
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం ఎంతటికైనా దిగజారుతాడని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు స్వార్థం కోసమే కాంగ్రెస్‌తో చేతులు కలిపారని ఆరోపించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని స్టాపించారని, ఎన్‌టీఆర్‌కు చంద్రబాబు వెన్ను పోటు పొడిచి టీడీపీని లాక్కున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు! రాహుల్ గాంధీని కలవటం దుర్మార్గమని అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ అవిశ్వాసం పెడితే చంద్రబాబు కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన సంగతిని గుర్తు చేశారు. కాంగ్రెస్‌తో చంద్రబాబుకు చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయన్నారు. సోనియా గాంధీతో కుమ్మక్కై వైస్ జగన్ మీద అక్రమ కేసులు పెట్టించాడని ఆరోపించారు. ఈ రోజు చంద్రబాబు రాహుల్ గాంధీని కలవటంలో ఆశ్చర్యం ఎమీ లేదని అన్నారు. జగన్‌కు లభిస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు వెన్నులో చలి పుడుతోందని, అందుకే ఏ పార్టితోనైనా చంద్రబాబు కలవడానికి సిద్దంగా ఉన్నాడని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment