సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ విజయనగరం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్ర మంత్రి పదవులను వదులుకోవాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. మొదటి రోజు శ్రీకాకుళం, విజయనగరంలో ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుకు కేంద్రంలో రెండు మంత్రి పదవులు కావాలో.. ప్రత్యేక హోదా కావాలో తేల్చుకోవాలన్నారు. బాబు హోదాపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరో చెప్పాలని డిమాండ్ చేశారు.
తేల్చుకోవాల్సింది చంద్రబాబే
Published Sun, Aug 2 2015 1:32 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement