Marriguda mandal
-
నల్గొండ జిల్లాలో చిరుత కలకలం
-
చిక్కినట్టే చిక్కి పంజా విసిరింది..
సాక్షి, నల్గొండ : జిల్లాలోని మర్రిగూడ మండలం రాజపేట తండా శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో చిరుత ప్రత్యక్షం అయింది. పొలానికి ఏర్పాటు చేసిన కంచెలో చిరుత చిక్కుకుంది. గురువారం ఉదయం అటువైపుగా వెళ్లిన రైతులకు చిరుత అరుపులు వినిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు చిరుతను పట్టుకునే పనిలో ఉన్నారు. అయితే ఓ దశలో చిక్కినట్టే చిక్కిన చిరుత.. తప్పించుకుని దాడికి పాల్పడింది. ఓ అధికారిపైకి చిరుత ఎగిరి దూకింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అధికారుల జీప్ కింద దూరింది. ఈ సమయంలో అధికారులు మత్తు ఇవ్వడంతో చిరుత సృహా కోల్పోయింది. దీంతో అధికారులు చిరుతను బోన్లో బంధించారు. కాగా, చిరుత దాడికి ఇద్దరికి గాయాలైనట్టుగా సమాచారం. -
సీఎంను పదవి నుంచి దించి, తన్ని పంపాలి
మర్రిగూడ: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం పదవి నుంచి దించి తన్ని పంపించాలని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజ్జలాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కిరణ్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని 9నెలల క్రితమే తాను సోనియాగాంధీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈనెల 12న తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంపై బీజేపీ రంగు కూడా బయటపడుతుందన్నారు. బీజేపీ బిల్లుకు మద్దతు ఇవ్వకపోయినా, దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నం కూడా కేంద్రం చేస్తుందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు.