సాక్షి, ఢిల్లీ : టీడీపీ అట్టహాసంగా నిర్వహించింది మహానాడు కాదని.. అది దగానాడు అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై టీడీపీ బురద జల్లుతోందని ధ్వజమెత్తారు. నారా చంద్రబాబు నాయుడు అబద్ధాల ముఖ్యమంత్రి.. బలహీన పడినప్పుడల్లా ఎన్టీఆర్ నామస్మరణ చేస్తారని ఆయన విరుచుపడ్డారు. పెట్రో ధరల పెరుగుదలకు కేంద్రానికి సంబంధం లేదన్నారు. ఢిల్లీ- ముంబై కారిడార్‌లో దొలారే సిటీ నిర్మాణం చేయాలనే నిర్ణయం యూపీఏ హయాంలో జరిగిందని జీవీఎల్ గుర్తు చేశారు.
‘రూ. 2,333 కోట్లతో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకాన్ని ఏర్పాటు చేస్తుంటే.. కేంద్రం రూ.300 కోట్లు మాత్రమే ఇస్తుంది. రూ. 300 కోట్లను రూ.3 వేల కోట్లగా.. అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు క్షమపణ చెప్పాలని’జీవీఎల్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రవర్తన ఊసరవెల్లికి కూడా సిగ్గు తెప్పించేలా ఉందని ధ్వజమెత్తారు. బాబు పూర్తిగా యుటర్న్ తీసుకున్నారని, గుజరాత్‌కు కేంద్రం అదనంగా ఏమీ ఇవ్వలేదని జీవీఎల్ పేర్కొన్నారు. ఏపీకి మూడు ఇండస్ట్రియల్ సిటీలు ఇచ్చామన్నారు.
‘ఎంత సాయం చేస్తున్నా చేయట్లేదని దుష్పచారం చేస్తున్నారు. హోదా కంటే ఎక్కువ సాధించామని మీరే చెప్పారు.. ఎన్ని నిధులిచ్చినా దుర్వినియోగం అవుతున్నాయని’ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. పారిశ్రామిక నగరాన్ని క్యాపిటిల్ సిటీతో పోలిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ సిటీలో మౌలిక వసతుల కోసం రూ. 2500 కోట్లు కేంద్రం పెట్టుబడి పెట్టిందని ఆయన తెలిపారు. కానీ, రూ. 98వేల కోట్లు కేంద్రం ఇస్తున్నారనడం బాబు దగాకోరు మాటలకు నిదర్శనం నరసింహారావు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment