
టీడీపీ మహానాడుకు స్థల పరిశీలన
ఆరిలోవ/ ఉక్కునగరం: విశాఖలో నిర్వహించనున్న టీడీపీ మహానాడు వేదికగా ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్‌ను ఖరారు చేశారు. తొలుత మంత్రుల బృందం హనుమంతవాక, ముడసర్లోవ, ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్, స్టీల్‌ప్లాంట్ ప్రాంతాలలో అనుకూలమైన స్థల పరిశీలన చేశారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని ఏయూ గ్రౌండ్‌ను ఖరారు చేశారు.
పార్టీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఆధ్వర్యంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.