ప్రాణహిత ప్రాజెక్టు తరలింపుతో నయా నీటి దోపిడీ! | Water exploitation | Sakshi
Sakshi News home page

ప్రాణహిత ప్రాజెక్టు తరలింపుతో నయా నీటి దోపిడీ!

Published Wed, Apr 8 2015 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

నైనాల గోవర్ధన్

నైనాల గోవర్ధన్

సందర్భం
 
 మనం నినదించిన తెలంగాణ గుండెకాయ నినాదాలు నేడు ఏమైనాయి? ప్రాణహిత నీళ్లు, ప్రాణహిత నది పుట్టిగిట్టిన  స్థానిక జిల్లాకే చుక్క నీరు ఇవ్వకుండా కాళేశ్వరానికి బ్యారేజీ మార్చి, ప్రపంచంలోనే భారీ నీటి దోపిడీ చేసే ఈ తెలంగాణ పాలననేనా మనం కోరుకున్నది? ఇదా బంగారు తెలంగాణ? కానే కాదు.
 
  ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండజిల్లా లకు సాగు, తాగునీరందించ డంతో పాటు, జంటనగరాల కు తాగునీరు, పరిశ్రమలకు నీరందించే ఉద్దేశంతో 2008 లో నిర్మాణం ప్రారంభమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మన జిల్లా నుంచి తరలించి కాళేశ్వరంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసు కొన్నది. మన జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరంలో నిర్మించి అక్కడి నుంచి కరీంనగర్, వరంగల్ జిల్లాల మీదుగా మిగతా తెలంగాణ జిల్లాలకు నీటి మళ్లింపు జరిపే పద్ధ తిలో ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయాలని ముఖ్య మంత్రి కె.సి.ఆర్. అధికారులకు ఆదేశాలిచ్చారని అన్ని పత్రికలలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే అత్యంత వెనుకబడిన మన ఆదిలాబాద్ జిల్లాకు ప్రాణ హిత నీరు ఒక చుక్క కూడా దక్కదు. జిల్లాలోని రైతులు, ఇతర వర్గాల ప్రజలతోపాటు జిల్లా మొత్తానికి తీరని నష్టం జరుగుతోంది.

 దివంగత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సమగ్ర పరిశీ లన చేశాకే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు బ్యారేజీని కౌటాల మండలం తుమ్మిడి హెట్టి గ్రామం వద్ద నిర్మించాలని నిర్ణయించి 2008లో శంకుస్థాపన చేసింది. నేడు అలా కాకుండా దాన్ని తలకిందులు చేసి, కాళేశ్వరం వద్దకు ప్రాజెక్టు నిర్మాణాన్ని మార్చాలని నూతన తెలంగాణ రాష్ట్ర సి.ఎం. కె.సి.ఆర్. నిర్ణయించడం, ‘ప్రాణహిత ఎత్తి పోతలపై వైఎస్‌ఆర్ హయాంలో సర్వే చేసిన వ్యాప్కో’ అనే సంస్థనే మళ్లీ సర్వేకు ఆదేశించడం క్షణాల్లో జరిగి పోయాయి. ప్రాణహిత నది పుట్టిన ఆదిలాబాద్ జిల్లాను ఎండబెట్టి, ఇక్కడి ప్రజలకు నీరందకుండా చేసేవిధంగా ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులకు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం శ్రీకారం చుట్టింది.

 తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ కడితే మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది కాబట్టి కాళేశ్వరా నికి మార్చుతున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇది పూర్తిగా అసంబద్ధ వాదన. తుమ్మిడి హెట్టి (కౌటా ల)లోనే మహారాష్ట్ర ప్రాంతం ఉన్నట్లు, కాళేశ్వరంలో ఒక వైపు అసలు మహారాష్ట్రతో సంబంధమూ, పని లేనట్లు ఎందుకు ఆదిలాబాద్ జిల్లానూ, తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు? తుమ్మిడి హెట్టి వద్ద తృణమంత ఖర్చుతో పోయేది. కాళేశ్వరం వద్ద వందల వేల కోట్లయ్యే కుట్రల్లో ఆంతర్యమేమిటి?

 తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత నది లోయగా ఉం డి, ‘వెడల్పు అతి తక్కువగా ఉంటే, కాళేశ్వరం ప్రాంత గోదావరి నది అతి వెడల్పుగాను బల్లపరుపుగా ఉంటుం ది. అతి వెడల్పున్న చోట అతి పొడవాటి స్పిల్‌వే (గేట్లు బ్రిడ్జ్) నిర్మించాలి (బల్లపరుపుగా ఉన్న చోట నీరు ఎక్కు వగా నిలవాలంటే అతి ఎత్తుగా ప్రాజెక్టు నిర్మించవలసి ఉంటుంది. అతి ఎత్తుగా నిర్మించవలసి వచ్చినప్పుడు రెండువైపులా బల్లపరుపు భూమిలో నీరు చాలా విశాల మైన భూవిస్తీర్ణంలో అతి తక్కువ నీరు నిలిచి ఉంటుంది. దీన్ని బట్టి తుమ్మిడి హెట్టికంటే మహారాష్ట్ర ముంపు, భూమి బూచీ కాళేశ్వరం వద్దే అధికంగా ఉంటుందని అర్థమవుతోంది.

 తుమ్మిడి హెట్టి ఖర్చు రీత్యా, నీరు నిలిచే సామర్థ్యం రీత్యా భద్రత రీత్యా భూవైశాల్యం రీత్యా అన్ని విధాలా అత్యంత అనువైంది. కాళేశ్వరం ఖర్చు రీత్యా, నీటి సామ ర్థ్యం రీత్యా, ముంపురీత్యా, పర్యావరణ అనుమతుల రీత్యా, గోదావరి నది వెడల్పు రీత్యా, ఆధ్యాత్మక చారి త్రక కేంద్రం. కాళేశ్వరంకు తలెత్తే ప్రమాద రీత్యా అక్కడ బ్యారేజీ నిర్మాణం ఎంత మాత్రం సరైనది కాదు.

 ప్రాణహిత కాలువ తుమ్మిడి హెట్టి నుంచి చేవెళ్ల వరకు 1,050 కి.మీ. దూరంలో మరెక్కడా ఇన్ని కి.మీ. గ్రావిటీలో ఎత్తిపోతలు లేకుండా ప్రవహించదు. కాళేశ్వ రం వద్ద 50 మీ. పైకి నీరు ఎత్తిపోయాలి. 8.5 మెగావాట్ల చొప్పున 425 మె.వా. కరెంటు అదనంగా అవసరం అవుతుంది. నేటి ఖర్చు కంటే వేల కోట్ల ఖర్చు పెరుగు తుంది. కాళేశ్వరానికి బ్యారేజీ మార్చడం ఆదిలాబాద్ ప్రజలను సమాధి చేయడమే. 5 వేల కోట్లతో నిర్మించిన కాలువలు, భూమి, ప్రజాధనం బూడిదపాలే. ప్రకృతికి విరుద్ధంగా, ఆంధ్రపాలకులంటున్న వారికంటే ఘోరం గా, నది పుట్టిన జిల్లాను నట్టేటముంచే నీటిదోపిడీ అన్యా యాన్ని ఎదిరించాలి.

 ‘‘మా నీళ్లు మాకు, మా వనరులు మాకు, మా ఖని జసంపద మాకు, మా ఉద్యోగాలు మాకు, స్థానిక వన రులు ముందు స్థానిక ప్రజలకు’’. ఇదీ తెలంగాణ నినా దం. ముందు స్థానికులకు ఇచ్చాక, వెనుకబాటుతనం ప్రాతిపదికగా ఏ వనరులైనా కేటాయించాలి. అధికారం, రాజకీయ బలం ప్రాతిపదికగా కాదు? మనం నినదిం చిన తెలంగాణ గుండెకాయ నినాదాలు నేడు ఏమై నాయి? ఎందరో అమరులై, సమస్త జనులు సంఘ ర్షించిన తెలంగాణలో నేడు జరుగుతున్నదేమిటి? మనం పోరాడిన ఆకాంక్షలు తెలంగాణ పునర్నిర్మాణంలో అమ లవుతున్నాయా? ప్రాణహిత నీళ్లు, ప్రాణహిత నది పుట్టి గిట్టిన స్థానిక జిల్లాకే చుక్క నీరు ఇవ్వకుండా (గిట్టిం చేలా), కాళేశ్వరానికి బ్యారేజీ మార్చి, ప్రపంచంలోనే భారీ నీటి దోపిడీ చేసే ఈ తెలంగాణ పాలననేనా మనం కోరుకున్నది? ఇదా బంగారు తెలంగాణ? కాదు. అత్యం త వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాను ఆదివాసీ-గిరిజను లను, చివరికి అనేక జిల్లాలను సమాధి చేసే తెలంగాణే నేడు సాగుతోందా? మీరు తెలంగాణ కోసం దేనికి సం ఘర్షించారో సింహావలోకనం చేసుకుని, మరెప్పుడూ తప్పుచేయని సామాన్యుల తెలంగాణకై ముందు కెళతారని ఆశించవచ్చా?

 (వ్యాసకర్త ప్రాణహిత ప్రాజెక్టు రక్షణ వేదిక నాయకులు)
 మొబైల్: 9701381799

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement