
అప్పులు, అబద్ధాలు తప్ప చేసిందేమీ లేదు
కేసీఆర్‌పై పాల్వాయి విమర్శలు
సాక్షి, హైదరాబాద్: అవి నీతి, అప్పులతో రాష్ట్రాన్ని ఊబిలోకి దించిన సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలతో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అబద్ధాలు, అట్టహాసపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలు, ఈ రెండేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ అమలు చేసిన కార్యక్రమాలపై వివరించాలన్నారు. ఈ రెండేళ్లలో లక్షకోట్లు అప్పుచేయడం, అబద్ధాలు చెప్పడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. పార్టీ నుంచి ఎవరు పోయినా కార్యకర్తలు అధైర్య పడక్కర్లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారినా వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారకపోవచ్చన్నారు.