
సాక్షి,కొమురంభీంఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ మండలం సోమిని సమీపంలో ప్రాణహిత నదిలో శనివారం(అక్టోబర్ 26) ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి నదిలో స్నానానికి వెళ్లగా ముగ్గురు గల్లంతు కాగా ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు.
గల్లంతైన వారిని బెజ్జూరుకు చెందిన జహార్ హుస్సేన్(24), ఇర్షద్ (20), మోయిసిధ్(22)గా గుర్తించారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment