న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నాయకత్వ లోపమే కారణమని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా ఎన్నికల్లో ఓడిందంటే అందుకు ఆప్రాంత కాంగ్రెస్ నేతలదే తప్పు అని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావాలని నేతలందరూ వ్యవహరించిన వైఖరి వల్లే కాంగ్రెస్ ఓటమి చెందిందని సర్వే సత్యనారాయణ ఆరోపించారు.
కాంగ్రెస్ క్యాడర్ మొత్తాన్ని బలోపేతం చేయాలని సోనియాగాంధీని కోరినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేలా కృషి చేస్తామని సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని మంగళవారం ఉదయం సర్వే సత్యనారాయణ, పాల్వాయి గోవర్థన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలు వివరించినట్లు పాల్వాయి తెలిపారు. తెలంగాణా ఇచ్చినా ఎన్నికల్లో పార్టీని గెలిపించలేకపోయామని సోనియాకు చెప్పామన్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామన్నారు.
'కాంగ్రెస్ ఓడిందంటే తెలంగాణ నేతలదే తప్పు'
Published Tue, Jul 1 2014 1:13 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement