'వెంకయ్యవి మాటలే తప్ప.. నిధులుండవు' | there is no funds.. only diologues from venkaiah | Sakshi
Sakshi News home page

'వెంకయ్యవి మాటలే తప్ప.. నిధులుండవు'

Published Thu, Jan 21 2016 10:19 PM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

there is no funds.. only diologues from venkaiah

విజయవాడ: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి మాటలు కోటలు దాటుతున్నా రాష్ట్రానికి మాత్రం కేంద్రం నుంచి ఇప్పటివరకు ఒనగూరిన ప్రయోజనం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. గురువారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్రం అరకొరగా నిధులు ఇచ్చి సరిపెడుతోందని ఆరోపించారు.

పోలవరానికి కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.100 కోట్లు ఇచ్చిందని, రూ.2 వేల కోట్లు ఖర్చుపెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని రామకృష్ణ పేర్కొన్నారు. పోలవరానికి అరకొర నిధులు విదిల్చి ఎప్పటికి పూర్తిచేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల మాటను మరిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజా ఉద్యమాలతో నిలదీస్తామని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement