న్యూఢిల్లీ: సాంకేతికంగా, ఆర్థికంగా ఆచరణసాధ్యంగా ఉండటంతోపాటు జాతీయ ప్రాజెక్టుకు ఉండాల్సిన అర్హతలను సంతృప్తిపరిస్తేనే ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా వస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు కూడా రావాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్ లాల్ జాట్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.