సంక్రాంతికి ఏటా నిర్వహించే కోడి పందాలపై మంగళ వారం హైకోర్టులో విచారణ జరిగింది. పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను హై కోర్టు విచారణకు స్వీకరించింది. కోడి పందాలు చారిత్రక సంప్రదాయమని.. వాటిని కొనసాగించాలని బీజేపీ నేత రామకృష్ణం రాజు వాదించారు. మరో వైపు.. కోడి పందాలు జీవ హింసగా పేర్కొంటూ పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ సంస్థ తమ వాదనలు తెలియజేసింది. వీటి పై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.