
కెసిఆర్ మాట నిలబెట్టుకోవాలి: పాల్వాయి
హైదరాబాద్: తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు తన మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఎంపి పాల్వాయి గోవర్ధన రెడ్డి అన్నారు. విలీనంకు కేసీఆర్ కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా కేసీఆర్‌కు తగిన గౌరవం ఇస్తోందన్నారు.
ఎన్నికల్లో టిక్కెట్ దక్కదనే కొందరు విలీనం వద్దంటూ కేసీఆర్‌కు సలహా ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణకు కూడా ఒక జాతీయ ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాలని పాల్వాయి కోరారు.