధికారులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా కొత్త సంవత్సరం తొలి రోజు జిల్లాకు చెందిన మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావును జిల్లాస్థాయి అధికారులెవరూ పట్టించుకోలేదు. తాడేపల్లిగూడెంలో ఉండే మాణిక్యాలరావు సీఎం పర్యటనలో పాల్గొనేందుకు ఏలూరు రావడంతో.. ఎదురుపడినప్పుడు మొక్కుబడి శుభాకాంక్షలు చెప్పిన అధికారులు ఇక్కడే నివాసముంటున్న పీతల సుజాత వద్దకు పలకరింపునకు కూడా వెళ్లలేదు. కలెక్టర్, డీఐజీ, ఎస్పీ, జాయింట్ కలెక్టర్‌తోపాటు.. చివరకు ఆర్డీవో కూడా మంత్రిని కూడా కలి సేందుకు రాలేదని పీతల వర్గీయులు మదనపడుతున్నారు. ఇతర జిల్లాల మంత్రులు వచ్చినప్పుడు హడావుడి చేసే అధికారులు జిల్లాలోని మంత్రులను జనవరి 1న మర్యాదపూర్వకంగా కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. దళిత మంత్రి కాబట్టే సుజాతను గౌరవించడం లేదని ఆమె వర్గీయులు, భాజపాకు చెందిన మంత్రి కాబట్టే పైడికొండలను పట్టించుకోవడం లేదని కమల నాథులు పేర్కొంటున్నారు. ఆ వర్గాల వాదనలు ఎలా ఉన్నా.. వారానికోసారి ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి నేరుగా అధికారులతోనే మాట్లాడుతుంటే.. మంత్రులకు ప్రొటోకాల్ ఏమిటన్న భావన అధికార వర్గాలకు వచ్చేసిందన్నది ఎవరు ఔనన్నా.. కాదన్నా తిరుగులేని వాస్తవం. -
బడా పందెగాళ్లకు బందీలై..
‘పచ్చ’ పందేల రాయుళ్లను బైండోవర్ చేయించలేని ఖాకీలు నిర్వాహకులు, ఆటగాళ్లంతా టీడీపీ నాయకులే చిన్నాచితకా వ్యక్తులపైనే ప్రతాపం అధికార పార్టీ నేతల జోలికి వెళ్లాలంటే భయం సాక్షి ప్రతినిధి, ఏలూరు : సంక్రాంతి నేపథ్యంలో ‘పుంజు’కుంటున్న కోడిపందాలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా సాక్షాత్తు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోడిపందాల నిర్వహణకు ఎవరికీ అనుమతిచ్చే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎవరైనా కోడి పందాలు నిర్వహించినా, జూదమాడినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు స్పష్టం చేసింది. కానీ.. కోడి పందాల ఖిల్లా అయిన మన జిల్లాలో పందాల నిర్వాహకులు, జూదగాళ్లలో అధిక శాతం మంది అధికార తెలుగుదేశం పార్టీ నాయకులే ఉండటంతో పోలీసులు ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తున్నారు. చిన్నాచితకా పందేల రాయుళ్లపై ప్రతాపం చూపించి బైండోవర్ చేయిస్తున్న పోలీసులు అధికార పార్టీ నేతల జోలికి వెళ్లే సాహసం చేయడం లేదు. గతంలో కోడిపందాలు నిర్వహించిన చరిత్ర గలవారిని, ప్రస్తుతం పందాల నిర్వహణకు సమాయత్తమవుతున్న వారిని ముందుగానే బైండోవర్ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆయా స్టేషన్ల పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాటిని జిల్లావ్యాప్తంగా ఖాకీలెవరూ పట్టించుకోవడం లేదు. ఆ ఎమ్మెల్యేను ఎవరు బైండోవర్ చేయగలరు? జిల్లా కేంద్రానికి సమీపంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేకి కోడిపందాల విషయంలో ఘన చరిత్రే ఉంది. సదరు ప్రజాప్రతినిధిని బైండోవర్ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినా ఇంతవరకు ఆ ప్రాంత పోలీసులు ఆ విషయం ఆలోచించే సాహసం కూడా చేయడం లేదు. పవర్ దన్నుతో అధికారులపై దాడుల చేసే చరిత్ర ఉన్న ఆ నేతకు భయపడిపోయారనుకున్నా.. కనీసం ఏలూరులోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా బైండోవర్ చేయించలేని స్థితిలో పోలీసులు కొట్టుమిట్టాడుతున్నారు. పందెం కోళ్లను పెంచుతూ ఇటీవల వార్తల్లోకి ఎక్కిన ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిని రూరల్ పోలీస్ స్టేషన్లో బైండోవర్ చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇంతవరకు ఆయన జోలికి వెళ్లలేకపోయారు. ఏలూరు నగరానికి చెందిన మరో ఇద్దరు టీడీపీ నేతల పేర్లు బైండోవర్ల జాబితాలో ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మంగళవారం రాత్రి నగర టీడీపీ నేత ఇంట్లో పందేలకు సిద్ధంగా ఉన్న 13 కోళ్లను పోలీసులు పట్టుకున్నారు. అధికార పార్టీ నాయకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఆ కేసును రాత్రికి రాత్రే నిర్వీర్యం చేసేశారు. భారీస్థాయిలో బరులు సిద్ధం కాకముందే బడా కోడిపందేల రాయుళ్లను బైండోవర్ చేయించలేని పోలీసుల తీరు చూస్తుం టే.. ఈ ఏడాది గతంకంటే ఎక్కువగా.. అడ్డూఅదుపు లేకుండా కోడిపందాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. -
గ్రౌండ్ రిపోర్ట్ : పందెం కోడి.. కూసింది!