పాల్వాయి గోవర్థన్ రెడ్డి
తెలంగాణ బిల్లు ఈ నెల 18న లోక్సభ, 19న రాజ్యసభలో ఆమోదం పొందుతుందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్లో జోస్యం చెప్పారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ముడుపుల కోసం ఫైళ్లపై సంతాకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన సంతకాలు చేసిన ఫైళ్లు చెలవన్నారు. సీఎం మాటలు విని తప్పులు చేసే అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో పెడితే తన పదవికి రాజీనామా చేస్తానని గతం సీఎం కిరణ్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రేపో ఏల్లుండో పార్లమెంట్లో బిల్లు చర్చకు రానుంది. దాంతో కిరణ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ఊహగానాలు ఊపందుకున్నాయి. అందుకోసం సాయంత్రం కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సీఎం గత నాలుగైదు రోజులుగా సచివాలయంలో వందల సంఖ్యలో పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు. దాంతో అటు విపక్షాలు, ఇటు స్వపక్షం చెందిన నాయకులు సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.