మహానాడు నిర్వాహకులకు మీడియా కమిటీ చైర్మన్ ముద్దుకృష్ణ సూచన
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో జరగనున్న మహానాడు కార్యక్రమ కవరేజీ విషయంలో ‘సాక్షి’ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రవేశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సూచించింది. ఈ నెల 27నుంచి మూడు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమాల వివరాలు ‘సాక్షి’కి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మహానాడు నిర్వహణ కోసం టీడీపీ ఏర్పాటు చేసిన మీడియా కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ మేరకు ప్రాంగణ, వేదిక కమిటీ నిర్వాహకులకు ప్రత్యేకంగా సూచనలు చేశారు. అంతేకాకుండా మహానాడుకు వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యే మీడియా ప్రతినిధుల కోసం చేయాల్సిన ఏర్పాట్లను నిర్దేశిస్తూ రూపొందించిన మార్గదర్శకాల్లో సాక్షి విషయాన్ని ప్రస్తావించారు. ఈ సూచనల పత్రం చివరన సాక్షి టీవీ, పత్రికతోపాటు టీ-న్యూస్ ప్రతినిధులను మహానాడుకు అనుమతించకూడదని పేర్కొన్నారు.
సాక్షి, టీ న్యూస్‌ను అనుమతించొద్దు
Published Fri, May 20 2016 1:22 AM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM
Advertisement
Advertisement