గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే తాజాగా సీబీఐ కోర్టు వైఎస్ జగన్‌కు బెయిల్ ఇచ్చిందని, దానిని తెలుగుదేశం పార్టీ తప్పుబట్టడం సరికాదని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే తాజాగా సీబీఐ కోర్టు వైఎస్ జగన్‌కు బెయిల్ ఇచ్చిందని, దానిని తెలుగుదేశం పార్టీ తప్పుబట్టడం సరికాదని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిస్మిస్ చేసి, రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేయాలని పాల్వాయి డిమాండ్ చేశారు.
తాము ఇప్పటికే తెలంగాణ ఏర్పాటును వేగవంతం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కోరినట్లు ఆయన తెలిపారు. కొన్ని సంవత్సరాల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు చేసిన ప్రతిపాదన కూడా తమకు ఆమోదమేనని పాల్వాయి చెప్పారు.