తొమ్మిదేళ్ల నుంచి ఆస్తులు ప్రకటిస్తున్నా.. | I am Only Leader Who Shares Assets Says Chandra Babu | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్ల నుంచి ఆస్తులు ప్రకటిస్తున్నా..

Published Tue, May 29 2018 7:43 PM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM

I am Only Leader Who Shares Assets Says Chandra Babu - Sakshi

మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

సాక్షి, విజయవాడ : తొమ్మిదేళ్ల నుంచి ఆస్తులు ప్రకటిస్తున్న రాజకీయ నేత తాను మాత్రమేనని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మహానాడులో ఆయన ప్రసంగించారు. ఆస్తుల వివరాలు వెల్లడించని నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి ఎలాంటి ఢోకా ఉండదని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని విమర్శిస్తూ కొందరు ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారని, మూడుసార్లు ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ నేతలు నమ్మకంతో ఉన్నారని చెప్పారు. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో పదవులను సైతం వద్దని తిరస్కరించినట్లు వెల్లడించారు.

టీడీపీ విశ్వసనీయత కలిగిన పార్టీ అని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చేలా తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. ప్రతి పక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, వాటి ఆటలు సాగవని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో యువతకే పెద్ద పీట వేయబోతున్నట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement