టీడీపీ చేస్తోంది మినీ మహానాడు కాదు..మనీ మహానాడు అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు.
ప్రకాశం: టీడీపీ చేస్తోంది మినీ మహానాడు కాదు..మనీ మహానాడు అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. రెండేళ్లపాటూ దోచుకున్న డబ్బుతో సంబరాలు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
లక్షా 80 వేల కోట్లు నిధులిచ్చామని కేంద్రం చెబుతుంటే..చంద్రబాబు మాత్రం కేంద్రం సహకరించడం లేదంటున్నారని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారని బ్రహ్మానందరెడ్డి అన్నారు.