
రేపు తెలంగాణ మహానాడు
ఈ నెల 24 (బుధవారం)న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండులో తెలంగాణ టీడీపీ మహానాడు జరగనుంది.
హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24 (బుధవారం)న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండులో తెలంగాణ టీడీపీ మహానాడు జరగనుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడును విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రత్యేకంగా మహానాడు నిర్వహించాలని నిర్ణయించిన టీటీడీపీ.. ఈ నెల 24న కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల వారీగా మినీ మహానాడులను టీటీడీపీ ఇప్పటికే పూర్తి చేసింది. కాంగ్రెస్, బీజేపీ దూకుడు పెంచిన నేపథ్యంలో టీడీపీ కూడా ఉనికిని చాటుకోడానికి ఈ మహానాడును ఉపయోగించుకోనుంది.