ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఆదిలాబాద్: రెండు రోజులుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. పెన్గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో సైతం భారీగా వరదనీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పుడుతోంది. కొమురం భీం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.