Pranahita
-
ప్రాణహిత నదిలో ముగ్గురు యువకులు గల్లంతు
సాక్షి,కొమురంభీంఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ మండలం సోమిని సమీపంలో ప్రాణహిత నదిలో శనివారం(అక్టోబర్ 26) ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి నదిలో స్నానానికి వెళ్లగా ముగ్గురు గల్లంతు కాగా ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు.గల్లంతైన వారిని బెజ్జూరుకు చెందిన జహార్ హుస్సేన్(24), ఇర్షద్ (20), మోయిసిధ్(22)గా గుర్తించారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్షణక్షణం పెరుగుతోన్న ప్రాణహిత నది నీటి మట్టం!
-
ముగిసిన ‘పుష్కరం’.. భక్తజన పునీతం
కౌటాల(సిర్పూర్)/కోటపల్లి(చెన్నూర్)/కాళేశ్వరం: ప్రాణహిత నది పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు ఆదివారం పుష్కర స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఈనెల 13న ప్రాణహిత పుష్కరాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇటు కుమురంభీం జిల్లా తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట, వేమనపల్లితోపాటు అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమ పుష్కరఘాట్లలో ఈ పన్నెండు రోజుల్లో దాదాపు 20 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలాచరించారు. అలాగే కాళేశ్వరాలయాన్ని 10 లక్షల మంది భక్తులు సందర్శించారు. ఆలయానికి వివిధ పూజలు, లడ్డూ ప్రసాదాల రూపేణా రూ.70లక్షల ఆదాయం సమకూరినట్లు అంచనా. కాళేశ్వరం త్రివేణి సంగమ క్షేత్రంలో పన్నెండు రోజులు పన్నెండు హారతులిచ్చారు. ఆదివారం తుమ్మిడిహెట్టి వద్ద 108 యజ్ఞకుండాతో శివసంకల్ప మహాయజ్ఞం నిర్వహించారు. కాశీ నుంచి వచ్చిన వేదపండితులు నదికి ముగింపు హారతినిచ్చారు. -
ప్రాణహిత పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
‘ప్రాణహిత’కు పోటెత్తిన భక్తజనం
భూపాలపల్లి/కాళేశ్వరం/కోటపల్లి/వేమనపల్లి: ప్రాణహిత పుష్కరాలకు రెండోరోజు భక్తజనం పోటెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత నదీతీరం భక్తులతో కిటకిటలాడాయి. గురువారం సెలవు రోజు కూడా కావడంతో తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు, కేరళ నుంచి భక్తులు తరలివచ్చారు. పుష్కర స్నానాలతోపాటు కాళేశ్వర ముక్తీశ్వరులను లక్షమంది వరకు భక్తులు దర్శించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అర్జునగుట్ట, వేమనపల్లి, తుమ్మిడిహెట్టి పుష్కరఘాట్లలో రద్దీ కనిపించింది. కాగా, ప్రాణహిత పుష్కరాలకు మహారాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసి, సౌకర్యాలు కల్పించడంతో మన రాష్ట్రం నుంచి భక్తులు మహారాష్ట్రలోని సిరొంచ, నగురం ఘాట్లకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. మహారాష్ట్రలోని పుష్కరఘాట్లలో 2.5 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. -
ప్రాణహిత పుష్కర సంబరం
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, మంచిర్యాల: ప్రాణహిత పుష్కరాలకు నదీతీరం, త్రివేణి సంగమం సంసిద్ధమైంది. నదులకు 12 ఏళ్లకోసారి నిర్వహించే పుష్కరాల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల గుండా ప్రవహించే ప్రాణహిత నదికి బుధవారం నుంచి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని (సరస్వతి) నదులు కలిసే త్రివేణి సంగమ స్థానం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తనున్నారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో నిర్వహించే ఈ పుష్కరాలకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఘాట్లను ఏర్పాటు చేశాయి. ఈనెల 24 వరకు జరిగే ఈ పుష్కరాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రం, మహారాష్ట్ర వైపు సిరోంచ, నగు రంలో ఈ ఘాట్లు ఉన్నాయి. బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అర్జునగుట్ట వద్ద పుష్కరాలను ప్రారంభించనున్నారు. అన్ని పుష్కరఘాట్ల వద్ద విధుల నిర్వహణ కోసం సుమారు ఆరువేల మంది పోలీసులు, ఇతర శా ఖల సిబ్బంది పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రాణహిత జననం, పయనం: గోదావరి నదికి అతి పెద్ద ఉపనది ప్రాణహిత. పెన్‌గంగా, వార్దా నదిలో తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత పురుడు పోసుకుంది. ఈ నది తుమ్మిడిహెట్టి నుంచి 113 కి.మీ. ప్రవహిస్తుంది. బెజ్జూర్ మండలం గూడెం, సోమిని, తలాయి, వేమనపల్లి మండలం రావులపల్లి, వేమనపల్లి, కలలపేట, ముల్కల్లపేట, రాచర్ల, వెంచపల్లి, కోటపల్లి మండలం జనగామ, నందరాంపల్లి, పుల్లగామ, సిర్సా, అన్నారం, అర్జునగుట్ట గ్రామాల మీదుగా పయనిస్తుంది. మహారాష్ట్ర వైపు గడ్చిరోలి జిల్లాలోని చప్రాల నుంచి ప్రారంభమై అయిరి, ఇందారం, తోగుల వెంకటాపూర్ మీదుగా ప్రవహిస్తూ రేగుంట, కొత్తూర్, తేకడా, గిలాస్పేట, రాయిపేట, రంగాయపల్లి, హమురాజీ, సిరోంచ మీదుగా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం (కాళేశ్వర ముక్తేశ్వరులుగా వెలిసిన పరమేశ్వరుడి పుణ్యక్షేత్రం) వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. పుష్కర ఘాట్లు ఇవే.. ►కాళేశ్వరం త్రివేణి సంగమం – జయశంకర్ భూపాలపల్లి జిల్లా ►తుమ్మిడిహెట్టి– కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ►అర్జునగుట్ట–మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ►వేమనపల్లి – మంచిర్యాల జిల్లా మండల కేంద్రం ►సిరోంచ, నగురం – మహారాష్ట్ర ఇలా చేరుకోవచ్చు.. ►కాళేశ్వరం: హైదరాబాద్ నుంచి కాజీపేట, వరంగల్ వరకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నా యి. వరంగల్ నుంచి రోడ్డుమార్గన భూపా లపల్లి మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు. ►అర్జునగుట్ట: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి మంచిర్యాల వరకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి చెన్నూరు మీదుగా అర్జునగుట్ట ఘాట్‌కు చేరుకోవచ్చు. ►తుమ్మిడిహెట్టి: కుమురంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి ఘాట్‌కు వెళ్లాలంటే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి మంచిర్యాల మీదుగా రైళ్లు కాగజ్‌నగర్ వరకు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సిర్పూర్ టీ మీదుగా తుమ్మిడిహెట్టికి చేరుకోవచ్చు. ►వేమనపల్లి: నిజామాబాద్, కామారెడ్డి, జిల్లాల నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల చేరుకుని అక్కడి నుంచి వేమనçపల్లికి వెళ్లవచ్చు. -
ప్రాణహిత పుష్కరాలకు వేళాయె..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రాణహిత పుష్కరాలను ఈనెల 13 నుంచి 24 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2010 తర్వాత ఈసారి స్వరాష్ట్రంలో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు 5 రోజులుగా యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పుష్కరాల నిర్వహణ ప్రత్యేక అధికారి, కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ఆదివారం కూడా పనులను పర్యవేక్షించారు. తెలంగాణ–మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు.. గడ్చిరోలి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ పుష్కరాలు జరగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ వద్ద.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సాధారణ ప్రజల కోసం ఒకటి, వీఐపీల కోసం మరొకటి ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ కాళేశ్వరంలో శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం ఉన్న నేపథ్యంలో భక్తులు 70 వేల నుంచి లక్ష వరకు కాళేశ్వరం చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా, పుష్కరాల సందర్భంగా కంచిపీఠం ఆధ్వర్యంలో కాళేశ్వరంలో నిర్వహించే పూజా కార్యక్రమాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కుటుంబ సభ్యులతో హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. పుష్కరాల ప్రారంభం రోజునే సీఎం కేసీఆర్ రావచ్చని అధికారులు పేర్కొంటున్నారు. నిధుల విడుదలపై స్పష్టత కరువు.. 2010లో ప్రాణహిత పుష్కరాలకు అన్ని శాఖల నుంచి రూ.8 కోట్ల నిధులు మంజూరు చేసి ఘనంగా నిర్వహించారు. అయితే ఈ సారి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. కలెక్టర్ భవేష్ మిశ్రా కలెక్టర్ కోటా కింద రూ.49 లక్షలు మంజూరు చేశారు. కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి çఘాట్ల వద్ద తాత్కాలిక పనులు రూ.70 లక్షల అంచనాతో చేసేలా ఆ జిల్లా కలెక్టర్ భార తి హోళ్లికేరి అనుమతి ఇచ్చారు. ఈ నిధులతో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు మరుగు దొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఇతర పనులు చేపట్టాయి. పుష్కరాల ప్రారంభానికి రెండు రోజులే ఉండగా, నిధుల మంజూరుపై స్పష్టత లేక అధికార యంత్రాంగం అయోమయంలో ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి కాళేశ్వరంలో లాడ్జిలు, హోటళ్లు, ఇళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. -
అయ్యో బిడ్డా! నువ్వు లేవనే నిజాన్ని ఎలా జీర్ణించుకోమంటావురా తండ్రి
సాక్షి, కోటపల్లి(చెన్నూర్): ‘‘అయ్యో బిడ్డా.. చేతికందివచ్చిన నువ్వు మాకు చేదోడుగా ఉంటావనుకుంటే నిన్ను ప్రాణహిత నది పొట్టనపెట్టుకుందా.. కోటి ఆశలతో పెంచుకున్న నువ్వు మాకు లేవనే నిజాన్ని ఎలా జీర్ణించుకోమంటావురా తండ్రి..’’ అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో గ్రామానికి చెందిన విద్యార్థులు అంబాల విజేందర్‌సాయి(16), వంశీవర్ధన్(18), గారె రాకేశ్(20) సోమవారం సరదాగా స్నానానికి వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం ఇద్దరి మృతదేహాలు లభించాయి. మరొకరి ఆచూకీ లభించలేదు. పెద్ద వలతో గాలింపు.. గజ ఈతగాళ్లు, సింగరేణి రెస్క్యూ టీం స్పీడ్ బోట్‌తో మంగళవారం గాలింపు చేపట్టారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు మండలంలోని వెంచపల్లి, రాచర్ల, జనగామ గ్రామాలకు చెందిన మత్స్యకారులను పిలిపించారు. 20 మంది దండెంగ(పెద్ద వల)తో నాటుపడవల సహాయంతో నదిలో గాలింపు చేపట్టారు. మొదట అంబాల విజయేందర్‌సాయి మృతదేహాం వలకు చిక్కింది. 20 నిమిషాల తర్వాత వంశీవర్ధన్ మృతదేహం లభ్యమైంది. దీంతో వారి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరి మృతదేహాలకు డాక్టర్ విజిత్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. చదవండి: ప్రియుడితో పిజ్జాహట్‌కు.. మొదటి భార్యతో కలిసి వీడియో రికార్డింగ్ సహాయక చర్యల పర్యవేక్షణ గాలింపు చర్యలను ఆర్డీవో వేణు, జైపూర్ ఏసీపీ నరేందర్ పర్యవేక్షించారు. సింగరేణి రెస్క్యూ టీం, స్థానిక జాలర్లను సమన్వయం చేస్తూ మత్స్యకారులకు ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చారు. గాలింపు చర్యలు వేగవంతానికి అవసరమైన వాటిని సమకూర్చారు. కొనసాగుతున్న గాలింపు మరో విద్యార్థి గారె రాకేశ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇద్దరు విద్యార్థులు విగతజీవులై కనిపించడంతో రాకేశ్ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తమ కొడుకు ఆచూకీని ఎలాగైనా కనిపెట్టాలని విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కదిలించింది. మంగళవారం సాయంత్రం చీకటి పడే వరకు గాలింపు చర్యలు చేపట్టినా రాకేశ్ ఆచూకీ లభించలేదు. దీంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. చదవండి: వైద్యుని ఆత్మహత్య వెనుక హనీట్రాప్.. నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్ మాజీ ఎమ్మెల్సీ పరామర్శ విజయేందర్‌సాయి, వంశీవర్ధన్ మృతదేహాలు లభ్యం కాగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ నివాళులు అర్పించారు. మృతుల తల్లిదండ్రులను పరామర్శించి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం చేశారు. ఆయన వెంట ఎంపీపీ మంత్రిసురేఖా, వైస్ ఎంపీపీ వాల శ్రీనివాసరావు, సర్పంచ్ కుమ్మరి సంతోశ్, గట్టు లక్ష్మణ్‌గౌడ్, జెల్ల సతీశ్, పున్నంచంద్, సత్యనారాయణరావు, ఎంపీటీసీలు తిరుపతి, శేఖర్, జెడ్పీకోఆప్షన్ అజ్గర్, పీఏసీఎస్ ఛైర్మన్ సాంబగౌడ్, నాయకులు ఉన్నారు. -
మంచిర్యాలలో ఇంకా దొరకని విద్యార్థుల ఆచూకీ
-
నదిలో దిగి ఐదుగురు గల్లంతు
కోటపల్లి(చెన్నూర్)/ హుజూర్నగర్(చింతలపాలెం): మంచిర్యాల, సూర్యాపేట జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు ఘటనల్లో ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో సరదాగా ఈతకు వెళ్లిన ఆరుగురు స్నేహితుల్లో ముగ్గురు గల్లంతుకాగా, సూర్యాపేట జిల్లా చింతలపాలెం కృష్ణా నదిలో వలలో తీసేందుకు వెళ్లిన ఘటనలో మరో ఇద్దరు గల్లంతయ్యారు. మంచిర్యాల జిల్లా ఆలుగామ గ్రామానికి చెందిన గారె రాకేశ్ (20), అం బాల వంశీ (20), అంబాల విజయేందర్ సాయి (16), తగరం శ్రావణ్ (21), గారె కార్తీక్, అంబాల రఘు సోమవారం గ్రామ సమీపంలోని ప్రాణహితలో ఈత కొట్టడానికి వెళ్లారు. నది లోతును అంచనా వేయకపోవడంతో ముందుకు వెళ్లి న విద్యార్థులు నీటి ప్రవాహానికి గల్లంతయ్యారు. గారె కార్తీక్, అంబాల రఘు ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా.. కేకలు పెడుతున్న తగరం శ్రావణ్‌ను అక్కడే చేపలు పడుతున్న మత్స్య కారుడు అశోక్ ప్రాణాలతో ఒడ్డుకు తీసుకొచ్చాడు. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో రాకేశ్, వంశీ, సాయి గల్లంతయ్యా రు. చెన్నూర్ రూరల్ సీఐ నాగ రాజు ఆధ్వర్యంలో సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చీకటి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. విద్యార్థుల గల్లంతుపై చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో మాట్లాడి గాలిం పు చర్యలను ముమ్మ రం చేయాలని ఆదేశించారు. చేపల కోసం వల విసిరి.. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన కొమ్ము శ్రీను కృష్ణానదిలో చేపల కోసం వల వేశాడు. వలలను తెచ్చేందుకు అతని కుమారుడు శ్రీగోపి (13), బావమరిది కందుకూరి చంద్రశేఖర్ (24) పులిచింతల బ్యాక్ వాటర్‌కి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వారికి కొమ్ము శ్రీను ఫోన్ చేయగా.. రెండు వలలు తీసామని, మూడో వల తెచ్చేందుకు వెళ్తున్నామని చెప్పారు. అయితే ఎంతసేపటికీ వారు తిరిగిరాకపోవడంతో నదిలో గల్లంతయ్యారని భావించి ఇంజన్ పడవలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఐ రంజిత్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. సాయంత్రం వరకు కూడా వారి ఆచూకీ లభించలేదు. -
రెండు నదులు.. రెండు రంగులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలుస్తాయి. గోదావరి తెలంగాణలోని మంచిర్యాల మీదుగా, ప్రాణహిత నది మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి వచ్చి కాళేశ్వరం వద్ద కలుస్తోంది. దీంతో రెండు నదులు కలవడంతో మూడవ నదిగా సరస్వతి నది ఉద్భవిస్తుంది. దీనినే గుప్త నదిగా పిలుస్తారు. బుధవారం గోదావరి వరద నీరు లేత నీలిరంగులో, ప్రాణహిత వరద నీరు లేత ఎరుపు రంగుల్లో కనిపించి చూపరులను ఆకర్షించింది. రెండు నదులు ఒకేచోట రెండు రంగుల్లో వేర్వేరుగా కనిపించడంతో కాళేశ్వరానికి వచి్చన భక్తులు ఆసక్తిగా తిలకించారు. – కాళేశ్వరం -
ఉప్పొంగుతున్న ప్రాణహిత
సాక్షి, హైదరాబాద్ : గోదావరి ఎగువన రెండ్రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు నిండి ఆ నీరంతా వచ్చి చేరుతుండటంతో ప్రాణహిత ఉప్పొంగుతోంది. ఇదే సమయంలో గోదావరి పరీవాహకంలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో రెండు నదులు కలిసే కాళేశ్వరం వద్ద గోదావరిలో 3.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఈ మొత్తం సీజన్లో ఇవే గరిష్ట ప్రవాహాలు కాగా, మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం ఇప్పటికే తెలంగాణతో పాటు పరీవాహక రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్నారం, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు.. అన్నారం బ్యారేజీలోకి స్థానికంగా ఉన్న మానేరు నది నుంచి 24 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీనిలో 10.87 టీఎంసీలకు 9.25 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండటంతో 8 పంపుల ద్వారా 20వేల క్యూసెక్కులకు పైగా నీటిని సుందిళ్లలోకి పంపింగ్ చేస్తున్నారు. సుందిళ్లకు వస్తున్న నీటిని వచ్చినవి వచ్చినట్లు ఎల్లంపల్లికి పంపింగ్ చేస్తున్నారు. ఎగువ పంపింగ్ చేస్తున్న నీటికి తోడు స్థానిక ప్రవాహాలు కలిసి ఎల్లంపల్లిలోకి ప్రస్తుతం 25,916 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వ 20.18 టీఎంసీలకు గాను 12 టీఎంసీలకు చేరింది. ఇక్కడి నుంచి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా మిడ్‌మానేరుకు నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మిడ్‌మానేరులోకి 21వేల క్యూసెక్కుల మేర నీటిని ఎత్తిపోస్తుండగా నిల్వ 25.87 టీఎంసీలకు 15.31 టీఎంసీలకు చేరింది. అన్నారం నుంచి మిడ్‌మానేరు వరకు కాళేశ్వరం ద్వారా గోదావరి ఎత్తిపోతలను మరో వారం పాటు కొనసాగించనున్నారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున కనీసంగా 14 టీఎంసీల నీటిని ఎత్తిపోసినా మిడ్‌మానేరు, ఎల్లంపల్లి పూర్తిగా నిండనున్నాయి. ఇక శ్రీరాంసాగర్‌లోకి నీటి ప్రవాహాలు స్థిరంగా నమోదవుతున్నాయి. ప్రాజెక్టులోకి 23,522 క్యూసెక్కుల మేర వరద వస్తుండగా, ప్రాజెక్టులో నిల్వ 90 టీఎంసీలకుగాను 41 టీఎంసీలకు చేరింది. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి మొత్తంగా 27 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. ‘కాళేశ్వరం’ జలజల కాళేశ్వరం వద్ద ఏటా జూన్ రెండో వారం నుంచే ప్రవాహాలు మొదలవుతుండగా, ఈ ఏడాది జూలై మొదటి వారం నుంచి ప్రవాహాలు మొదలయ్యాయి. గతేడాది జూలై మొదటి వారం నుంచే 50వేల క్యూసెక్కులకు పైగా నీరు రాగా, ఈ ఏడాది జూలై చివరి వారం నుంచి 50వేల నుంచి 1.10 లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహాలు వచ్చా యి. అయినా అవి మళ్లీ 80వేల క్యూసెక్కులకు తగ్గిపోయాయి. ఇటీవలి వర్షాలతో కాస్త పుంజుకొని, ఈ నెల 11న 83వేల క్యూసెక్కుల మేర నమోదుకాగా, 12న 2లక్షల క్యూసెక్కులకు పెరిగాయి. ఇక 13న గురువారం ఏకంగా 3.79 లక్షల క్యూసెక్కులకు చేరింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో ఇప్పటికే 16.17 టీఎంసీలకు గాను 9.20 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండటంతో అన్ని గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఇక మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని పంపులను సైతం నిలిపివేశారు. -
గల్లంతైన ఫారెస్ట్ ఆఫీసర్ల మృతదేహాలు లభ్యం
సాక్షి,ఆదిలాబాద్: కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని గూడెం వద్ద ప్రాణహిత నదిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్ల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఆదివారం విధుల్లో ఉన్న ఇద్దరు బీట్ అధికారులు గల్లంతయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహెరి నుంచి గూడెం వైపుకు నాటు పడవలో వస్తుండగా ప్రమాదం జరిగింది. పడవలో పడవనడిపే నావికుడు పాణె లింగయ్య, సహాయకుడు పేదం అర్జయ్య, ప్రయాణికుడు సూర కత్రయ్య, ముగ్గురు అటవీశాఖ బీట్ అధికారులు సద్దాం, ముంజం బాలక్రిష్ణ, బానావత్ సురేష్ నాయక్‌లు ఉన్నారు. ఖర్జెల్లి రేంజ్ పరిధిలోని గూడెం సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు బీట్ అధికారులు తమ విధుల్లో భాగంగా పర్యవేక్షిస్తూ నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి కాలినడకన ప్రాణహిత నదికి ఆవలివైపుకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో నాటు పడవలోకి నీరు రావడంతో బయటకు తోడే క్రమంలో పడవ మునిగింది. లింగయ్య , సహాయకుడు అర్జయ్య, కత్రయ్య సమీపంలోని చెట్ల సహాయంతో బయటకు వచ్చారు. కాగా బీట్ అధికారి సద్దాం ఈదుకుంటూ బయటకు రాగా ముంజం బాలక్రిష్ణ, సురేష్ నాయక్‌లు నీటమునిగారు. ముంజం బాలక్రిష్ణ స్వస్థలం కాగజ్‌నగర్ మండలంలోని చింతగూడ కోయవాగు కాగా బానావత్ సురేష్ నాయక్ కెరమెరి మండలంలోని దేవాపూర్ గ్రామపంచాయితీ టెంమ్లగూడ గ్రామానికి చెందినవాడు. సమాచారం అందుకున్న చింతలమానెపల్లి ఎస్సై రాం మోహన్, అటవీశాఖ అధికారులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ స్వామి, కాగజ్‌నగర్ అటవీ డివిజన్ అధికారి విజయ్‌కుమార్‌లు పరిశీలించారు. అటవీ అధికారుల ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాయంత్రం చీకటి పడడంతో గా లింపు చర్యలు నిలిపి వేసినట్లు ఎస్సై రాంమోహన్ తె లిపారు. నదిలో ప్రమాదం నుంచి బయటపడ్డ సద్దాం అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. పడవ నావికుడు లింగయ్య, అర్జయ్యలను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. నిర్లక్ష్యంతోనే ప్రమాదం. పడవ నడిపే వారి నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికుల ఆరోపణలు చేస్తున్నారు. పడవ నడిపే లింగయ్య, సహాయకుడు అర్జయ్యలు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతిరోజు గూడెం నుంచి అహెరి ప్రాంతానికి అహెరి నుంచి అహెరి వైపుకు నిత్యం వందల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులను తరలించడానికి ఇంజన్లను బిగించిన పెద్ద సైజు పడవలను వినియోగిస్తుంటారు. ఉదయం కేవలం నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉండడంతో చేపల వేటకు వినియోగించే చిన్న నాటుపడవలో వీరిని తరలించేందుకు ప్రయత్నించారు. పడవ ప్రమాదకరంగా ఉండడంతో పడవలోకి నీళ్లు రాగా తోడే క్రమంలో పడవ బోల్తా పడింది. ఆందోళనలో కుటుంబసభ్యులు. బీట్ అధికారులు గల్లంతయిన ప్రమాదంపై సమాచారం అందడంతో ఘటనా స్థలానికి బీట్ అధికారుల కుటుంబసభ్యులు చేరుకున్నారు. బాలక్రిష్ణ తండ్రి ముంజం మల్లయ్య, సోదరుడు శివ, చింతలమానెపల్లి మండల కేంద్రంలోని ఇతర బంధువులు నది వద్దకు చేరుకున్నారు. బాలక్రిష్ణ గత జూలై నెలలో బీట్ అధికారిగా విధుల్లో చేరగా, సురేష్ గత అక్టోబర్‌లో విధుల్లో చేరాడు. బాలక్రిష్ణకు భార్య దుర్గారాణి, 6 నెలల కుమారుడు రుద్రాంశ్ ఉన్నారు. సురేష్ నాయక్‌కు భార్య మనీషా 4సంవత్సరాల కుమారుడు గణేష్ ఉన్నాడు. కాగా సురేష్ భార్య మనీషా 9నెలల గర్భిణి. కళ్లముందే నీట మునిగారు విధుల్లో భాగంగా నదికి ఆవలివైపునకు నిర్మాణంలో ఉన్న వంతెన నుంచి నడిచి వెళ్లాం. తిరిగి వచ్చేక్రమంలో వంతెనపై నుంచి కాకుండా పడవలో బయలుదేరాం. ప్రయాణికులు లేకపోవడంతో నాటు పడవలో వెళ్లాలని పడవ నిర్వాహకులు చెప్పడంతో పడవలోకి ఎక్కాం. నది మధ్యలోకి వెళ్లగానే పడవలోకి నీరు రావడంతో సహాయకుడు నీరు బయటకు తోడే క్రమంలో పడవ మునిగిపోయింది. చెట్ల సహాయంతో నేను, మరో ప్రయాణికుడు ప్రమాదం నుంచి బయటపడ్డాం. మా కళ్ల ముందే ఇద్దరు బీట్ అధికారులు నదిలో మునిగిపోయారు. –సద్దాం, బీట్ అధికారి -
ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా
సాక్షి, కొమురం భీం: జిల్లాలోని చింతల మనేపల్లి మండలం గూడెం గ్రామం సమీపంలోని ప్రాణహితనదిలో నీటి ప్రవాహానికి నాటు పడవ బోల్తాపడింది. కర్జెల్లి రేంజ్‌కు చెందిన బాలకృష్ణ, సురేష్ అనే ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గల్లెంతు అయినట్లు తెలుస్తోంది. సద్దాం అనే మరో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పడవ నడిపే వ్యక్తి, మరొకరు సురక్షితంగా ప్రమాదం నుంచి నుంచి బయటపడ్డారు. వీరితోపాటు మొత్తం ఆరుగురు ఈ పడవలో ఎక్కినట్లు తెసుస్తోంది. మహారాష్ట్రలోని అహేరి నుంచి గూడెంకు వస్తుండగా.. అధిక నీటి ప్రవాహంతో పడవలోకి నీరు చేరింది. దీంతో నాటు పడప ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయింది. కాగా గల్లంతు అయిన ఇద్దరు బీట్ ఆఫీసర్లు బాలకృష్ణ, సురేష్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం కావటంతో గూడెం వాళ్లు మహారాష్ట్రకి వెళ్లినట్లు తెలుస్తోంది. -
‘ప్రాణహిత’పై ఆశలు
సాక్షి, ఆసిఫాబాద్: ప్రాణహిత ప్రాజెక్టుపై జిల్లా రైతాంగానికి ఆశలు పోవడం లేదు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టాలనే డిమాండ్ బలపడుతున్న నేపథ్యంలో ఈ ఆశలు మరింత ఎక్కువతున్నాయి. ప్రతిపక్షాలు ఇక్కడ ప్రాజెక్టు కట్టాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ బ్యారేజీ నిర్మాణంపై జిల్లా రైతాంగానికి ఆశలు సజీవంగా ఉంటున్నాయి. ఏటా వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే ప్రాణహిత నది ప్రవాహంలో లక్షల క్యూసెక్కుల నీరు జిల్లా రైతాంగం కళ్లెదుటే గోదావరిలో కలిసిపోతూ దిగువ ప్రాంతానికి తరలిపోతోంది. ఈ నీటి లభ్యతనే వాడుకునేందుకు రూ.38వేల కోట్లతో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా పరిధిలోని 16.40 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు. ఈ మొత్తం ఆయకట్టులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోనే 1.56 లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా ప్రణాళిక వేశారు. అయితే తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రాజెక్టుల రీడిజైన్‌లో భాగంగా బ్యారేజీ నిర్మాణం తుమ్మిడిహెట్టి నుంచి ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద గోదావరిపై నిర్మించాలని యోచించడం, త్వరతిగతిన ప్రాజెక్టు పనులు పూర్తవడం, ప్రస్తుతం ఎత్తిపోతలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే తుమ్మిడిహెట్టి వద్ద మాత్రం ఎటువంటి కదలిక లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. దీనిపై త్వరితగతిన ఏదైనా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎటూ తేల్చని సర్కారు ప్రాణహితపై బ్యారేజీ నిర్మాణం విషయంలో ఇప్పటికీ ఎటువంటి అధికార ప్రకటన చేయకపోవడంతో ప్రతిపక్షాలు తరచూ ఆందోళన చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఇక్కడి రైతులకు సాగు నీరందిస్తామని తరచూ పార్టీ రాష్ట్రస్థాయి అగ్ర నాయకులు హామీ ఇస్తున్నారు. మిగతా విపక్ష పార్టీలు సైతం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి అనుకూలంగా ఉండడంతో ఎప్పటికైనా ప్రాణహితపై బ్యారేజీ నిర్మిస్తారనే ఆశల్లో ఇక్కడి రైతులు ఉన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి చింతలమానేపల్లి, దహేగాం మండల పరిధిలో తవ్విన కాలువలు నిరుపయోగంగా మారాయి. ఇందుకోసం గతంలోనే రైతుల నుంచి భూమి సేకరించారు. ఇక్కడ నీరు అందుతుందనే ఆశతో అనేక మంది రైతులు భూములు ఇచ్చి ప్రాజెక్టు ప్రారంభంలో ఆశ పడినా చివరకు ఇలా నిలిచిపోవడంతో అంతా నిరాశలో ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రాణహితపై బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు అధికంగా ఉందని చెబుతు ముంపు తక్కువగా ఉన్న వార్దపై బ్యారేజీ నిర్మించి ఈ కాలువలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై కూడా ఎటువంటి స్పష్టత రాలేదు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు భవితవ్యం ఎటూ తేలకున్నా ఎప్పటికైనా బ్యారేజీ నిర్మితమవుతుందనే రైతుల ఆశలు సజీవంగా ఉంటున్నాయి. ఏళ్లుగా అదే అవస్థలు జిల్లాలో అపరిమితమైన సహజ నీటి వనరులున్నా రైతులకు ఆయకట్టు అందక పత్తి, సోయా, కంది, జొన్న వంటి ఆరుతడి పంటలకే పరిమతమవుతున్నారు. ఇప్పటికీ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు పైగా కేవలం పత్తి పంటనే ప్రధాన పంటగా పండిస్తున్నారు. వరి సాగు అంతంత మాత్రమే. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే వెనుకబడిన జిల్లాలో సాగు నీరందించడంతో వరి సాగు పెరిగి అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. మరోవైపు జిల్లాలో ప్రాణహిత బ్యారేజీతో పాటు కుమురం భీం, వట్టివాగు, జగన్నాథపూర్ ప్రాజెక్టులు సైతం పెండింగ్‌లోనే ఉండి రైతులకు సాగు నీరందించే స్థితిలో లేకపోవడంతో ఏళ్లుగా సాగునీటికి తిప్పలు తప్పడం లేదు. -
‘తుమ్మిడిహెట్టి’ కోసం కదిలిన కాంగ్రెస్
సాక్షి, కాగజ్‌నగర్: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగంలోకి దిగారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చొరవతో కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో దాదాపుగా 16.5 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రూ.38వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ సైతం చేశారు. కెనాల్ పనులు సైతం జరిగాయి. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కనపెట్టి కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది. రీడిజైన్ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తూ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారని మొదటి నుంచి ప్రతిపక్షం వాదిస్తూనే ఉంది. రంగంలోకి రాష్ట్ర నాయకత్వం ఈ నేపథ్యంలో సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకులు పోన్నాల లక్ష్మయ్య, హన్మంతరావు, షేబ్బీర్‌అలీ, జానరెడ్డి, సురేష్ సెట్కార్, కొండ విశ్వేశ్వర్, మల్లు రవి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఉదయం 11గంటలకు కాగజ్‌నగర్ చేరుకోగా వారికి కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్లో కుమురంభీం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, సిర్పూర్ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు మంచిర్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11గంటలకు తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో కాగజ్‌నగర్ చేరుకుని ఇక్కడి నుంచి కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి ప్రాణహిత నదిని పరిశీలించడానికి వెళ్లారు. ప్రాణహిత నదిలో నీటి లభ్యత గురించి తెలుసుకుని పరిశీలించారు. -
రాష్ట్ర ప్రభుత్వానివి ఏకపక్ష విధానాలు
సాక్షి, కౌటాల/కాగజ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష విధానాలు అవలంభిస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. కౌటాల మండలంలోని తమ్మిడిహెట్టి వద్ద సోమవారం ఆయన ప్రాణహిత నదిని సందర్శించారు. పడవ ద్వారా నదిలో తిరిగి పూజలు చేశారు. నది వద్ద, కాగజ్‌నగర్‌లోని ప్రజా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. దాదాపు 50 శాతం కాలువల తవ్వకాలు పూర్తి కాగా కమీషన్లకు కక్కుర్తి పడి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును కాళేశ్వరం వద్దకు తరలించిందని ఆరోపించారు. రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత ప్రాజెక్టును కాకుండా, రూ.83వేల కోట్లతో కాళేశ్వరాన్ని నిర్మించారని తెలిపారు. రూ.45వేల కోట్లు అధికంగా ఖర్చు చేసిందని వెల్లడించారు. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని, నిర్మించకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేపట్టాలి.. తమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా సుందిళ్లకు వేళ్లే నీటిని ప్రస్తుతం కాళేశ్వరంలో ఎత్తిపోతలు చేపట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. వార్ధా నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కమీషన్లు రావనే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగడం లేదని విమర్శించారు. ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ వెబ్సైట్లో పెట్టలేదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు న్యాయం జరిగేలా తమ్మిడిహెట్టి నుంచి పోరాటాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, జల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రాజేంద్రకుమారి, నియోజకవర్గ ఇన్చార్జి హరీష్‌బాబు, ఎస్సీసెల్ అధ్యక్షుడు వసంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉరకలేస్తున్న గోదావరి
కాళేశ్వరం/ఏటూరునాగారం/చర్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగుతున్నాయి. వారం రోజులుగా తెలంగాణ, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాణహిత నదికి వరద తాకిడి పెరిగింది. ఆదివారం రాత్రి వరకు 10.7 మీటర్ల ఎత్తులో గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తూ మేడిగడ్డ వైపునకు తరలిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో 81 గేట్లు మూసివేశారు. బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఉన్నాయి. అవుట్ ఫ్లో 8.26 లక్షల క్యూసెక్కులుగా, ఇన్‌ఫ్లో 8.10 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీలో నీటి నిల్వ 5.98 టీఎంసీలు ఉంది. ఇక అన్నారం బ్యారేజీలో మొత్తం 66 గేట్లు ఉండగా 4 గేట్లు ఎత్తారు. అందులో నుంచి కిందకు 18,000 క్యూసెక్కుల వరద తరలిపోతోంది. బ్యారేజీలో నిల్వ 9 టీఎంసీలు ఉంది. ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రాంతంలో గోదావరి నీటి మట్టం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న పీవీ నర్సింహారావు సుజల స్రవంతి బ్యారేజీ పనులు వారం రోజులుగా నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టింది. బుధవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో గోదావరికి ఎగువన ఉన్న తాలిపేరు, గుండ్లవాగు, పాలెంవాగు, చీకుపల్లివాగు, గుబ్బలమంగి తదితర వాగుల నుంచి భారీగా వరదనీరు రావడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శనివారం రాత్రి వరకు 46.30 అడుగులకు చేరగా.. అయితే ఆదివారం సాయంత్రానికి 43 అడుగులకు తగ్గింది. -
722 గంటలు.. 5.65 టీఎంసీలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం.. ప్రాజెక్టుల్లోకి ఎక్కడా నీటి ప్రవాహాలు కానరాని నేపథ్యంలో ప్రాణహిత ద్వారా వస్తున్న వరద నీటికి అడ్డుకట్ట వేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపుపై ప్రభుత్వం పూర్తి శ్రద్ధ పెట్టింది. మేడిగడ్డ బ్యారేజీకి వచ్చిన వరదను వచ్చినట్లుగా ఒడిసిపడుతున్న నీటిపారుదల శాఖ కన్నెపల్లి పంప్‌హౌజ్ ద్వారా ఎత్తిపోతలు చేపడుతోంది. ఇంతవరకు 722 గంటల పాటు కన్నెపల్లిలోని 5 మోటార్లను నడపగా, 5.65 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోశారు. మేడిగడ్డ బ్యారేజీలో మరో 7 టీఎంసీల మేర నీటిని నిల్వ చేశారు. ప్రాణహిత నదీ పరివాహకంలో ఆశిం చిన స్థాయి వర్షాలు కురుస్తుండటంతో వరద ఉధృతి పెరిగే అవకాశాల నేపథ్యంలో దిగువ అన్నారం పంపులకు వెట్‌రన్ మొదలుపెట్టగా, సుందిళ్ల పంపులను అధికారులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇప్పటివరకు ఓకే.. ఇకపైనే భారీ ఆశలు ప్రాణహిత నదికి ఇంతవరకు ఆశించిన స్థాయిలో ప్రవాహాలు రాలేదు. గతేడాది ఇదే సమయానికి 2.50 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు నమోదు కాగా ఈ ఏడాది గరిష్టంగా 20 వేల క్యూసెక్కులకు మించి ప్రవాహం రాలేదు. వచ్చిన కొద్దిపాటి వరదను మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూసి, అక్కడి నుంచి కన్నెపల్లి పంప్‌హౌజ్ ద్వారా ఎత్తిపోస్తున్నారు. ఇప్పటివరకు 5.65 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఆదివారం నుంచి ప్రాణహిత ద్వారా 9,700 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో తిరిగి రెండు పంపులను ఆరంభించి నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో 7 టీఎంసీల మేర 96.5 మీటర్ల వరకు నీటి నిల్వ ఉంది. వచ్చిన వరదను వచ్చినట్లుగా అడ్డుకట్ట వేస్తున్నారు. అయితే ఈ వరద మరో 4 రోజుల్లో పుంజుకునే అవకాశాలు ఉన్నాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఉధృతి మొదలైతే కన్నెపల్లిలో 6 పంపులను ఆరంభించి రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా అధికారులు అంతా సిద్ధం చేశారు. ఇక వరద ఉధృతి పెరిగి రోజుకు టీఎంసీ నీటి ఎత్తిపోతల మొదలు పెట్టే నాటికి అన్నారంలో 4 పంపులు, సుందిళ్లలో 5 పంపులను పరీక్షించి సిద్ధం చేసేలా ఇంజనీర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నారంలో ఒక పంపు వెట్‌రన్ పూర్తి కాగా, ఆదివారం 3 వేల క్యూసెక్కుల సామ ర్థ్యం ఉన్న మరో పంపునకు వెట్‌రన్ నిర్వహించారు. అన్నారం నుంచి నీరు సుందిళ్ల బ్యారేజీకి చేరుతోంది. ఆగస్టు 15 నాటికి మిడ్‌మానేరుకు.. సుందిళ్ల నిల్వ సామర్థ్యం 8.87 టీఎంసీ కాగా ఇందులోనూ 4.5 టీఎంసీల మేర నిల్వలు చేరితే ఇక్కడి నుంచి నీటి ఎత్తిపోతలు మొదలు కానుంది. వచ్చే నెల తొలి వారం నుంచి ఇక్కడ ఎత్తిపోతలు ఆరంభిం చే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఎల్లంపల్లిలో ప్రస్తుతం లభ్యతగా ఉన్న 5.60 టీఎంసీల నీటిని ప్యాకేజీ–6లో సిద్ధంగా ఉన్న 5 మోటార్ల ద్వారా ప్యాకేజీ–7 టన్నెల్ ద్వారా ప్యాకేజీ–8 పంప్హౌజ్కి, అటునుంచి సిద్ధంగా ఉంచిన 5 మోటార్ల ద్వారా నీటిని మిడ్‌మానేరుకు తరలించనున్నారు. వచ్చే నెల ఆగస్టు 15 నాటికి గోదావరి నీళ్లు మిడ్‌మానేరుకు చేర్చాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. -
గోదావరికి.. ‘ప్రాణ’హితం
సాక్షి, రామగుండం(కరీంనగర్): జూలైమాసం ఆరుద్ర కార్తె కొనసాగింపులో భారీవర్షాలతో చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండను తలపించారు. అయితే ఈ ఏడాది భిన్న వాతావరణం కనిపిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ప్రాజెక్టుల్లో వరద నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో గతేడాది ఇదే జూలై మాసం 13వ తేదీన(ఆరుద్ర కార్తె)లో 10.10 టీఎంసీల వరద నీరు ఉంది. ప్రస్తుతం 4.89 టీఎంసీల వరదనీరు ఉండడంతో నీటిపారుదలశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో వరద నీటి మట్టం తగ్గిపోవడంతో ఇసుక తెప్పలతో ప్రాజెక్టు అందాలు కళవిహీనంగా మారాయి. ప్రాజెక్టు అవతలి వైపు మంచిర్యాల జిల్లా పరిధిలోకి వచ్చే మిషన్ భగీరథ పంపుహౌస్ వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. పంపుహౌస్ చుట్టూ ఇసుకతెప్పలు దర్శనమిస్తున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఎల్లంపల్లి ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్టు, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా ఖాళీ అయి ఉండడంతో వరదనీరు అందులోకి చేరుతోంది. దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో చుక్కనీరు రాకపోవడంతో వెలవెలబోతోంది. గోదావరినదికి ప్రాణం పోస్తున్న ప్రాణహిత వరద నీరు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా దశమార్చి వస్తున్న వరద నీటితో గోదావరిదిశ మారుతోంది. మహారాష్ట్ర గడ్చిరోలి నుంచి వస్తున్న ప్రాణహితనది నీరు కాళేశ్వరం గోదావరిలో కలుస్తోంది. ప్రాణహిత నది ఇన్‌ఫ్లో 12వేల క్యూసెక్కుల నీటి ప్రవహం ఉండడంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీగా వరదనీరు చేరుతోంది. కాగా ప్రస్తుతం ప్రాణహిత ఇన్‌ఫ్లో 11వేల క్యూసెక్కులకు తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వరదనీటిని కన్నెపల్లి పంపుహౌస్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీలోకి చేర్చి.. పంపుహౌజ్ వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికే మంథనిలో గోదావరినది ప్రాణహిత నీటితో జలకళను సంతరించుకోవడంతో తొలి ఏకాదశి పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది. అన్నారం పంపుహౌస్ నుంచి ఎత్తిపోసేందుకు మోటార్లకు సరిపడు వరద నీటి లభ్యతను బట్టి త్వరలోనే సుందిళ్ల బ్యారేజీలోకి మళ్లించి సుందిళ్ల (గోలివాడ) పంపుహౌజ్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పంపింగ్ చేయనుండడంతో గోదావరినదికి ప్రాణహిత ప్రాణం పోసినట్లవుతుందని స్పష్టంకానుంది. ఫలితంగా గోదావరినదిలో నీటి లభ్యత లేకపోయినప్పటికీ వృథాగా సముద్రం పాలవుతున్న ప్రాణహిత నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా సద్వినియోగం చేసుకోవడంతో ఎల్లంపల్లిలో జలక సంతరించుకోనుంది. సుందిళ్ల పంపుహౌస్‌లో సిద్ధం చేస్తున్న మోటార్లు ప్రాణహిత నీటిపంపింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో సుందిళ్ల (గోలివాడ) పంపుహౌస్ అధికారులు అప్రమత్తమయ్యారు. పంపుహౌస్‌లో తొమ్మిది మోటార్లకు గాను ఇప్పటికే ఏడు మోటార్లు సిద్ధం చేసిన అధికారులు ఈనెల చివరి కల్లా మరో రెండు మోటార్లు రన్ చేసే స్థాయికి తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో ఈ నెల చివరి వరకు భారీ వర్షాలు కురిసి జలాశయాల్లోకి సరిపడు నీరు చేరితే రివర్స్ పంపింగ్ విధానంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద నీటిని మళ్లించనున్నారు. -
కన్నెపల్లి వద్ద పెరిగిన వరద
కాళేశ్వరం: జయశంకర్ భూపాపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో మూడు రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. గోదావరి, ప్రాణహిత నదులు కలవడంతో కాళేశ్వరం పుష్కరఘాట్ల వద్ద 5.40 మీటర్ల ఎత్తులో ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. కాళేశ్వరం, కన్నెపల్లిలో గోదావరి వద్ద 30 వేల క్యూసెక్కుల వరద మేడిగడ్డ వైపు తరలిపోతుండటంతో ఇప్పటికే 30కి పైగా గేట్లను మూశారు. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఒకటవ మోటార్ నిరంతరం నీటిని ఎత్తిపోస్తుండటంతో గ్రావిటీ కాల్వ సగం వరకు నిండి 13.345 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. మూడో మోటార్‌కు శనివారం రాత్రి వెట్‌రన్ నిర్వహించనున్నారు. నిమిషానికి 2,110 క్యూసెక్కులు కన్నెపల్లి పంపుహౌస్ నుంచి డెలివరీ సిస్టంలో వదిలిన నీళ్లు గ్రావిటీ కాల్వ నుంచి తరలిపోయి అండర్ టన్నెల్ వద్ద అన్నారం బ్యారేజీలోని గోదావరిలో కలుసుతున్నాయి. నిమిషానికి 2,110 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అధికారులు అక్కడ ఉన్న 66 గేట్లు మూసి ఉంచారు. కన్నెపల్లి, మేడిగడ్డకు అర్ధరాత్రి వరకు 1.20 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ వరదను కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం వైపు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో కన్నెపల్లి పంపుహౌస్‌లో ఒకటి, మూడు, ఆరో మోటార్లు నిరంతరం నడుపనున్నారు. కాగా, వరద ప్రవాహం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అన్నారం, మేడిగడ్డ వంతెనలపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీఐ రంజిత్‌కుమార్ తెలిపారు. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద డెలివరీ సిస్టంలో ఎత్తిపోస్తున్న నీరు ప్రాజెక్టు వద్ద భద్రత పెంపు: ఎస్పీ కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరుగుతుండటంతో భద్రతను పెంచారు. శనివారం ఎస్పీ ఆర్.భాస్కరన్ అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు, కన్నెపల్లి పంపుహౌస్, గ్రావిటీ కాల్వలను పరిశీలించారు. అన్నారం బ్యారేజీ, అండర్ టన్నెల్, కన్నెపల్లి, గ్రావిటీ కాల్వ వెంట భద్రతను కట్టుదిట్టం చేశారు. మత్స్యకారులను చేపలు పట్టకుండా నిలువరించాలని, ఓడరేవుల వద్ద నాటు పడవలు నడపొద్దని ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ, అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో సందర్శకులను అనుమతించవద్దని ఎస్పీ చెప్పినట్లు సీఐ వివరించారు. పెరుగుతున్నగోదావరి నీటి మట్టం ఏటూరునాగారం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరుగులు పెడుతోంది. ప్రాణహిత, పెనుగంగా, ఇంద్రావతిలోని వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి క్రమంగా పెరుగుతూ వస్తోంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల వద్ద శుక్రవారం సాయంత్రం గోదావరి నీటి మట్టం 72 మీటర్లకు చేరింది. శనివారం 75 మీటర్లకు చేరడంతో ఇన్‌టేక్ వెల్ వద్ద నీరు చేరింది. దేవాదుల పంప్‌హౌస్ వద్ద సముద్ర మట్టానికి 72 మీటర్లు ఉంటేనే మోటార్ల పంపింగ్‌కు నీరు అందుతుంది. అయితే 75 మీటర్లకు చేరడంతో ఇంజనీరింగ్ అధికారులు రెండో దశలోని ఒక మోటార్‌ను ప్రారంభించి ఎగువ ప్రాంతాల్లోని రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. అలాగే తుపాకులగూడెం బ్యారేజ్ వద్ద శనివారం 73 మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉప నదులు ఉప్పొంగి గోదారమ్మ ఒడిలో కలుస్తున్నాయి. -
వరదొస్తే పంపులన్నీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం ప్రస్తుతానికి ఒక్క మోటార్‌తో మొదలవగా మిగతా పంపుల ప్రారంభం ప్రాణహిత, గోదావరిలో పూర్తిస్థాయి వరదలు పుంజుకున్నాకే జరగనుంది. జూలై నుంచి ప్రవాహాలు పుంజుకొనే తీరుకు అనుగుణంగా ఒక్కో మోటార్‌ను ఆన్‌చేస్తూ నీటిని తీసుకునేలా ఇప్పటికే అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఏటా జూన్ నుంచి ప్రాణహితలో ప్రవాహాలు మొదలవుతాయి. అయితే ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతంలో పెద్దగా వర్షాలు కురవలేదు. దీంతో ఈ ఏడాది 1,471 క్యూసెక్కులకు మించి ప్రాణహితలో ప్రవాహాలు లేవు. ఈ నెల 17 నుంచి 20 వరకు ప్రాణహితలో 1,385 క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగగా 21న 1,420 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగినట్లు టెక్రా గేజ్ స్టేషన్ రికార్డులు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి గరిష్టంగా 50 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ ఈ ఏడాది 2 వేల క్యూసెక్కులు కూడా దాటలేదు. ఈ నేపథ్యంలోనే గోదావరి నీటి ఎత్తిపోతల ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం గోదావరి నదిపై క్రాస్ బండ్ నిర్మించి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. ఈ నిల్వతో వచ్చిన నీటితోనే ఒక్క మోటార్‌ను ఆన్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుతం గోదావరిలో 94 మీటర్ల నీటి ప్రవాహం కొనసాగుతుండగా 100 మీటర్ల లెవల్ నీటి ప్రవాహం ఉంటేనే రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం సాధ్యం కానుంది. అయితే ప్రస్తుతం రుతుపవనాలు పుంజుకోవడంతో వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో జూలై నుంచి ప్రవాహం పుంజుకునే అవకాశం ఉంది. జూలై రెండో వారానికి 50 వేల మేర ప్రవాహాలు వచ్చినా ఒక్కో మోటార్‌ను ప్రారంభిస్తూ నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి. -
ఆదిలాబాద్ జిల్లాలో పొంగుతున్న వాగులు
ఆదిలాబాద్: రెండు రోజులుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. పెన్‌గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో సైతం భారీగా వరదనీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పుడుతోంది. కొమురం భీం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. -
మేడిగడ్డ.. మేడి పండేనా?
* కాళేశ్వరం దిగువ నుంచి నీటి మళ్లింపు ఆర్థిక భారమంటున్న నిపుణులు * ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎల్లంపల్లి వరకు ఖర్చు రూ. 14 వేల కోట్లు * విద్యుత్ అవసరాలు 270 మెగావాట్ల నుంచి 540 మెగావాట్లకు పెరగొచ్చు * ప్రత్యామ్నాయ డిజైన్లలో ఖర్చు రూ. 7 వేల కోట్ల నుంచి రూ. 9 వేల కోట్లే * ప్రభుత్వానికి 2 ప్రత్యామ్నాయాలు సూచించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 16 లక్షల ఎకరాల సాగు అవసరాలను పరిగణనలోకి తీసుకొని చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల పథకంపై మళ్లీ ప్రతిష్టంభన మొదలైంది. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్లుగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ పర్యావరణపరంగా, ఆర్థికంగా, నిర్వహణపరంగా ఏమాత్రం మంచిది కాదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తేల్చిచెబుతుండటం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. ప్రభుత్వం చెబుతున్న వాదనకు, వాస్తవాలకు మధ్య పెద్ద తేడాలను చూపిస్తూ మేడిగడ్డ ప్రతిపాదన మేడిపండులాంటిదేనని, దానికి ప్రత్యామ్నాయంగా చూపుతున్న రెండు ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వంపై పడే భారాన్ని, ఎదురయ్యే అడ్డంకులను అధిగమించవచ్చని చెబుతోంది. ప్రభుత్వ దూరదృష్టి, అవగాహన లోపాల కారణంగా ఈ ప్రాజెక్టు అభాసుపాలు కాకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలన్న వాదన వినిపిస్తోంది. ప్రాజెక్టు అంశం రాజకీయ రంగు పులుముకుంటున్న వేళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ చూపిన ప్రత్యామ్నాయాలు తెరపైకి రావడంతో వాటిని ప్రభుత్వం ఎంతమేర పరిగణనలోకి తీసుకుంటుందనే అంశం చర్చనీయంగా మారింది. మేడిగడ్డ ప్రతిపాదనకు ఎన్నో అడ్డంకులు తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తెచ్చి దానిపై సర్వే చేయిస్తుండటం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 160 టీఎంసీల నీటిని మళ్లించి 115 కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్లంపల్లికి తరలించేందుకు 80 మీటర్ల లిఫ్టు అవసరం. దీనికి 540 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా, పంప్‌హౌజ్‌ల నిర్మాణం, కాల్వల తవ్వకానికి మొత్తంగా రూ. 10 వేల కోట్ల ఖర్చు కానుంది. దీంతోపాటే తుమ్మిడిహెట్టి నుంచి ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాలకు నీరివ్వాలంటే అదనంగా మరో రూ. 4 వేల కోట్లు ఖర్చు చేయాలి. మొత్తంగా ప్రాజెక్టుకు రూ. 14 వేల కోట్లు ఖర్చు కానుంది. అయితే ఈ ప్రతిపాదనలో 500 మీటర్ల వెడల్పుతో కాల్వల నిర్మాణం చేస్తే కాల్వ మహదేవ్పూర్ కోల్ మైన్స్ గుండా వెళ్లడంతోపాటు తాడిచెర్ల మైన్స్‌కు అడ్డంకిగా మారుతుంది. మంథని, కమాన్‌పూర్, రామగుండం మండలాల్లో ఇప్పటికే ఓపెన్‌కాస్ట్ మైనింగ్ కారణంగా తరలించిన గ్రామాలకు ఇది ఇబ్బందికరం. మేడిగడ్డ లోయర్ గోదావరి బేసిన్లో జీ-10లో ఉన్న కారణంగా నీటి వినియోగంపై తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య అంతరాష్ట్ర ఒప్పందాలు తప్పనిసరి అవుతాయి. మొదటి ప్రతిపాదన..: మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లే 148 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి నుంచి నీటిని తీసుకోవడం. 2009లో సీడబ్ల్యూ సీ లెక్కల మేరకు అక్కడ 236.50 టీఎంసీల నీటి లభ్యత ఉంది. దాంట్లో 160 టీఎంసీల నీటిని మళ్లించేందుకు తుమ్మిడిహెట్టి వద్ద 10 మీటర్ల ఎత్తులో లిఫ్టు ఏర్పాటు చేసి నీటిని తరలించవచ్చు. దీనికి 68 మెగావాట్ల విద్యుత్ అవసరం. 85 కిలోమీటర్ల అనంతరం ప్రధాన కెనాల్‌పై 30 మీటర్ల ఎత్తులో లిఫ్టును ఏర్పాటు చేసి ఎల్లంపల్లికి నీటిని తరలించాలి. దీనికి మరో 202 మెగావాట్ల విద్యుత్ అవసరం. 270 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా దీనికి రూ. 500 కోట్లు ఖర్చవుతుంది. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు ఇతర పనుల ఖర్చు రూ. 6,500 కోట్లు కానుండగా మొత్తంగా రూ.7 వేల కోట్ల మేర ఖర్చవుతుంది. ప్రభుత్వ ప్రతిపాదనతో అయ్యే వ్యయంతో పోలిస్తే రూ. 7 వేల కోట్ల భారం తగ్గుతుంది. విద్యుత్ వినియోగం తగ్గడంతో ఏటా రూ. 292 కోట్ల మేర మిగులు సాధ్యవుతుంది. రెండో ప్రతిపాదన..: ప్రభుత్వం చెబుతున్న మేరకు సీడబ్ల్యూసీ 2015లో రాసిన లేఖలో తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యతే తేల్చిందని అంటున్నారు. సీడబ్ల్యూసీ లెక్కల మేరకు 75 శాతం డిపెండబులిటీ లెక్కన 120 టీఎంసీల నీటిని అక్కడి నుంచి తీసుకొని వేమనిపల్లి మండలం, వెంచెపల్లి గ్రామం వద్ద నుంచి మరో 40 టీఎంసీల నీరు తీసుకునేలా రెండో ప్రతిపాదన తయారు చేశారు. ఇలా నీటిని తీసుకోవాలంటే మూడు చోట్ల లిఫ్టుల నిర్మాణానికి 300 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా మొత్తంగా రూ. 9 వేల కోట్ల మేర ఖర్చయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రతిపాదనలోని మొత్తం లెక్కతో పోలిస్తే ఈ ప్రతిపాదనతోనూ రూ. 5 వేల కోట్ల మేర ఖర్చు తగ్గుతుంది. విద్యుత్ అవసరాలు 240 మెగావాట్ల మేర తగ్గుతుండటంతో ఏటా పడే భారం రూ. 260 కోట్ల మేర ప్రభుత్వంపై తగ్గుతుంది. -
ప్రాణహిత కోసం ఉద్యమం
చేవెళ్ల-ప్రాణహిత రీ డిజైన్‌పై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం రేపు శంకర్‌పల్లిలో పనుల పరిశీలన కాలయాపనకే ‘పాలమూరు’ను తెరమీదకు తెచ్చారని ఆరోపణ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘చేవెళ్ల- ప్రాణహిత’పై రాజకీయ పోరాటం మొదలైంది. నై పెట్టిన జిల్లా భూములను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఈ బహుళార్థసాధక ప్రాజెక్టు నుంచి జిల్లాను తొలగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టింది. ఈ నెల 29న ప్రాజెక్టు పనులను పరిశీలించే ందుకు ఆ పార్టీ నేతాగణం శంకర్‌పల్లికి బయలుదేరనుంది. జిల్లాలో దాదాపు 2.46 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలనే లక్ష్యంతో శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో అదిలాబాద్ జిల్లా ప్రాణహిత నుంచి గోదావరి జలాలను జిల్లాకు తరలించాలని గత ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందులో భాగంగా 23, 24, 25, 26 ప్యాకేజీల్లో సొరంగం నిర్మాణం, భూసేకరణ పనులు కూడా చేపట్టారు. త్వరలోనే జాతీయ హోదా లభిస్తుందని, అప్పటి నుంచి పనులు ఊపందుకుంటాయని భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రకటన రైతాంగం ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ప్రాజెక్టును రీడిజైన్ చేస్తున్నామని ప్రాణహిత స్థానే కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని తీసుకురానున్నామని, అదే సమయంలో ఈ జలాలను మెదక్ వరకే పరిమితం చేయనున్నట్లు తేల్చిచెప్పారు. దీంతో ఈ ప్రాజెక్టుపై గంపెడాశలు పెట్టుకున్న పశ్చిమ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటికే శంకర్పల్లి మండలం మహాలింగాపురం, సిద్దలూరు, మోమిన్‌పేట తదితర ప్రాంతాల్లో ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.200 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంతాలను మినహాయించడంతో ఈ నిధులను బూడిదలో పోసిన పన్నీరుగా భావించాల్సివస్తోంది. కృష్ణా జలాలే శరణ్యం! ప్రాణహిత ప్రాజెక్టుకు మంగళంపాడిన ప్రభుత్వం.. కృష్ణా జలాలతో జిల్లాలో హరిత సిరులు పండించాలని నిర్ణయించింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జిల్లాలో 1.70 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవాలని ప్రణాళిక రూపొందించింది. దీనికి అనుగుణంగా ప్రాజెక్టును డిజైన్ చేయడమేకాకుండా.. ఈ పనులకు సీఎం కేసీఆర్ గత నెలలో శంకుస్థాపన కూడా చేశారు. ఒక ప్రాజెక్టులో చూపిన ఆయకట్టును మరో ప్రాజెక్టులో ప్రతిపాదించడం కేంద్ర జలసంఘం (సీడబ్లుసీ) మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొంటూ ప్రాణహిత నుంచి జిల్లాను తొలగించారు. అంతేకాకుండా కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న జిల్లాకు గోదావరి నీటిని తీసుకురావాలనే ఉద్దేశం మంచిది కాదనే వాదనను తెరమీదకు తెచ్చిన ఇంజినీరింగ్ నిపుణులు ప్రాజెక్టు నుంచి మన జిల్లాను ఎత్తివేశారు. దీంతో స్వర్గీయ వైఎస్సార్ అంకురార్పణ చేసిన ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత -చేవెళ్ల సుజల స్రవంతి’ ప్రాజెక్టుకు టీఆర్ఎస్ ప్రభుత్వం గండికొట్టినట్లయింది. ఇప్పటివరకు ఎలాంటి అనుమతుల్లేని పాలమూరు ప్రాజెక్టులో జిల్లాను చేర్చడం ద్వారా కృష్ణమ్మ పరవళ్లకు ఎన్నాళ్లు పడుతుందో కాలమే సమాధానం చెపుతుంది. -
ప్రాణహిత’పై దిద్దుబాటు చర్యలు
ప్రాజెక్టుపై వివాదాల నేపథ్యంలో సలహాదారు విద్యాసాగర్‌రావు వివరణ స్వచ్ఛ ఇరిగేషన్ నినాదంతో ముందుకెళ్తామని వెల్లడి హైదరాబాద్: ‘స్వఛ్చ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ మాదిరే సాగునీటి రంగంలోనూ స్వచ్ఛ ఇరిగేషన్ నినాదంతో ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ (దిద్దుబాటు చర్యలు) చేపట్టాం. అందులో భాగంగానే గత ప్రభుత్వాలు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో చేసిన తప్పిదాలను సరిచేస్తూ ఆయకట్టు, నీటివినియోగం లక్ష్యాలు దెబ్బతినకుండా ప్రత్యామ్నాయాలు తయారు చేస్తున్నాం. పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర సహా స్వరాష్ట్రంలోనూ ముంపు వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రాజెక్టును త్వర గా పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నాం’ అని ప్రభుత్వ సాగునీటిరంగ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై వస్తున్న కథనాలపై సోమవారం సచివాలయంలో వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు డిజైన్ మార్పుపై మాట్లాడుతున్న విపక్షాలు, స్వయంప్రకటిత మేధావులు తుమ్మిడిహెట్టి ఎత్తుతో జరుగుతున్న ముంపుపై మహారాష్ట్రను ఒప్పించగలరా? అని ప్రశ్నించారు. వ్యాప్కోస్ ఇచ్చే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలన్నీ సమూలంగా నపరిశీలించాకే ప్రాజెక్టుపై ప్రభుత్వం అంతిమ నిర్ణయం తీసుకుంటుందని విద్యాసాగర్‌రావు చెప్పారు. నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు... ప్రాణహిత ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ, సీడబ్ల్యూసీ అనుమతులు తీసుకోకుండానే నాటి ప్రభుత్వాలు అనుమతులిచ్చి ప్రాజెక్టు పనులను ప్రారంభించాయని విద్యాసాగర్‌రావు విమర్శించారు. రూ. 38,500 కోట్ల ప్రాజెక్టును రాష్ట్రం చేపట్టాలంటే అనుమతులు, కేంద్రసాయం తీసుకోవాలని తెలిసినా దాన్ని విస్మరించి జాతీయహోదా అంటూ అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రజలను నమ్మించారన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీతో మహారాష్ట్రలో ముంపును పట్టించుకోకుండా, ఆ రాష్ట్ర అభ్యంతరాలను వినిపించుకోకుండా పనులు చేపట్టారన్నారు. లక్ష్యం దెబ్బతినకుండా ప్రత్యామ్నాయం... మహారాష్ట్ర అభ్యతంరాల నేపథ్యంలోనే ప్రస్తుతం కాళేశ్వరం దిగువన మేటిగడ్డ వద్ద నీటి మళ్లింపుకు పూనుకున్నామని విద్యాసాగర్‌రావు తెలిపారు. తుమ్మిడిహెట్టితో పోలిస్తే కాళేశ్వరం వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉందన్నారు. 160 టీఎంసీల నీటిని 90 రోజుల్లో మళ్లించి వాటిని నిల్వ చేసుకునేందుకు బ్యారేజీ లేదన్న సీడబ్ల్యూసీ సూచన మేరకే మెదక్ జిల్లాలోని పాములపర్తి, తడ్కపల్లి బ్యారేజీ సామర్ధ్యం పెంచామన్నారు. ఆదిలాబాద్ ఆయకట్టు ప్రయోజనాలు దెబ్బతినకుండా తుమ్మిడిహెట్టి లేదా, దిగువన మరో బ్యారేజీ నిర్మించి జిల్లాకు నీరందిస్తామని తెలిపారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లింపల్లికి నీటి తరలింపు ఖర్చు కన్నా కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపు ఖర్చు తక్కువని విద్యాసాగర్‌రావు వివరించారు. -
మా నీళ్లు మాకే కావాలి
సందర్భం ప్రాణహితను కాళేశ్వరంలో నిర్మించినా... ఎస్.పీ.ఎం(సిర్పూర్ కాగజ్‌నగర్)ను మూసేసినా... ఓపెన్‌కాస్ట్‌ల పేరుతో గ్రామాలను మాయం చేసినా... అవి పుట్టిన పేర్లే అస్తిత్వం కోల్పోతాయి. ఇది నవ తెలంగాణలో జరగడానికి వీల్లేదు. ఇందుకేనా తెలంగాణను తెచ్చుకున్నది? తెలంగాణలో పలు జిల్లాలకు ఎన్నో వరాలు కురిపిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారు. శతాబ్దాలుగా.. వెనుకబడిన ఆదివాసీలకు నిల యమైన మా జిల్లాకు కొత్తవి రావాల్సినవి రాకపోగా, ఉన్న వే పోతాయంటూ పిడుగులాం టి వార్తను ప్రజలనెత్తి మీద వేస్తున్నారు. దశాబ్దాల తరువాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభు త్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో పనులు చేపట్టి న తర్వాత ఈ జిల్లాలో ఇప్పటికే రూ.5వేల కోట్లను ఖర్చు చేశారు, కొద్ది రోజుల లోపలే జాతీయ హోదా వస్తుందని ఎంపీ కవిత ప్రకటన చేసిన విషయం తెలిసిం దే. కానీ మా జిల్లాలోని ప్రాణహిత నీళ్లను మాకు ఇవ్వ కుండా చేవెళ్ల వరకు తరలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటించడం ఆదిలాబాద్ ప్రజలకు పిడుగులాంటి వార్తే అవుతుంది. తెలంగాణలో అధికారపార్టీకి ఏ జిల్లాలోనూ లేనంత ఎక్కువగా ఎమ్మెల్యే, ఎంపీలను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చింది. ఇక్కడి ప్రజలు ఆంధ్రప్రాంతం నుండి వచ్చిన వ్యక్తిని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. జిల్లాలోని చెన్నూర్, సిర్పూర్, పెద్దపల్లి నియోజకవర్గాల ప్రజలు స్థానికేతరులను దాదాపు 7 నుండి 8 సార్లు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కూడా గెలిపించారు. కానీ నైజాం దగ్గర నుండి నిన్నటి దాకా పాలకులుగా ఉన్నవారు వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతానికి నీళ్లు మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ కశ్మీరం అని వర్ణించిన కేసీఆర్, లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం తుమ్మిడిహెట్టి నుండి ప్రాణహిత నది ద్వారా వచ్చేటటువంటి ఈ నీళ్లను ఇతర జిల్లాలకు పందేరం పెట్టి, ఆదిలాబాద్ పొట్ట కొట్టడానికి పథకాలు సిద్ధం చేయడం న్యాయమా? ఇతర జిల్లాల్లోని లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి ఆ తర్వాతే ఈ జిల్లాకు దక్కా ల్సినవి ఇస్తామని చెప్పడం ఎవరి ప్రయోజనాల కోసమో ప్రభుత్వం వారు సెలవివ్వాలి. గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మెదక్‌కు 5 లక్షల ఎకరాలు, నిజామాబాద్‌కు 3 లక్షల ఎకరాలు, రంగా రెడ్డికి 2 లక్షల ఎకరాలు, కరీంనగర్‌కు లక్షా 71 వేల ఎక రాలు, నల్గగొండకు 2లక్షల 29 వేల ఎకరాలకు నీటి కేటాయింపు చేస్తూ ఆదిలాబాద్‌కు మాత్రం లక్షా 56 వేల ఎకరాలకు మాత్రమే నీటి కేటాయింపులు చేసింది. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రకటించిన మేరకు, ఈ జిల్లాలోని లక్షా 50 వేల ఎకరాలకు కూడా ఇప్పుడు నీరు దక్కకుండా పోయే ప్రమాదం పొంచుకుని ఉంది. ఏ న్యాయం ప్రకారం చూసినా సరే.. ఏ జిల్లాలో ఉన్న టువంటి నీళ్లు ముందు ఈ జిల్లాకే రావాలి. రాజ్యాంగం ప్రకారమైనా, సహజ న్యాయసూత్రాల ప్రకారమైనా ఇదే సరైనది. ఈ విషయమై గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయం ఇక జరగదని ఆశిస్తున్న తరుణంలో మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఆదిలాబాద్ జిల్లాకు తీరని నష్టం జరుగుతూ ఉన్నది. ఓ వైపు నిరుద్యోగం, మరోవైపు పరిశ్రమల మూసివేత, మరోవైపు మా జిల్లా చుట్టూ మూడువైపులా నీళ్లు, ఒక వైపు గోదావరి మరోవైపు ప్రాణహిత, మరో వైపు ఆదిలాబాద్ నుండి వస్తున్న పెన్‌గంగా, వాగులకు, వంకలకు కొదువే లేదు. కట్టక కట్టక కట్టిన చిన్న చిన్న ప్రాజెక్టులు, ఆఖరుకు ‘కొమురం భీం’ పేరుతో కట్టిన ప్రాజెకులోకూడా నిండుగా నీళ్లు ఉన్నాయి. కానీ కాలు వలు పూర్తి కాక అవి ప్రజలకు ఉపయోగపడటం లేదు. అన్ని విధాలా అట్టడుగున ఉన్న ఆదిలాబాద్ జిల్లా మీ ద్వారానైనా అభివృద్ధి చెందుతుందని ఆశించినాం. తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుతో కాసిన్ని నీళ్లు లభిస్తాయనుకుంటే అవి కూడా దక్కకుండా ఆ ప్రాజెక్టును కాళేశ్వరం దగ్గర నిర్మిస్తామంటున్నారు. ఇది ఇతర జిల్లాలకు న్యాయం, మా జిల్లాకు అన్యాయం కాక మరేమవుతుందని మేము భావించాలో చెప్పండి. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజలకు న్యాయం చేయాలి కానీ, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేయ వద్దని కోరుతున్నాం. ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానికేతరులే పదవుల్లో ఉన్నారు. ప్రజాప్రతినిధులు అయిన మిమ్మల్ని మేము ప్రశ్నించేది ఒక్కటే. మీరు ఈ ప్రాంతానికి న్యాయం చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటారా, లేక ఈ ప్రాంత ప్రజల ను ప్రాణహిత నదిలో, ఎస్పీఎంలో, ఓపెన్‌కాస్ట్‌ల బొం దలగడ్డలో సమాధి చేస్తారా? కాబట్టి తెలంగాణ ముఖ్య మంత్రి తక్షణమే కల్పించుకొని జాతీయహోదాకు సమీ పంగా వచ్చిన ప్రాణహిత వద్ద వీలైన పద్ధతుల్లో ప్రాజె క్టును నిర్మించి 1,56,000 ఎకరాలకు గానూ మాకు హామీ ఇచ్చిన, మాకు హక్కు ఉన్న నీళ్లను మాకు ఇచ్చి ఎక్కడికైనా నీళ్లను తీసుకెళ్లండి. అంతేకాని మిమ్ములను నమ్ముకున్నటువంటి ఈ ప్రజలకు అన్యాయం చెయ్య వద్దని ఈ సందర్భంగా కోరుతున్నాం. పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పటికే వెనుకబడిన ఈ జిల్లాను మరింత వెనకకు నెట్టవద్దని, అదిలాబాద్ ప్రజలు ఆత్మహత్యలు చేసుకునేలా చెయ్యవద్దని మిమ్మల్ని మరీమరీ కోరుతూ ఉన్నాం. ప్రాణహితపై మరోసారి పునరాలోచన చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. - వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక, మొబైల్ : 9849588825 -
ప్రాణహిత ప్రాజెక్టు తరలింపుతో నయా నీటి దోపిడీ!
సందర్భం మనం నినదించిన తెలంగాణ గుండెకాయ నినాదాలు నేడు ఏమైనాయి? ప్రాణహిత నీళ్లు, ప్రాణహిత నది పుట్టిగిట్టిన స్థానిక జిల్లాకే చుక్క నీరు ఇవ్వకుండా కాళేశ్వరానికి బ్యారేజీ మార్చి, ప్రపంచంలోనే భారీ నీటి దోపిడీ చేసే ఈ తెలంగాణ పాలననేనా మనం కోరుకున్నది? ఇదా బంగారు తెలంగాణ? కానే కాదు. ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండజిల్లా లకు సాగు, తాగునీరందించ డంతో పాటు, జంటనగరాల కు తాగునీరు, పరిశ్రమలకు నీరందించే ఉద్దేశంతో 2008 లో నిర్మాణం ప్రారంభమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మన జిల్లా నుంచి తరలించి కాళేశ్వరంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసు కొన్నది. మన జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరంలో నిర్మించి అక్కడి నుంచి కరీంనగర్, వరంగల్ జిల్లాల మీదుగా మిగతా తెలంగాణ జిల్లాలకు నీటి మళ్లింపు జరిపే పద్ధ తిలో ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయాలని ముఖ్య మంత్రి కె.సి.ఆర్. అధికారులకు ఆదేశాలిచ్చారని అన్ని పత్రికలలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే అత్యంత వెనుకబడిన మన ఆదిలాబాద్ జిల్లాకు ప్రాణ హిత నీరు ఒక చుక్క కూడా దక్కదు. జిల్లాలోని రైతులు, ఇతర వర్గాల ప్రజలతోపాటు జిల్లా మొత్తానికి తీరని నష్టం జరుగుతోంది. దివంగత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సమగ్ర పరిశీ లన చేశాకే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు బ్యారేజీని కౌటాల మండలం తుమ్మిడి హెట్టి గ్రామం వద్ద నిర్మించాలని నిర్ణయించి 2008లో శంకుస్థాపన చేసింది. నేడు అలా కాకుండా దాన్ని తలకిందులు చేసి, కాళేశ్వరం వద్దకు ప్రాజెక్టు నిర్మాణాన్ని మార్చాలని నూతన తెలంగాణ రాష్ట్ర సి.ఎం. కె.సి.ఆర్. నిర్ణయించడం, ‘ప్రాణహిత ఎత్తి పోతలపై వైఎస్ఆర్ హయాంలో సర్వే చేసిన వ్యాప్కో’ అనే సంస్థనే మళ్లీ సర్వేకు ఆదేశించడం క్షణాల్లో జరిగి పోయాయి. ప్రాణహిత నది పుట్టిన ఆదిలాబాద్ జిల్లాను ఎండబెట్టి, ఇక్కడి ప్రజలకు నీరందకుండా చేసేవిధంగా ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులకు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ కడితే మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది కాబట్టి కాళేశ్వరా నికి మార్చుతున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇది పూర్తిగా అసంబద్ధ వాదన. తుమ్మిడి హెట్టి (కౌటా ల)లోనే మహారాష్ట్ర ప్రాంతం ఉన్నట్లు, కాళేశ్వరంలో ఒక వైపు అసలు మహారాష్ట్రతో సంబంధమూ, పని లేనట్లు ఎందుకు ఆదిలాబాద్ జిల్లానూ, తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు? తుమ్మిడి హెట్టి వద్ద తృణమంత ఖర్చుతో పోయేది. కాళేశ్వరం వద్ద వందల వేల కోట్లయ్యే కుట్రల్లో ఆంతర్యమేమిటి? తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత నది లోయగా ఉం డి, ‘వెడల్పు అతి తక్కువగా ఉంటే, కాళేశ్వరం ప్రాంత గోదావరి నది అతి వెడల్పుగాను బల్లపరుపుగా ఉంటుం ది. అతి వెడల్పున్న చోట అతి పొడవాటి స్పిల్‌వే (గేట్లు బ్రిడ్జ్) నిర్మించాలి (బల్లపరుపుగా ఉన్న చోట నీరు ఎక్కు వగా నిలవాలంటే అతి ఎత్తుగా ప్రాజెక్టు నిర్మించవలసి ఉంటుంది. అతి ఎత్తుగా నిర్మించవలసి వచ్చినప్పుడు రెండువైపులా బల్లపరుపు భూమిలో నీరు చాలా విశాల మైన భూవిస్తీర్ణంలో అతి తక్కువ నీరు నిలిచి ఉంటుంది. దీన్ని బట్టి తుమ్మిడి హెట్టికంటే మహారాష్ట్ర ముంపు, భూమి బూచీ కాళేశ్వరం వద్దే అధికంగా ఉంటుందని అర్థమవుతోంది. తుమ్మిడి హెట్టి ఖర్చు రీత్యా, నీరు నిలిచే సామర్థ్యం రీత్యా భద్రత రీత్యా భూవైశాల్యం రీత్యా అన్ని విధాలా అత్యంత అనువైంది. కాళేశ్వరం ఖర్చు రీత్యా, నీటి సామ ర్థ్యం రీత్యా, ముంపురీత్యా, పర్యావరణ అనుమతుల రీత్యా, గోదావరి నది వెడల్పు రీత్యా, ఆధ్యాత్మక చారి త్రక కేంద్రం. కాళేశ్వరంకు తలెత్తే ప్రమాద రీత్యా అక్కడ బ్యారేజీ నిర్మాణం ఎంత మాత్రం సరైనది కాదు. ప్రాణహిత కాలువ తుమ్మిడి హెట్టి నుంచి చేవెళ్ల వరకు 1,050 కి.మీ. దూరంలో మరెక్కడా ఇన్ని కి.మీ. గ్రావిటీలో ఎత్తిపోతలు లేకుండా ప్రవహించదు. కాళేశ్వ రం వద్ద 50 మీ. పైకి నీరు ఎత్తిపోయాలి. 8.5 మెగావాట్ల చొప్పున 425 మె.వా. కరెంటు అదనంగా అవసరం అవుతుంది. నేటి ఖర్చు కంటే వేల కోట్ల ఖర్చు పెరుగు తుంది. కాళేశ్వరానికి బ్యారేజీ మార్చడం ఆదిలాబాద్ ప్రజలను సమాధి చేయడమే. 5 వేల కోట్లతో నిర్మించిన కాలువలు, భూమి, ప్రజాధనం బూడిదపాలే. ప్రకృతికి విరుద్ధంగా, ఆంధ్రపాలకులంటున్న వారికంటే ఘోరం గా, నది పుట్టిన జిల్లాను నట్టేటముంచే నీటిదోపిడీ అన్యా యాన్ని ఎదిరించాలి. ‘‘మా నీళ్లు మాకు, మా వనరులు మాకు, మా ఖని జసంపద మాకు, మా ఉద్యోగాలు మాకు, స్థానిక వన రులు ముందు స్థానిక ప్రజలకు’’. ఇదీ తెలంగాణ నినా దం. ముందు స్థానికులకు ఇచ్చాక, వెనుకబాటుతనం ప్రాతిపదికగా ఏ వనరులైనా కేటాయించాలి. అధికారం, రాజకీయ బలం ప్రాతిపదికగా కాదు? మనం నినదిం చిన తెలంగాణ గుండెకాయ నినాదాలు నేడు ఏమై నాయి? ఎందరో అమరులై, సమస్త జనులు సంఘ ర్షించిన తెలంగాణలో నేడు జరుగుతున్నదేమిటి? మనం పోరాడిన ఆకాంక్షలు తెలంగాణ పునర్నిర్మాణంలో అమ లవుతున్నాయా? ప్రాణహిత నీళ్లు, ప్రాణహిత నది పుట్టి గిట్టిన స్థానిక జిల్లాకే చుక్క నీరు ఇవ్వకుండా (గిట్టిం చేలా), కాళేశ్వరానికి బ్యారేజీ మార్చి, ప్రపంచంలోనే భారీ నీటి దోపిడీ చేసే ఈ తెలంగాణ పాలననేనా మనం కోరుకున్నది? ఇదా బంగారు తెలంగాణ? కాదు. అత్యం త వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాను ఆదివాసీ-గిరిజను లను, చివరికి అనేక జిల్లాలను సమాధి చేసే తెలంగాణే నేడు సాగుతోందా? మీరు తెలంగాణ కోసం దేనికి సం ఘర్షించారో సింహావలోకనం చేసుకుని, మరెప్పుడూ తప్పుచేయని సామాన్యుల తెలంగాణకై ముందు కెళతారని ఆశించవచ్చా? (వ్యాసకర్త ప్రాణహిత ప్రాజెక్టు రక్షణ వేదిక నాయకులు) మొబైల్: 9701381799 -
'అర్హతలన్నీ ఉంటేనే ప్రాణహితకు జాతీయ హోదా'
న్యూఢిల్లీ: సాంకేతికంగా, ఆర్థికంగా ఆచరణసాధ్యంగా ఉండటంతోపాటు జాతీయ ప్రాజెక్టుకు ఉండాల్సిన అర్హతలను సంతృప్తిపరిస్తేనే ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా వస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు కూడా రావాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్ లాల్ జాట్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. -
'ప్రాణహితకు సీడబ్ల్యూసీ అనుమతి త్వరగా ఇవ్వండి'
- ఉమాభారతికి ఎంపీ వినోద్ లేఖ న్యూఢిల్లీ: బి.ఆర్.అంబేడ్కర్ ప్రాణహిత - చేవెళ్ల సుజల స్రవంతి పథకానికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి త్వరగా వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రి ఉమాభారతిని కోరుతూ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ లేఖ రాశారు. ఆ లేఖను మంగళవారం ఇక్కడ మీడియా కు విడుదల చేశారు. ‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేం దుకు ఇప్పటికే ప్రధాని సానుకూలత వ్యక్తం చేశారు. దీనికి సీడబ్ల్యూసీ అనుమతి కోసం 2010లోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ప్రాజెక్టు సీఈ సమర్పించా రు. ‘రాష్ట్ర నీటి పారుదల శాఖలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఉన్నప్పుడు సీడబ్ల్యూసీ పాత్రను కేవలం అంతర్రాష్ట్ర వివాదాలు, హైడ్రాలజీ వంటి అంశాలకే పరిమితం కావాలని నిబంధనలు చెబుతున్నాయి. సీడబ్ల్యూసీ తన పాత్ర వరకే పరి మితమై అనుమతులు త్వరగా మంజూరు చేసేలా చైర్మన్‌కు ఆదేశాలు జారీచేయగల రు. త్వరగా అనుమతి వస్తే జాతీయ ప్రా జెక్టు హోదా ప్రకటనకు మార్గం సుగమం అవుతుంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
గోదావరి నీటిపై కొత్త పేచీ!
* తెలంగాణలో ప్రాణహిత, కంతనపల్లి ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు * నీటి లభ్యత లేని సమయాల్లో దిగువన పరిస్థితేంటని వాదన * గోదావరి బోర్డుకు నివేదించాలని నిర్ణయం.. 23న బోర్డు భేటీలో చర్చకు వచ్చే అవకాశం * గట్టి సమాధానం చెప్పాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదం ముదిరే అవకాశం కనిపిస్తోంది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో గోదావరి నీటిని ఎగువన తెలంగాణ రాష్ర్టమే పూర్తిగా వాడేసుకుంటే దిగువన ఉన్న తమ రాష్ర్ట ప్రయోజనాలు దెబ్బతింటాయని ఏపీ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ముఖ్యంగా గోదావరిలో నీటి లోటు ఉండే సమయాల్లో లభ్యమయ్యే నీటినంతా ఎగువ రాష్ర్టమే వినియోగిస్తే.. దిగువ రాష్ర్ట అవసరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తోంది. సాధారణంగా ఖరీఫ్ ప్రారంభంలో నీటి లోటు అధికంగా ఉంటుందని, ఆ సమయంలో వచ్చే నీటిని తెలంగాణ ప్రాజెక్టుల నుంచి దిగువకు వదలకపోతే ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆ రాష్ర్ట ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో లోటు సమయాల్లో నీటి కేటాయింపులు ఎలాగన్న దానిపై ముందుగా తేల్చాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డును ఆశ్రయించేందుకు ఏపీ సిద్ధమవుతోంది. ఈ నెల 23న జరిగే గోదావరి బోర్డు సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. గోదావరి నదీ వివాదాల ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం నదిలో నికరంగా ఏటా 1,200 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంటుండగా 900 టీఎంసీల మేర తెలంగాణ, మరో 300 టీఎంసీలను ఏపీ వాడుకునే వెసులుబాటు ఉంది. ఈ మొత్తం నీటిలో ప్రాణహిత-చేవెళ్లకు 160 టీఎంసీల కేటాయింపులు ఉండగా, కంతనపల్లి ప్రాజెక్టుకు మరో 50 టీఎంసీలను కేటాయించారు. ప్రాణహితతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు తెలంగాణ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇక గోదావరి నికర, మిగులు జలాలు వాడుకునేందుకు వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి 22.5 టీఎంసీల నీటి నిల్వకు సంకల్పించారు. దీని ద్వారా తెలంగాణలోని మూడు జిల్లాల పరిధిలో 7.50 లక్షల ఆయకట్టును స్థిరీకరించే అవకాశముంది. అయితే గోదావరి నదీప్రవాహం ప్రాణహిత, కంతనపల్లిని దాటి దిగువన ఏపీ నిర్మిస్తున్న పోలవరానికి రావాల్సి ఉంది. కంతనపల్లికి ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఇంద్రావతిలో 300 టీఎం సీల మేర మిగులు జలాలు ఉండగా అవన్నీ కాళేశ్వరం వద్ద గోదావరిలోనే కలుస్తాయి. ఈ మిగులు జలాలను ఆధారం చేసుకొంటే.. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కంటే ఎక్కువే దక్కుతాయని ఏపీ వాది స్తోంది. ఎగువన ఉన్న తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ గోదావరి బోర్డుకు నివేదించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి గట్టి జవాబివ్వాలని తెలంగాణ నిర్ణయించింది. సీలేరు, శబరిల్లో భారీ ప్రవాహాలు ఉంటాయని, గోదావరిలో లభించే నీటితో పోలిస్తే దిగువనే ఎక్కువ నీరు లభిస్తుందని, ఈ దృష్ట్యా ఏపీకి నష్టమేమీ లేదని తెలంగాణ వాదిస్తోంది. -
ప్రాణహితకు జాతీయ హోదా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరుతో పాటు తెలంగాణలోని దాదాపు సగం జనాభాకు తాగునీరును అందించే ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ‘బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి’ పథకంగా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తన సానుకూలతను వ్యక్తపరిచిన కేంద్ర ప్రభుత్వం... తాజాగా దీనికి సంబంధించి పలు కీలకమైన నివేదికలను వీలైనంత త్వరగా తమకు సమర్పించాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై ఆయా నివేదికల తయారీపై కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వంతో అవసరమైన సంప్రదింపులు, కార్యాచరణలో మునిగి తేలుతున్నారు. తెలంగాణలోని ఏడు కరువు పీడిత జిల్లాలకు నీటిపారుదల సదుపాయాన్ని కల్పించేందుకు 2008లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు మెజారిటీ ప్రజల దాహార్తిని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకూ నిర్మించే ఈ భారీ ప్రాజెక్టు కోసం.. దాదాపు రూ. 40 వేల కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో సార్లు విజ్ఞప్తులు కూడా చేశారు. జాతీయ హోదా పొందితే నిర్మాణ వ్యయంలో 90 శాతాన్ని కేంద్ర ఆర్థిక సహాయ మండలి భరిస్తుంది. ప్రాజెక్టుకు మొత్తం 18 విభాగాల నుంచి అనుమతులు తెచ్చుకుంటేనే కేంద్ర జల వనరుల శాఖ జాతీయ హోదాకు అనుమతిస్తుంది. ఇందులో ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు ఇప్పటికే నీటి పారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలు, సెంట్రల్ ఆసియల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, యంత్ర నిర్మాణ సంప్రదింపు సంస్థ, వ్యవసాయ శాఖ అనుమతులు లభించాయి. ఇక సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ రాష్ట్రంలోనే ఉండటంతో.. బ్యారేజీ కాలువల డిజైన్, గేట్లు, హైడ్రో సివిల్ డిజైన్, కాంక్రీట్ మాసోనరీ డ్యామ్ డిజైన్ వంటి మూడు నాలుగు అంశాల్లో కేంద్రం ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. గిరిజన సలహా మండలి ఆమోదం ప్రాజెక్టులకు సంబంధించి గిరిజన వ్యవహారాల శాఖ అనుమతి అత్యంత ముఖ్యమైనది. అత్యంత సున్నితమైన ఈ అంశానికి ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురయ్యే గిరిజన గ్రామాల ప్రజల ఆమోదం తప్పనిసరి. అక్కడి ప్రజల సమ్మతి తెలుపుతూ రాష్ట్ర గిరిజన సలహా మండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఈ మేరకు ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు సంబంధించి శనివారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గిరిజన సలహా మండలి ఏకగ్రీవంగా సమ్మతి తెలిపింది. మండలి తీర్మాన కాపీని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ద్వారా కేంద్ర గిరిజన శాఖకు సోమ లేదా మంగళవారం పంపనున్నారు. మరో నెల, నెలన్నర రోజుల్లో అన్నీ పూర్తి చేసి కీలక శాఖల అనుమతులను కేంద్ర జల సంఘానికి అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని ప్రభుత్వంలోని కీలక నేత ఒకరు వెల్లడించారు. ఇంకో ఐదు అంశాల్లో అనుమతులొస్తే.. ఐదు కీలకమైన అంశాలపై ఈ ప్రాజెక్టుకు వివిధ శాఖల నుంచి అనుమతులు పొందాలి. ఇందులో హైడ్రాలజీ(లభ్యమయ్యే నీరు), వ్యయ అంచనా, పర్యావరణ, అటవీ, గిరిజన వ్యవహారాలు, నీటి వనరుల శాఖల అనుమతులు అవసరం. హైడ్రాలజీకి సంబంధించి 1941 నుంచి 2003 మధ్య గల నీటి సమాచారాన్ని (వాటర్ డాటా) ఈ నెల 14న అందజేశారు. హైడ్రాలజీ విభాగం పరిశీలనలో ఉన్న ఈ అంశానికి సంబంధించి మరిన్ని సమగ్ర వివరాలను తెలియజేసేందుకు ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ మంగళవారం ఢిల్లీకి వె ళుతున్నారు. కేంద్ర జల సంఘం చైర్మన్ ఏబీ పాండ్యాతో వారు చర్చలు జరుపనున్నారు. ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి.. డీపీఆర్ ప్రకారం రూ.40,300 కోట్లుగా అంచనా వేశారు. ఈ వ్యయంపై కేంద్ర జల సంఘం కొన్ని వివరణలు కోరుతుండగా ఢిల్లీలోనే ఉన్న అధికారులు, సర్వే సంస్థ వ్యాప్కోస్ ప్రతినిధులు ఎప్పటికప్పుడు వివరణ అందజేస్తూ, చర్చలు జరుపుతున్నారు. పర్యావరణ, అటవీ శాఖ పరిధిలో రెండు రకాల అనుమతులు అవసరం ఉండగా... అందులో తొలి దశకు ఇప్పటికే క్లియరెన్స్ దక్కింది. అత్యంత కీలకమైన రెండో దశ అనుమతికి ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి ఉంది. తెలంగాణలో ఈ ప్రక్రియ పూర్తయినా మహారాష్ట్రలో ఇంకా జరగాల్సి ఉంది. ఇంతకుముందే ఒక సారి ఈ విషయమై మహారాష్ట్రతో చర్చలు జరిగాయి. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మరోసారి సంప్రదింపులు జరపాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు నిర్ణయించారు. అటవీ అనుమతుల కోసం ప్రాజెక్టు కింద ఎంత అటవీ భూమి పోతోందో అంత భూమి పరిహారంగా అటవీ శాఖకివ్వాలి. ఇందుకు సంబంధించి మొత్తం 7,673 ఎకరాల భూమి అవసరమని లెక్కతేల్చారు. ప్రస్తుతం సర్వే పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. దీనిని మరో వారం రోజుల్లో పూర్తి చేసి అటవీశాఖ ప్రధాన కార్యదర్శి ద్వారా కేంద్రానికి అందించనున్నారు. ప్రాజెక్టుకు కీలకమైన గిరిజన వ్యవహారాల శాఖ అనుమతి వచ్చేసింది. అయితే దీనిని ఇంకా కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. -
'పవర్లోకి వస్తే ఆ ప్రాజెక్ట్‌లకు జాతీయహోదా'
ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే నన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తొలి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదేనని జైరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జైరాం రమేష్ ఇవాళ ఆదిలాబాద్, శుక్రవారం ఖమ్మం, నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. అంతకు ముందు ఆయన టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఐఎఎస్ అధికారి కొప్పుల రాజు భేటీ అయ్యారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టోలోని అంశాలు, తదితర విషయలపై వారు చర్చిస్తునట్లు సమాచారం -
ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి
భువనగిరి, న్యూస్‌లైన్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించి వెంటనే పూర్తి చేయాలని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువనగిరిలో బుధవారం ఏర్పాటు చేసిన యువగర్జన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో 50 లక్షల ఎకరాల భూమి సాగు నీరు లేక బీడుపడిపోయిందన్నారు. ఇందులో నల్లగొండ జిల్లా కూడా ఉందన్నారు. కేంద్రం పోలవరానికి జాతీయ హోదా కల్పించినట్లుగానే ప్రాణహిత చేవెళ్లకు కూడా ఆ హోదా కల్పించాలని కోరారు. ఆనాటి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముందున్న నల్లగొండ జిల్లా నేటి తెలంగాణ ఉద్యమంలోనూ అగ్రభాగాన ఉందని చెప్పారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని కాంగ్రెస్ నాయకులు జిల్లాలో సంబరాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జిల్లాకు చెందిన రాష్ర్టమంత్రి కుందూరు జానారెడ్డి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని ఆరోపించారు. తెలంగాణ విషయంలో ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు చేసిందేమీ లేదని చెప్పారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి బీజేపీ ఇచ్చిన మద్దతుతోనే రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని గుర్తుచేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయకపోతే బీజేపీ మద్దతు ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. వెయ్యిమంది చంద్రబాబులు, కిరణ్‌బాబులు వచ్చినా తెలంగాణను ఆపలేరన్నారు.అంతకుముందు పీవీ పౌండేషన్ అధినేత పీవీ శ్యాంసుందర్‌రావుకు కిషన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సభ్వత్యం ఇచ్చారు. పడమటి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో బీజేపీ జాతీయ నాయకుడు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు చింతా సాంబమూర్తి, పుష్పలీల, జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, నాయకులు పాశం భాస్కర్, పోతంశెట్టి రవీందర్, గోలి మధుసూదన్‌రెడ్డి, కర్నాటి ధనుంజయ్య, కసిరెడ్డి నర్సింహారెడ్డి, నర్ల నర్సింగరావు, చందా మహేందర్, సుర్వి శ్రీనివాస్, వేముల అశోక్, విజయపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.