పాల్వాయి మృతిపై వెలువోలు బసవయ్య దిగ్భ్రాంతి
టొరంటో :
రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం పట్ల ఫెడరేషన్ ఆఫ్ ఇండో-కెనేడియన్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వెలువోలు బసవయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కులమత ప్రాంత భేదాలు లేకుండా పాల్వాయి వ్యవహరించేవాడని బసవయ్య తెలిపారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.