దేశంలోని పేదలందరికీ తక్కువ ధరకు మందులు అందుబాటులో ఉండేలా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జన ఔషధి స్టోర్లు ఏర్పాటు చేయాలని రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కోరారు.
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పేదలందరికీ తక్కువ ధరకు మందులు అందుబాటులో ఉండేలా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జన ఔషధి స్టోర్లు ఏర్పాటు చేయాలని రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కోరారు. ఇందుకు కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సూచించారు. మంగళవారం స్పెషల్ మెన్షన్ కింద రాజ్యసభలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.