
సాక్షి, తిరుమల: రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబు నాయుడే అని గతంలోనే ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి శని అని గతంలోనే స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. ఆయన ప్రాణాలు తీసి.. నేడు వారి ఫొటోకి దండలు, దండం పెడుతున్నాడు. ఎన్టీఆర్ పేరు ఓ జిల్లాకి పెడితే.. కనీసం బాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదన్నారు ఆమె. మహానాడులో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని మంత్రి రోజా మండిపడ్డారు.
ఇక మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని అమానుష చర్యగా అభివర్ణించిన ఆమె... అల్లర్లను అణచివేయడానికి పోలీసులు ఎంతో సమన్వయంగా వ్యవహరించారని మెచ్చుకున్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లు ఎంతటి వాళ్లు అయినా వదిలేదేలే అని స్పష్టం చేశారు మంత్రి రోజా.
చదవండి: జూనియర్ ఎన్టీఆర్ పేరు విన్నా చంద్రబాబుకు నిద్ర పట్టదు
Comments
Please login to add a commentAdd a comment