
సాక్షి, నల్గొండ : జిల్లాలోని మర్రిగూడ మండలం రాజపేట తండా శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో చిరుత ప్రత్యక్షం అయింది. పొలానికి ఏర్పాటు చేసిన కంచెలో చిరుత చిక్కుకుంది. గురువారం ఉదయం అటువైపుగా వెళ్లిన రైతులకు చిరుత అరుపులు వినిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు చిరుతను పట్టుకునే పనిలో ఉన్నారు.
అయితే ఓ దశలో చిక్కినట్టే చిక్కిన చిరుత.. తప్పించుకుని దాడికి పాల్పడింది. ఓ అధికారిపైకి చిరుత ఎగిరి దూకింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అధికారుల జీప్ కింద దూరింది. ఈ సమయంలో అధికారులు మత్తు ఇవ్వడంతో చిరుత సృహా కోల్పోయింది. దీంతో అధికారులు చిరుతను బోన్‌లో బంధించారు. కాగా, చిరుత దాడికి ఇద్దరికి గాయాలైనట్టుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment