పొన్నాల, జానాలది అసమర్థ నాయకత్వం
కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యలపై ప్రభుత్వా న్ని నిలదీయడంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత జానారెడ్డి విఫలవుయ్యూరని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పంటరుణాల వూఫీ, కరెంటు కోతలు, ఉద్యోగాల భర్తీ తదితర సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో రాష్ట్ర కాం గ్రెస్ విఫలమైందని వ్యాఖ్యానించారు. శనివా రం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏఐసీసీ పునర్‌వ్యవస్థీకరణ జరి గాక రాష్ట్ర నాయకత్వాలను మార్చేస్తారన్నారు.
పుష్కరాలకు ఇంజనీర్లతో కమిటీ
సాక్షి, హైదరాబాద్: 2015లో జరిగే గోదావరి పుష్కరాల నిర్వహణకు వచ్చే ప్రతిపాదనలు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందు కు ఆరుగురు ఇంజనీర్లతో కమిటీని ప్రభుత్వం శనివారం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, జీఎల్‌ఐఎస్ చీఫ్ ఇంజనీర్లు, గోదావరి బేసిన్ కమిషనర్, ఖమ్మం, కరీంనగర్‌ల చీఫ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు.