త్వరలో తిరుపతిలో జరగబోతున్న మహానాడు కార్యక్రమానికి చేసే ఏర్పాట్ల విషయంలో టీడీపీ పార్టీలోని రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి.
తిరుపతి: త్వరలో తిరుపతిలో జరగబోతున్న మహానాడు కార్యక్రమానికి చేసే ఏర్పాట్ల విషయంలో టీడీపీ పార్టీలోని రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. తిరుపతి నెహ్రో మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో మహానాడు కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. పార్టీ నగర అధ్యక్షుడు భాస్కర్ గురువారం మధ్యాహ్నం అక్కడికి చేరుకోవడంతో వివాదం రాజుకుంది. ఏర్పాట్లు సరిగా లేవని భాస్కర్ తెలుగు యువత నాయకులతో అనడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని తోపులాడుకున్నారు. ఈ ఘటనలో మధు అనే తెలుగు యువత నాయకుడు, ఓ పత్రిక విలేకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు.