
'తెలంగాణ రాజధాని హైదరాబాదే'
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదేనని ఎంపీ పాల్వయి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఆమోస్, యాదవరెడ్డి అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదేనని ఎంపీ పాల్వయి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఆమోస్, యాదవరెడ్డి అన్నారు. సీమాంధ్రకు హైదరాబాద్ తాత్కాలిక రాజధానిగా అయితే ఎలాంటి అభ్యంతరం లేదని వారు తెలిపారు.
అయితే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటే మాత్రం ఒప్పుకునేది లేదని పాల్వయ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు హైకమాండ్ ముందుగాన సమాచారం ఇచ్చిందని వారు అన్నారు.
విభజనకు అంగీకరించి ....ఇప్పుడు ఉద్యమ నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి పాలన వచ్చినా విభజన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఆంటోనీ కమిటీ కేలవం అభిప్రాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు.