సాక్షి, అమరావతి : టీడీపీ మహానాడుపై, చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగాస్త్రాలు సంధించారు. ‘జూమ్ కాన్ఫరెన్సుతో మహానాడట! రెండొందల మంది భజంత్రీలు కూర్చుంటే “మహా” ఎలా అవుతుందో కాస్త వివరిస్తే సంతోషిస్తాం. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజల సొమ్ముతో హిమాలయా వాటర్ తప్ప వేరే నీళ్లు దిగలేదు. ఇప్పుడు ఆ బాటిల్స్ కనిపించడం లేదు. అలవాట్లు మారాయా?’అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశారు.
ఇక కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశంసిస్తూ విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. ‘ఏడాది కాలంలో లాక్ డౌన్ వల్ల మూడు నెలలు రాబడి లేకపోయినా 90 శాతం హామీలు నెరవేర్చారు జగన్ గారు. వివిధ కార్యక్రమాల కింద 3.60 కోట్ల మందికి 40 వేల కోట్ల సాయం అందింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులన్నీ కొనసాగుతున్నాయి. పోలవరం వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి పూర్తవుతుంది’అంటూ ట్విటర్‌లో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
జూమ్ కాన్ఫరెన్సుతో మహానాడట! రెండొందల మంది భజంత్రీలు కూర్చుంటే “మహా” ఎలా అవుతుందో కాస్త వివరిస్తే సంతోషిస్తాం. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజల సొమ్ముతో హిమాలయా వాటర్ తప్ప వేరే నీళ్లు దిగలేదు. ఇప్పుడు ఆ బాటిల్స్ కనిపించడం లేదు. అలవాట్లు మారాయా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 28, 2020
చదవండి:
'ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకునే పనిలో పడ్డాడు'
‘అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా’
Comments
Please login to add a commentAdd a comment