heritage diary
-
విజయ డెయిరీ గాలికి.. హెరిటేజ్ డెయిరీకి అందలం..
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతి కోరల్లో కూరుకుపోయిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ నేతలు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులను పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహిస్తూ హ్యాపీగా ఉంటున్నారని మండిపడ్డారు. నయవంచన దీక్షలను ఆపి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. చిత్తూరు డెయిరీని గాలికి వదిలేసిన చంద్రబాబు సొంత హెరిటేజ్ డెయిరీని అందలం ఎక్కించారని ఆరోపించారు. చిత్తూరులోని చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. -
అర లీటర్ ప్యాకెట్లో 420 ఎంఎల్ పాలు !
హొసూరు (తమిళనాడు): హెరిటేజ్ డెయిరీ వినియోగదారులను నిండా ముంచుతోంది. ప్యాకెట్‌పై 500 ఎంఎల్ అని ముద్రిస్తున్నా, అందులో మాత్రం ఆ మేరకు పాలు ఉండడం లేదు. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హొసూరుకు చెందిన శ్రీనివాసన్ శనివారం ఉదయం హెరిటేజ్ దుకాణంలో అర లీటర్ పాకెట్లు రెండు కొనుగోలు చేశాడు. ఒక పాకెట్లో పాలు తక్కువగా ఉండటంతో దుకాణదారుడిని ప్రశ్నించాడు. అయితే సదరు దుకాణదారుడు తనకు సంబంధం లేదని, కర్ణాటక నుంచి పాకెట్లు ఎలా వస్తే తాము అలాగే విక్రయిస్తున్నట్లు దబాయించాడు. ఒక ప్యాకెట్లో 500 ఎంఎల్, మరో పాకెట్లో 420 ఎంఎల్ మాత్రమే ఉందని, తాను వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేయనున్నట్లు శ్రీనివాసన్ తెలిపారు. తమిళనాడు, కర్ణాటకలో హెరిటేజ్ లీలలపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.