grandi srinivas
-
టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..
-
భీమవరంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
-
అధికారం కోసం నీతిమాలిన పొత్తులు..బాబుపై గ్రంధి శ్రీనివాస్ కౌంటర్
-
అల్లూరి ఒక మహోన్నత శక్తి
భీమవరం(ప్రకాశం చౌక్)/కొమ్మాది: ‘అల్లూరి సీతారామరాజు ఒక మహోన్నత శక్తి. ఆయన పోరాటం ఆదర్శనీయం. ఆయన తెలుగువారు, మన ప్రాంతంవారు కావడం మన అదృష్టం. మనందరికీ గర్వకారణం’ అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలను పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి స్మృతివనంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాçసరాజు (వాసు) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛను ప్రసాదించడం కోసం, గిరిజనుల హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటాలు బ్రిటీష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించాయని కొనియాడారు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా అల్లూరి స్మృతివనం, కాంస్య విగ్రహం ఏర్పాటుపై చొరవ చూపారని, రూ.20 కోట్ల విలువైన భూమిని కేటాయించడంతోపాటు 125వ జయంతి వేడుకలకు రూ.10 కోట్ల నిధులు కూడా అందించారని చెప్పారు. ఎమ్మెల్సీలు వంక రవీంద్రనాథ్, జయమంగళ వెంకటరమణ, కవురు శ్రీనివాస్, ఎమ్మెల్యే మంతెన రామరాజు, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ,, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, సీనియర్ నాయకులు గోకరాజు గంగరాజు, గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. అల్లూరి లేకపోతే మన్యం లేదు : రాజన్నదొర మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు లేకపోతే నేడు మన్యం ప్రాంతం ఉండేది కాదని, ఆయన పోరాటం వల్లే గిరిజనుల జీవన విధానం దెబ్బతినకుండా నేటికీ కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. అల్లూరి 126వ జయంతి వేడుకలను రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ భవన్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అల్లూరి ప్రధాన అనుచరులు గాం గంటందొర, గాం మల్లుదొర విగ్రహాలను అరకు ఎంపీ మాధవి, విశాఖ మేయర్ జి.హరివెంకటకుమారితో కలసి రాజన్నదొర ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో గిరిజన విద్యాభివృద్ధికి సీఎం జగన్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని చెప్పారు. ఎంపీ మాధవి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి పోరాటం చిరస్మరణీయమన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, గిరిజన కో–ఆపరేషన్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, డైరెక్టర్ రవీంద్రబాబు, ఈడీ చిన్నబాబు, నాగరాజు పాల్గొన్నారు. అల్లూరి స్మృతివనం ప్రారంభించిన రాష్ట్రపతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడి నుంచే ఆమె భీమవరంలో అల్లూరి స్మృతివనాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. -
‘టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండదు’
సాక్షి, పశ్చిమ గోదావరి: చంద్రబాబు, లోకేష్, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఎంపీ నందిగామ సురేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన అవినీతి గుట్టు రట్టు అవుతుందన్నారు. అందుకే ప్రజల దృష్టి మళ్లించడానికి టీడీపీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతల మీద దాడులు చేసి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ నేతలు చూస్తున్నారని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఉదాహారణ ఎంపీ నందిగామ సురేష్‌పై దాడిచేయటమే అని తెలిపారు. చంద్రబాబు చేస్తున్న కుళ్లు రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇక టీడీపీ అనేది తెలంగాణలో ఎలా అయిందో అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉండదని అన్నారు. వైద్యపరికరాలు కొనుగోలు విషయంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, పీతాని సత్యనారాయణ కోట్లాది రూపాయలు ఎలా దోచుకున్నారో బయటపడిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు. -
పూలబొకేలు కాదు బుక్స్ తీసుకురండి
-
ఓట్లు చీల్చడానికే పవన్ కుట్ర
సాక్షి, భీమవరం: చంద్రబాబు పాలనతో ప్రజలతో విసిగిపోయారని, దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి తెలుగుదేశంపార్టీకి అండగా ఉండడానికే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాకులాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. సోమవారం భీమవరం బస్టాండ్‌సెంటర్‌లో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో శ్రీనివాస్ మాట్లాడారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు)పదేళ్లుగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని ప్రశ్నిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్న వపన్‌కల్యాణ్ భీమవరం అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ అరాచకల గురించి మాట్లాడకుండా తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలను మోసం చేయడానికి పసుపు–కుంకుమ అంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారని, జగన్ ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీచేయడమేగాక వడ్డీలేని రుణాలు అందిస్తారని దీనిని మహిళలంతా గ్రహించాలన్నారు. గత ఎన్నికల హామీల్లో చంద్రబాబు ఏ ఒక్కటీ పూర్తిగా అమలుచేయలేదని, ప్రస్తుత ఎన్నికల్లో విమానాలు సైతం ఉచితంగా ఇస్తామంటూ ప్రజలను మోసగించడానికి ప్రయత్నంచేస్తున్నారని శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఇసుక, మట్టి దోచేశారని, మళ్లీ అధికారం ఇస్తే ఇక ఏమీ మిగల్చరని దుయ్యబట్టారు. ఫీజురీయింబర్స్‌మెంట్ సక్రమంగా అమలు కాక విద్యార్థులు నష్టపోవడమేకాక అనేక విద్యా సంస్థలు మూతదశకు చేరాయన్నారు. అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీర్చడానికే జగన్మోహన్రెడ్డి నవరత్నాలు ప్రకటించారని, వాటిని సద్వినియోగం చేసుకోవడానికి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. బాబు పోతేనే జాబు : రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ 23 పర్యాయాలు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలవలేకపోయిన చంద్రబాబునాయుడి వంటి అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అనే ఒక వ్యక్తి ఉద్యోగం పోతే.. ఆ తర్వాత రాష్ట్రంలో వేలాదిమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, దానికిగాను టీడీపీని చిత్తుగా ఓడించాలని రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. డ్వాక్రా మహిళలకు పూర్తిస్థాయి రుణ మాఫీ చేయకుండా పసుపు–కుంకుమ పేరిట మోసగిస్తున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చే రూ.10వేల గురించి మోసపోకుండా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఒనగూరే డ్వాక్రా రుణ మాఫీ గురించి ఆలోచించాలని కోరారు. జగన్ అధికారంలోకి వస్తే జిల్లా వ్యవసాయం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భీమవరం ప్రాంతాన్ని ఆక్వా హబ్‌గా అభివృద్ధి చేయడమేకాక ఆక్వా రంగంలో పనిచేసే మహిళలకు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. భీమవరం పట్టణంలో రీల్ హీరో పవన్ కల్యాణ్ కంటే రియల్ హీరో గ్రంధి శ్రీనివాస్ వల్లే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మాకు నటించడం రాదు ప్రజలతో మమేకం కావడమే తెలుసునన్నారు. సభలో పార్టీ ఉండి, నరసాపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు పీవీఎల్ నర్సింహరాజు, ముదునూరి ప్రసాదరాజు, కొట్టు సత్యనారాయణ, నరసాపురం, ఉండి మాజీ ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, పాతపాటి సర్రాజు, ఏఎస్ రాజు, వేండ్ర వెంకటస్వామి, గూడూరి ఉమాబాల, మేడిది జాన్సన్, కె.కృష్ణ శ్రీనివాస్, మంతెన యోగీంద్రకుమార్, గాదిరాజు సుబ్బరాజు, కామన నాగేశ్వరరావు, పేరిచర్ల విజయనర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరికలు భీమవరంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగసభలో తోట భోగయ్య, పారిశ్రామికవేత్త అవినాష్‌వర్మ, బీసీ సంఘం నాయకురాలు చంద్రకళ తదితరులు చేరారు. వీరికి జగన్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. -
ఉద్యోగాల విప్లవం తెస్తాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరుటౌన్: భీమవరం పట్టణం సోమవారం జన ప్రభంజనంతో హోరెత్తింది. పట్టణమంతా జగన్ నామస్మరణతో మారుమోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడాయి. ఎక్కడ చూసినా రోడ్లన్నీ జనసంద్రంగా మారిపోయాయి. ఆకాశం నుంచి చుక్కలు రాలిపడ్డాయా అన్నట్లు రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వైఎస్ జగన్ సభా ప్రాంగణం వద్దకు రాగానే సీఎం..సీఎం అంటూ యువత, పార్టీ శ్రేణులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. వేలాదిగా తరలివచ్చిన వైస్సార్సీపీ సైన్యం మధ్య వైఎస్ జగన్ ప్రసంగించారు. ముఖ్యంగా భీమవరం పట్టణంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్రజా సమస్యలపై ధ్వజమెత్తారు. గత పాలకుల లోపాలను తేటతెల్లం చేస్తూనే.. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ప్రజలకు సుస్పష్టంగా వివరించారు. నేనున్నానంటూ మీ సమస్యలపై పోరాడే లోకల్ హీరో కావాలా... ఎక్కడో ఉండే సినిమా యా క్టర్ కావాలో మీరే తేల్చుకోవాలంటూ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. భీమవరం నియోజకవర్గంలో ప్రతి అడుగులోనూ ప్రతి సమస్యలోనూ నేనున్నాను అంటూ ఒక లోకల్ హీరో ఉన్నాడు. అదే మన శ్రీనన్న. ఒక లోకల్ హీరోకు, సినిమాల్లో యాక్టింగ్ చేసే ఇంకొక యాక్టర్‌కు పోలిక మీరే చేసుకోండి. ఈ నియోజకవర్గంలోని అనేక సమస్యలు ఈ ఐదేళ్ళ చంద్రబాబు ప్రభుత్వంలో పరిష్కారం అయ్యాయా.. ఇదే చంద్రబాబు, ఆయన పార్టనర్ ఏనాడైనా ప్రజల సమస్యలపై పోరాటం చేశారా. మీ ప్రతి సమస్యను పరిష్కరించి, భీమవరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయేందుకు మీకు మేమున్నామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భీమవరం బుధవారం మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. భీమవరం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ను, నరసాపురం పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజుపై మీ చల్లని దీవెనలు ఉంచాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించి విజయం చేకూర్చాలని ప్రజలను కోరారు. దోచుకోవటమే పనిగా పెట్టుకున్నారు ప్రజాసంకల్ప పాదయాత్ర భీమవరం గుండా సాగింది. ఆరోజు మీరందరూ నా దగ్గరకు వచ్చి చెప్పిన ప్రతీ బాధ నాకు గుర్తుంది. చెప్పిన ప్రతీ కష్టం ఈ రోజు నాకు గుర్తుంది. ఇక్కడే ఇదే భీమవరం టౌన్లో నాన్నగారు 2008లో 82 ఎకరాలు సేకరించి పేద వాళ్లకు ఇళ్లు కట్టాలని పేదలకు ఇచ్చారు. ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డిగారు సేకరించిన ఆ భూమిని ఇదే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్ధాక్షిణ్యంగా లాక్కోవడం ఇక్కడే ఈ భీమవరంలోనే చూశాం. లాక్కుని ఈ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది ఏమిటంటే.. అవినీతితో కూడిన ఫ్లాట్లను కట్టే కార్యక్రమానికి నాంది పలికాడు. ఆశ్చర్యమేంటో తెలుసా ఆ ఫ్లాట్లల్లో సిమ్మెంట్ సబ్సిడీకి ఇస్తారు. ఆ అపార్ట్మెంట్లకు భూమి ప్రభుత్వందే కాబట్టి ఉచితంగా ఇచ్చింది. ఆ ఫ్లాట్లలో లిఫ్టులు ఉండవు, గ్రానైట్ ఫ్లోరింగ్ ఉండదు. ఇటువంటి ఫ్లాట్లను కట్టడానికి ఏ కాంట్రాక్టర్‌ను మనం అడిగినా కూడా అడుగుకు మహా అయితే రూ.1000 అవుతుందని చెబుతారు. అదే ఇక్కడ 300 అడుగుల ఫ్లాట్లకు అడుగుకు రూ.2200 చొప్పున పేదవాడికి అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు అని ఇక్కడి పేద ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. 300 అడుగుల ఫ్లాట్లు అడుగుకు రూ.1000 కూడా కాదు అని అంటే రూ.3 లక్షలకు అందుబాటు అయ్యే ఆ ఫ్లాటు పేదవాడికి అడుగుకు రూ.2200 చొప్పున అమ్ముతూ 300 అడుగులు అంటే రూ.6.40 లక్షలకు అమ్ముతా ఉన్న పరిస్థితి ఈ పేదవాడు వచ్చి నాకు చెప్పి్పన మాట. ఆ ఆరు లక్షల చిల్లర ఫ్లాట్లలో రూ. లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, మరో రూ.లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట బాగానే ఉంది. మిగిలిన రూ.3 లక్షలు ఆ పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు చంద్రబాబునాయుడు తీసుకున్న లంచాలకు 20 ఏళ్ల పాటు నెలనెలా రూ.3 వేలు కడుతూ పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబునాయుడు ఆ లంచాలకు పేదవాడు 20 ఏళ్లపాటు నెలనెలా రూ.3 వేలు కడుతూ పోవాలట. ఆ ప్రతీ పేదవాడికి జగన్ అనే నేను మీ అందరికీ ఇవాళ చెబతా ఉన్నాను. చంద్రబాబు ఎన్నికల కోసమని చెప్పి ఆ ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి, ఆ తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఫ్లాట్ల మీద ఏదైతే మీరు 20 ఏళ్లు పాటు నెలనెలా రూ.3 వేలు బ్యాంకులకు కడుతూ పోతా ఉన్నారో ఆ మొత్తం రూ.3 లక్షలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా అని జగన్ అన్నారు. తాగునీటి కష్టాలు తీరే పరిస్థితి లేదు ఇదే భీమవరం నియోజకవర్గంలో అక్షరాలా తాగడానికి నీళ్లు లేవని ఆ రోజుల్లో ఆ దివంగత నేత 126 ఎకరాలు సేకరించి మంచినీటి చెరువులు కట్టి ఇక్కడి ప్రజలకు తాగడానికి నీటిని సప్లై చేశారని ప్రజలు చెప్పినప్పుడు సంతోషం వేసింది. ఇవాళ ఈ ఐదేళ్ల చంద్రబాబునాయుడి పాలనలోనే భీమవరం చుట్టు పక్కల ఇప్పటికీ కూడా తాగునీటి సమస్య ఉంది. ఈ ఐదేళ్లలో గ్రామాలకు తాగడానికి నీరు లేకపోతే ఈ పెద్దమనిషి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏ గాడిదలు కాస్తా ఉన్నాడు అని ప్రశ్నించారు. రోగాలతో ప్రజలు అవస్థలు ఇదే భీమవరం నియోజకవర్గంలో చెత్త వేసేదానికి డంపింగ్‌యార్డు కూడా లేదు. అంటే ఆ చెత్త మొత్తంగా టౌన్ మధ్యలోనే వేసే పరిస్థితి ఉంది. ఆ వాసనకు, ఆ దోమలకు పురుగులకు రోగాలు వచ్చి అవస్థలు పడుతున్నా కూడా కనీసం పట్టించుకునే వాడు కూడా ఈ ఐదేళ్లలో లేడు. ఈ చంద్రబాబు ప్రభుత్వం నిద్రపోతా ఉందా అని మీ అందరి తరపున అడుగుతున్నా. చెత్తను మొత్తం యనమదుర్రు డ్రెయిన్‌లో పడేస్తా ఉన్నారు. రాజకీయాల్లో లబ్ది పొందేందుకు ఇదే యనమదుర్రు డ్రెయిన్‌లో అఫ్లియెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి మొత్తం ప్రాజెక్ట్‌తో మొత్తం నీళ్లన్నీ శుద్ది చేస్తానని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట ఇచ్చాడు. నేను మిమ్మల్ని అడుగతా ఉన్నా ఈ ఐదేళ్లలో యనమదుర్రు డ్రెయిన్ శుభ్రం చేశారా అని నిలదీశారు. ట్రాఫిక్ సమస్య తీరిందా? ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని అప్పట్లో నాన్నగారి హయాంలో మార్కెట్‌యార్డు వరకూ బైపాస్ రోడ్డు వేశారు. ఆ తర్వాత ఆ రోడ్డు అంగుళం కూడా ముందుకు సాగని పరిస్థితి మీ కళ్లెదుటే కనిపిస్తా ఉంది. నియోజకవర్గంలో రైతన్నలు అన్నా వరి ధాన్యం పండిస్తా ఉన్నాం మద్దతు ధర రూ.1550 అని చెప్తారు. కాని పంట చేతికి వచ్చే సరికి రూ.1200, 1300 క్వింటాలుకు రాని పరిస్థితి ఉందని మేము ఎలా బతకగలం అని ఆవేదనతో అన్న మాటలు ఇవాళ్లకు కూడా నాకు గుర్తున్నాయి. ఆక్వా పరిస్థితి చూస్తే 100 కౌంటు రొయ్యల ధర కనీసం రూ.270 ఉంటేగాని కనీసం ఖర్చులు కూడా రావు, అటువంటిది ఇదే 100 కౌంటు రొయ్యల ధర రూ.200కు పడిపోవటంతో ఆక్వా రైతు పరిస్థితి ఏమిటని అడుగుతా ఉన్నా. లోకల్ హీరో శ్రీనన్న ఇక్కడే ప్రతీ అడుగులోనూ ప్రతీ సమస్యలోనూ నేనున్నాను అనంటూ ఒక లోకల్ హీరో ఉన్నాడు. అదే మన శ్రీనన్న. ఒక లోకల్ హీరోకు, సినిమాల్లో యాక్టింగ్ చేసే ఇంకొక సినిమా యాక్టర్‌కు పోలిక మీరే చేసుకోండి అని జగన్ అన్నారు. ఐదేళ్ల చంద్రబాబునాయుడు పాలన మీ అందరికీ కూడా కనిపిస్తా ఉంది. ఈ ఐదేళ్లలో ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలేమిటి? ఎన్నికల ప్రణాళిక, మ్యానిఫెస్టోలో రాసిన రాతలేమిటి? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పెద్దమనిషి చంద్రబాబు చేసిందేమిటి అన్నది మీరందరూ కూడా గుండెల మీద చేయి వేసుకుని ఆలోచన చేయాలని కోరారు. ఈ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మన చూసింది మోసం చేయడమే అన్నారు. దేశంలోనే అత్యంత ధనిక చీఫ్ మినిస్టర్ ఎవరూ అంటే వినిపించేది చంద్రబాబు పేరేనన్నారు. చంద్రబాబు జీవితం రెండెకరాల నుంచి మొదలు పెట్టారు. ఈ రోజు దేశంలోనే అత్యంత ధనిక చీఫ్ మినిస్టర్ అయ్యారు. అంటే ఏ స్థాయిలో రాష్ట్రాన్ని దోచేశాడో వేరే చెప్పాల్సిన పనిలేదన్నారు. మన లోకల్ హీరో గ్రంధి శ్రీనన్నకు మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరారు. రఘురామకృష్ణంరాజు వైఎస్సార్సీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు. మంచి చేస్తాడన్న నమ్మకం సంపూర్ణంగా ఉంది. ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సభలో ఎంపీ అభ్యర్ధి కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్, నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షులు ముదునూరు ప్రసాదరాజు, తాడేపల్లిగూడెం, ఉండి అభ్యర్ధులు కొట్టు సత్యనారాయణ, పీవీఎల్ నరసింహరాజు, కొయ్యే మోషన్‌రాజు, పాతపాటి సర్రాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వేండ్ర వెంకటస్వామి, గూడూరు ఉమాబాల, ఏఎస్‌రాజు, గాదిరాజు సుబ్బరాజు, మేడిద జాన్సన్, మంతెన బాబు, పేరిచర్ల విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు పార్టనర్ యాక్టర్ ఒక్కసారైనా వచ్చారా? తుందుర్రులో ఆక్వా ఫ్యాక్టరీ కాలుష్యం బారిన పడతామని, దానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తే ఆ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తీసేసి సముద్రతీరానికి తీసుకుపోయి అవసరమైతే అంతో ఇంతో సహాయం చేసి అక్కడ పెడితే ప్రజలు, సంతోషించే వాళ్లు. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా సంతోషించేవారు. అలా కాకుండా అక్కడే ఫ్యాక్టరీ పెట్టించి డ్రెయిన్లు నాశనమైన పరిస్థితులు కల్పించారు. తుందుర్రులో కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారి అన్నా చంద్రబాబు ఎలాగూ సహాయం చేసింది లేదు. కనీసం అక్కడ ధర్నా చేస్తా ఉన్న ప్రజలకు కనీసం ఒక్కసారి అయినా నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి ఈ యాక్టర్, చంద్రబాబు పార్టనర్ కనీసం ఒక్కసారైనా వచ్చారా అని నిలదీశారు. -
లోకల్ హీరోకు.. సినిమా హీరోకు పోటీ
-
ఓటు జనసేనకు వేసినా టీడీపీకి వేసినా ఒక్కటే
-
చంద్రబాబు తడిగుడ్డతో గొంతుకోసే రకం
-
రావాలి జగన్-కావాలి జగన్ చేపట్టిన భీమవరం మాజీ ఎమ్మెల్యే
-
‘చంద్రబాబు పార్టీని సింగపూర్ తరిమికొడతారు’
సాక్షి, భీమవరం : ప్రజలు బ్రిటీష్ వారిని దేశం నుంచి తరిమి కొట్టినట్లు చంద్రబాబును, టీడీపీ పార్టీని సింగపూర్ తరిమి కొడతారని వైఎస్సార్సీపీ నేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా కోసం రాజ్యాంగబద్దంగా శాంతియుతంగా పోరాడుతుంటే అన్నిచోట్లా హౌస్ అరెస్టు చెయ్యడం చాలా దారుణమని మండిపడ్డారు. ఇక ప్రత్యేక హోదా కల్పించాలని వామపక్ష పార్టీలు చలో విజవాయడ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని, అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. -
'కోడిపందాలు సంక్రాంతి సంప్రదాయం'
భీమవరం : కోడి పందాల పోటీలు సంక్రాంతి సంప్రదాయమని, సంప్రదాయాన్ని అందరు గౌరవించాలని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. కాగా సంక్రాంతి సందర్భంగా కోలాహలంగా నిర్వహించే కోడిపందాలకు హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. కోడి పందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా సాగుతుందని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడిపందాల పేరుతో జంతువులను హింసిస్తున్నారని పేర్కొంటూ.. పీపుల్ ఫర్ యనిమల్ ఆర్గనైజేషన్, యనిమల్ వెల్ఫేర్ బోర్డు వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ సందర్భంగా కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ... తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అక్కడ తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. కోడిపందాలు ఈ ప్రాంతంలో వందల ఏళ్ల నుండి సంప్రదాయంగా వస్తున్నాయని, దాన్ని కాపాడుకుంటామని అన్నారు. కాగా సంకాంత్రి పండగ పర్వదినాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాలపై కోట్లలో బెట్టింగులు జరుగుతాయి. -
కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి
భీమవరం: పశ్చిమగోదారి జిల్లా భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శనివారం పట్టణంలో జరుగుతున్న బంద్ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడున్న సమయంలో ఉన్నట్టుండి పడిపోవడంతో పార్టీ కార్యకర్తలు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.