యథేచ్ఛగా కోడి పందేలు
తొలి రోజే చేతులు మారిన రూ.50 కోట్లు
పందేల శిబిరాల్లో కోతాట, గుండాట
బరుల్లో ఏరులై పారిన మద్యం
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) :జిల్లాలో ఎక్కడికక్కడ కోడి పందేలు యథేచ్ఛగా సాగాయి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంప్రదాయాన్ని తమనుంచి దూరం చేయలేరంటూ కోడి పుంజులను బరులకు తీసుకెళ్లి పందేలరాయుళ్లు సరదా తీర్చుకున్నారు. ఓ వైపు రాజకీయ నాయకులు.. మరోవైపు ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినీ నటులు, క్షణం తీరికలేని వ్యాపార వేత్తలు సైతం గురువారం కోడి పందేల్లో మునిగి తేలటం కనిపించింది. సినీ సంగీత దర్శకుడు కోటి, ‘స్వామి రారా’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుధీర్‌వర్మ వంటి ప్రముఖులు బరుల వద్ద తళుక్కుమన్నారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్‌ల వంటి ప్రజాప్రతినిధులే కోడి పందాలను ప్రారంభిం చారు. తొలి రోజున కోడి పందేల్లో సుమారు రూ.50 కోట్లు చేతులు మారాయని అంచనా. పందాల మాటున పేకాట, కోతాట, గుండాట, మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి.
ఊరూరా పందేలే
భీమవరం పరిధిలోని వెంప, భీమవరం ప్రకృతి ఆశ్రమం, గొల్లవానితిప్ప, లోసరి, దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, గూట్లపాడు, వీరవాసరం, కొణితవాడ, నౌడూరు, మత్స్యపురి, ఆకివీడు మండలం ఐ.భీమవరం, అప్పారావుపేట, దుంపగడప, ఆకివీడు, కుప్పనపూడితోపాటు సీసలి, శృంగవృక్షం, పాలకోడేరు, మోగల్లు, జువ్వలపాలెం, కాళ్ల గ్రామాల్లో పందేలు జోరుగా సాగాయి. ‘స్వామి. రారా’ డెరైక్టర్ సుధీర్‌వర్మ కొణితివాడ వచ్చారు. ఏలూరు సమీపంలోని జాలిపూడి, మాదేపల్లి, దెందులూరు,గోపన్నపాలెం, గాలాయిగూడెం, కొవ్వలి, కొప్పాక, పెదవేగి, బి.శింగవరం, పెదపాడు, హనుమాన్ జంక్షన్ శివారు, పెదకడిమి, దుగ్గిరాలలో పందేలు జరిగాయి. ఉంగుటూరు పరిధిలో గుండుగొలను, నారాయణపురం, నిడమర్రు మండలం పత్తేపురం, గణపవరం మండలం అర్ధవరంలో భారీస్థాయిలో పందేలు జరిగాయి.
ఇవికాక నియోజకవర్గంలోని మరో 40 బరులు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూములు, పెదతాడేపల్లి, పెంటపాడు, ప్రత్తిపాడు, అలంపురంలలో పందేలు వేశారు. తణుకు పరిధిలోని వేల్పూరు, తేతలి, దువ్వ, మండపాక, ఇరగవరం, అయినపర్రు, పేకేరు, అత్తిలి, వరిఘేడు, పాలూరు, తేతలిలో పందేలు జోరందుకున్నాయి. కొవ్వూరు పరిధిలో కొవ్వూరు, తోగుమ్మి, ఐ.పంగిడి, సీతంపేట, పశివేదల, చాగల్లు మండ లం మీనానగరం, ఊనగట్ల, చిక్కాల, బ్రాహ్మణగూడెం, తాళ్లపూడి, పెద్దేవం, వేగేశ ్వరపురం, రావూరుపాడు, మలకపల్లిలో పందేలు నిర్వహించారు. చింతలపూడి పరిధిలో రాఘవాపురం, సీతానగరం, లింగపాలెం మండలం ములగలంపాడు, కొణిజర్ల, అయ్యప్పరాజుగూడెం, ధర్మాజీగూడెం, కేఎస్ రామవరం, రావికంపాడు, కళ్లచెరువు, యడవల్లి, లక్కవరం, దేవులపల్లి, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలలో పోటీలు మొదలయ్యాయి.
గోపాలపురం పరిధిలో దేవరపల్లి, వెంకటాయపాలెం, రాజంపాలెం, గుడ్డిగూడెం, చిన్నాయిగూడెం, అనంతపల్లి, ప్రకాశరావుపాలెం, దూబచర్ల, పోతవరం, ద్వారకాతిరుమల, పంగిడిగూడెంలో ప్రధాన బరులు ఏర్పాటు చేయగా పలుచోట్ల మరో 15 చిన్న బరులు ఏర్పాటు చేశారు. నరసాపురం పరిధిలో చినమామిడిపల్లి, పితానిమెరక, వేములదీవి, దర్భరేవు, కొప్పర్రు, చిట్టవరం, మొగల్తూరు, వెంప, ముత్యాలపల్లి, శేరేపాలెంలలో ప్రధాన బరులు ఉండగా, మరో 10 ప్రాంతాల్లోనూ పందేలు వేశారు. నిడదవోలు, శింగవరం, ఖండవల్లి, ఉండ్రాజవరం, పెరవలిలో ప్రధాన బరులు ఏర్పాటయ్యా యి. ఉండి పరిధిలోని మహదేవపట్నం, ఉండి, పాలమూరు, వేండ్ర, చిలుకూరులో ప్రధాన బరులు ఏర్పాటయ్యాయి.
పాలకొల్లు పరిధిలో పూలపల్లి బైపాస్ రోడ్డు, పూలపల్లి, కలగంపూడి, యలమంచిలి, కాజ, కొంతేరు, బూరుగుపల్లి, వడ్లవానిపాలెం, మట్లపాలెం, పోడూరు, జిన్నూరు, కవిటం బరుల్లో సందడి కనిపిం చింది. పూలపల్లి బైపాస్ రోడ్డులో బరి వద్ద సంగీత దర్శకుడు కోటి, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు సందడి చేశారు. పోలవరం పరిధిలో పోలవరం, గూటాల, సింగవరం, చేగొండపల్లి, రామానుజపురం, జీలుగుమిల్లి, తాటియాకులగూడెం, రాచన్నగూడెం, టి.నర్సాపురం, అప్పలరాజుగూడెం, తిరుమలదేవునిపేట, బుట్టాయగూడెం, దుద్దుకూరు, వీరన్నపాలెం ప్రాంతాల్లోనూ పందేలు మొదలయ్యాయి. ఆచంట, వల్లూరు, పెనుమంట్ర మండలం మార్టేరు, పోడూరు, పెనుమంట్ర, పెనుగొండ, వడలి, దొంగరావిపాలెం, గుల్లపర్రు, పెండ్లికూతురమ్మ చెరువు గ్రామాల్లోని బరుల్లోనూ కోడి పందేలు జరిగాయి.
కోళ్లతో కోట్లాట
Published Fri, Jan 15 2016 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM
Advertisement
Advertisement