తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సభ ‘మహానాడు’ తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్‌లో జరుగుతుందని పార్టీ జాతీయ కార్యాలయ సమన్వయ కార్యదర్శి, ఎమ్మెల్సీ టీడీ జనార్దనరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సభ ‘మహానాడు’ తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్‌లో జరుగుతుందని పార్టీ జాతీయ కార్యాలయ సమన్వయ కార్యదర్శి, ఎమ్మెల్సీ టీడీ జనార్దనరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది. తిరుపతిలో మహానాడు నిర్వహించాలని ఈనెల 2న జరిగిన పార్టీ సమన్వయ కమిటీ, మంత్రివర్గ సమావే శాల్లో నిర్ణయించిన విషయం తెలిసిందే.