
చంద్రబాబు రాజకీయ వ్యభిచారి: పాల్వాయి
రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏడాది కాలంగా పాలన క్షీణించిందని, శాంతి భద్రతకు విఘాతం కలుగుతోందని ఆయన మండిపడ్డారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ వాదనతో రాష్ట్రంలో హైకమాండ్ పెద్దలు కూడా ఏకీభవించారని ఆయన చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గవర్నర్ నరసింహన్కు రాష్ట్రపతి పాలనలో ఎలా వ్యవహరించాలో అనుభవం లేదని, అందువల్ల రాజకీయ అనుభవం ఉన్న వారిని ఆ పదవిలో నియమించాలని ఆయన కోరారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారిగా వ్యవహరిస్తున్నారంటూ పాల్వాయి దుమ్మెత్తి పోశారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.