విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెద్ద మూర్ఖుడని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్ : విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెద్ద మూర్ఖుడని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి మండిపడ్డారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్న డర్టీ డజన్ నేతల్లో ఆయనొకరని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో కుమ్మక్కు కావాల్సిన అవసరమేమీ కాంగ్రెస్‌కు లేదని చెప్పారు. ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడకుండా చేతనైతే ఆధారాలు చూపాలని లగడపాటికి సవాల్ విసిరారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, కె.యాదవరెడ్డిలతో కలిసి పాల్వాయి మీడియాతో మాట్లాడారు.
జగన్ ఓదార్పు యాత్రలో సోనియాని తిట్టినా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఒక్క మాటా మాట్లాడలేదు. దానివల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిందని పాల్వాయి అభిప్రాయపడ్డారు.