
‘కోడిపందాలపై ఇప్పటికిప్పుడు ఆదేశాలివ్వలేం'
న్యూఢిల్లీ: హైకోర్టు ఆదేశాలను అతిక్రమించి ఆంధ్రప్రదేశ్ లో కోడి పందాలు నిర్వహిస్తున్నారని, వాటిని వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో జాతీయ జంతు సంరక్షణ విభాగం పిటిషన్ దాఖలు చేసింది. కోడిపందాలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కొందరు వాటిని నిర్వహించేందుకు సిద్ధపడ్డారని తన పిటిషన్ లో పేర్కొంది.
జంతు సంరక్షణ విభాగం సభ్యురాలు గౌరీ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. కోడిపందాలను ఆపాలని ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.