'కోడిపందాలు సంక్రాంతి సంప్రదాయం'
Published Mon, Dec 26 2016 8:11 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
భీమవరం : కోడి పందాల పోటీలు సంక్రాంతి సంప్రదాయమని, సంప్రదాయాన్ని అందరు గౌరవించాలని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. కాగా సంక్రాంతి సందర్భంగా కోలాహలంగా నిర్వహించే కోడిపందాలకు హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. కోడి పందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా సాగుతుందని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోడిపందాల పేరుతో జంతువులను హింసిస్తున్నారని పేర్కొంటూ.. పీపుల్ ఫర్ యనిమల్ ఆర్గనైజేషన్, యనిమల్ వెల్ఫేర్ బోర్డు వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ సందర్భంగా కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ... తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అక్కడ తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. కోడిపందాలు ఈ ప్రాంతంలో వందల ఏళ్ల నుండి సంప్రదాయంగా వస్తున్నాయని, దాన్ని కాపాడుకుంటామని అన్నారు. కాగా సంకాంత్రి పండగ పర్వదినాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాలపై కోట్లలో బెట్టింగులు జరుగుతాయి.
Advertisement
Advertisement