సీఎంను పదవి నుంచి దించి, తన్ని పంపాలి | Kiran Kumar Reddy should step down, says palvai govardhan reddy | Sakshi
Sakshi News home page

సీఎంను పదవి నుంచి దించి, తన్ని పంపాలి

Published Mon, Feb 10 2014 9:03 AM | Last Updated on Fri, Mar 22 2019 6:13 PM

సీఎంను పదవి నుంచి దించి, తన్ని పంపాలి - Sakshi

సీఎంను పదవి నుంచి దించి, తన్ని పంపాలి

మర్రిగూడ: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం పదవి నుంచి దించి తన్ని పంపించాలని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజ్జలాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

కిరణ్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని 9నెలల క్రితమే తాను సోనియాగాంధీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈనెల 12న తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంపై బీజేపీ రంగు కూడా బయటపడుతుందన్నారు. బీజేపీ బిల్లుకు మద్దతు ఇవ్వకపోయినా, దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నం కూడా కేంద్రం చేస్తుందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement