
వైఎస్సార్ సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు! అరాచక, అధ్వాన్న చీకటి పాలనపై విసుగుచెందిన ప్రజలు పాదయాత్రతో తమ ముందకు వస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలో ఓ వెలుగు చూస్తున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అందుకే ప్రజలు వైఎస్ జగన్‌తో పాటు వేలాదిగా తరలి వస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువనేస్తం పధకం పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగ యువతను ప్రభుత్వం దగా చేసిందన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది నిరుద్యోగులుంటే యువనేస్తం పధకానికి కేవలం 12 లక్షల మందిని మాత్రమే అర్హులుగా తేల్చడం.. నిరుద్యోగులపై ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో చేస్తున్న దోపిడీ.. ప్రభుత్వం, ముఖ్యమంత్రి తన అనుచరులకు వేల కోట్ల రూపాయలు దోచిపెడుతున్న వైనం.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ధన ప్రవాహాన్ని చూసి కేంద్ర సంస్థలు సదరు వ్యక్తులపై సోదాలు చేస్తుంటే! దాన్ని రాష్ట్రంపై దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులు, రైతులనే కాదు.. వృద్ధులు, వితంతువులతో పాటు అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment