'అసమ్మతితో కేసీఆర్ సర్కారు పడిపోవచ్చు'
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. కమర్షియల్ లీడర్షిప్ కాదు ఎఫెక్టివ్ లీడర్షిప్ కావాలన్నారు. సీఎల్పీ నేతగా జానారెడ్డి విఫలమయ్యారని అన్నారు. సీఎల్పీ బాధ్యతలు జీవన్రెడ్డికి అప్పగించాలన్నారు.
కేసీఆర్ సర్కారు రెండేళ్లకు మించి కొనసాగదని జోస్యం చెప్పారు. కేసీఆర్ తన మంత్రులెవరినీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేడర్ మొత్తం అసంతృప్తితో ఉన్నారన్నారు. అసమ్మతి వల్ల కేసీఆర్ సర్కారు పడిపోవచ్చని చెప్పారు. సర్కారు పడిపోతే కాంగ్రెస్ దీటుగా ఎదిగేలా పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని పాల్వాయి సూచించారు.