
సాక్షి, అమరావతి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అంశాలవారీ మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జూమ్ కాన్ఫరెన్స్‌లో గురువారం రెండో రోజు జరిగిన మహానాడులో ఈ మేరకు రాజకీయ తీర్మానం చేసింది. అలాగే రాష్ట్రంలో కలిసి వచ్చే ప్రతిపక్ష పార్టీలను కలుపుకుపోవాలని తీర్మానించింది. జగన్ పాలనను ప్రశ్నించాలనుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.
చంద్రబాబు మరో యూటర్న్
మాట మీద నిలబడకుండా.. సమయానుకూలంగా మాటమారుస్తూ.. యూటర్న్‌లు తీసుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన చంద్రబాబు తాజాగా మరో యూటర్న్ తీసుకున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వాన్ని తిట్టి కాంగ్రెస్‌తో జతకట్టిన ఆయన ఇప్పుడు అవసరాల కోసం బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు సందర్భం కాకపోయినా, అవసరం లేకపోయినా బీజేపీకి మద్దతు ప్రకటించారు. తన అవినీతిపై విచారణ భయం పట్టుకోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పనిచేయాలని, ఇందుకోసం బీజేపీ, వామపక్ష పార్టీలను సైతం వాడుకోవాలని మహానాడులో నర్మగర్భంగా చెప్పడం గమనార్హం.
మొక్కుబడి తీర్మానాలు: రెండు రోజులపాటు ఆన్‌లైన్‌లో టీడీపీ నిర్వహించిన మహానాడు మొక్కుబడిగా ముగిసింది. చంద్రబాబు రోజూ నిర్వహించే టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్‌ల మాదిరిగానే ఇది కూడా ముగిసినట్లు పలువురు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొక్కుబడి తీర్మానాలు, సుదీర్ఘ ఉపన్యాసాలతో శుక్రవారంతో ఈ తంతు ముగిసినట్లు చెబుతున్నారు. ఎప్పటిలాగే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే మొక్కుబడి తంతును ఈసారి కూడా చంద్రబాబు రక్తి కట్టించారు.
అదే కోవలో మిగిలినవి..
ఈసారి మొత్తం 15 తీర్మానాలు చేశారు. 8 ఏపీకి సంబంధించినవి కాగా తన గొప్పలు, ప్రభుత్వంపై బురద చల్లడం, అభూత కల్పనలకే చంద్రబాబు పరిమితమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment