
చంద్రబాబు.. నీచపు వ్యక్తిత్వమున్న విలన్!
తిరుపతి: చంద్రబాబునాయుడు లాంటి విలన్ ఎన్టీఆర్ సినిమాల్లో కూడా కనిపించడని, చంద్రబాబులాంటి నీచపు వ్యక్తిత్వమున్న విలన్ ఉండబోరని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ఎవరికీలేని విలన్ లక్షణాలు చంద్రబాబుకు ఉన్నాయని, దివంగత నేత ఎన్టీఆర్‌ను చంద్రబాబు మానసిక క్షోభకు గురిచేశారని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినవారే ఇప్పుడు ఆయన వారసులమని ప్రకటించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఎలుకల్లా చేరి..పందికొక్కుల్లా దోచుకుంటున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
- చంద్రబాబు వాగ్దానాలు ఎప్పటికీ ఆచరణకు నోచుకోవు
- అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన అబద్ధాలు చెప్తున్నారు
- పారిశ్రామిక ఒప్పందాలపై అబద్ధపు లెక్కలు చెప్పారు
- నీతులు చెప్పడంలో, వంచించడంలో బాబులాంటి దారుణమైన వ్యక్తి మరొకరు లేరు
- అవినీతిలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది
- ఎన్నికల వాగ్దానాలపై చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు
- మహానాడులో ఆత్మస్తుతి, పరనింద తప్ప మరొకటి లేదు
- ఎన్టీఆర్ సిద్ధాంతాలు, ఆశయాలకు చంద్రబాబు సమాధి కట్టారు
- మూడేళ్లైనా ప్రజలకు అనుకూలంగా ఒక్క ఆశయాన్ని నెరవేర్చలేదు
-
చంద్రబాబు మాటలు నమ్మితే టీడీపీకి పుట్టగతులు ఉండవు