national status
-
‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కోరారు. అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం అధిక నిధులు కేటాయించాలని.. రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) పూర్తి చేసేందుకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నిధుల విడుదల విషయంలో కొన్ని రాష్ట్రాలపట్ల పక్షపాతం చూపరాదని కేంద్రానికి సూచించారు. సీఎస్ఎస్ కింద రాష్ట్రానికి 2023–24కిగాను రూ.4.60 లక్షల కోట్లను విడుదల చేయాల్సి ఉండగా రూ. 6,577 కోట్లు మాత్రమే (1.4 శాతమే) విడుదలయ్యాయని అన్నారు. రాష్ట్ర జనాభా ప్రాతిపాదికన చూసినా ఇది చాలా తక్కువని.. అందువల్ల సీఎస్ఎస్ కేటాయింపులను జనాభా నిష్పత్తి ప్రకారం, నిర్ణీత సమయంలో తెలంగాణకు విడుదల చేయాలని కోరారు. శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన కేంద్ర బడ్జెట్ సన్నాహాక సమావేశం, జీఎస్టీ కౌన్సిల్ భేటీకి భట్టి విక్రమార్క రాష్ట్ర అధికారులతో కలసి హాజరయ్యారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి భేటీ వివరాలు వెల్లడించారు.వెనకబడిన జిల్లాల నిధులు విడుదల కాలేదుఏపీ పునర్విభజన చట్టం–2014 సెక్షన్ 94 (2) కింద తెలంగాణలోని వెనకబడిన జిల్లాలకు రావాల్సిన రూ. 2,250 కోట్లు ఇంకా విడుదల కాలేదని, వాటిని విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించి ఇచ్చిన గ్రాంటును వచ్చే ఐదేళ్లు పొడగించాలని కోరామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది సీఎస్ఎస్ గ్రాంట్ల రూపంలో తెలంగాణ కోసం విడుదలైన రూ. 495.21 కోట్లను కేంద్రం పొరపాటుగా ఏపీకి విడుదల చేసిందని.. ఈ మొత్తాన్ని త్వరగా తెలంగాణకు తిరిగి ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రానికి మరిన్ని నవోదయ పాఠశాలలను కేటాయించాలని.. ప్రధాని సూర్యఘర్ పథకంలో విద్యుత్ సబ్సిడీ, ముఫ్తీ బిజిలీ పథకం కింద రా>ష్ట్ర సబ్సిడీ నిధులను రూటింగ్ చేయడానికి సహకరించాలని కోరినట్లు భట్టి వివరించారు.వీటికి జీఎస్టీ మినహాయించండినిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ నిర్మాణాలకు జీఎస్టీని తొలగించాలని లేదా తగ్గించాలని కోరారు. అలాగే తెలంగాణలో వాడే ఫెర్టిలైజర్‌పై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. బీడీ ఆకులపైనా జీఎస్టీని తగ్గించాలని కోరారు. అదనపు ఆల్కహాల్ (ఈఎన్ఏ)ని జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలన్నారు. అవగాహనలేమి వల్ల ఆలస్యంగా పన్ను చెల్లించిన వారిపై విధించిన పన్ను, జరిమానా, వడ్డీని కొన్ని షరతులకు లోబడి మినహాయించే ప్రతిపాదనపై జరిగిన చర్చలో పాల్గొని మద్దతు తెలిపారు.కొత్తవి పథకాలు ప్రవేశపెట్టండికేంద్ర ప్రాయోజిత పథకా (సీఎస్ఎస్)ల్లో షరతు లు, పరిమితులు విధించకుండా తెలంగాణకు వెసు లుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లు భట్టి చెప్పారు. సీఎస్‌ఎస్‌లను సమీక్షించి అనవసరమైన పథకాలను తొలగించి కొత్త పథకాలను ప్రవేశపెట్టా ల్సిన అవసరం ఉందని సూచించినట్లు చెప్పారు. ఆర్థిక సంఘాల సిఫారసుల ప్రకారం... పన్ను విభ జనలో ఆయా రాష్ట్రాలకు వాటా తగ్గిందన్నారు. కేంద్రం సెస్, సర్‌చార్జీల రూపంలో పన్నులు సేకరి స్తోందని.. ఇందులో రాష్ట్రాల వాటా పొందుపరచక పోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నా రు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రాష్ట్రాలకు నికర రుణపరిమితిని, సీలింగ్‌ని తెలియజేయాల ని.. దీనివల్ల రాష్ట్రాలు అభివృద్ధి కార్యక్రమాలకు తమ వనరులను సమర్థంగా ఖర్చు చేసేలా ప్రణా ళికలు రూపొందించుకోగలుగుతాయని నిర్మలా సీతారామన్‌కు చెప్పామన్నారు. -
‘పాలమూరు’కు జాతీయ హోదా!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయనుంది. ఈ మేరకు శనివారం తుక్కుగూడ జన జాతర సభలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చే 23 ప్రత్యేక హామీలను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. మంత్రి, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ ఖరారు చేసిన ఈ ప్రత్యేక హామీలను సీఎం రేవంత్‌రెడ్డి తుక్కుగూడ సభ వేదికపై ప్రకటించనున్నారు. కాంగ్రెస్ ఇవ్వనున్న ప్రత్యేక హామీలివే..! 1) ఐటీఐఆర్ ఏర్పాటు 2) ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం.. కాజీపేట్ రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌లో ఐఐఎం, హైదరాబాద్–వి జయవాడ హైవేలో ర్యాపిడ్ రైల్వే సిస్టం, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు. 3) భద్రాచలం సమీపంలోని ఏటపాక, గుండాల, పురుషో త్తమ పట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాలు తిరిగి తెలంగాణలో విలీనం. 4) పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా. 5) హైదరాబాద్‌లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం 6) కొత్త విమానాశ్రయాల నిర్మాణం 7) రామగుండం, మణుగూరు రైల్వేలైన్ 8) కొత్తగా నాలుగు సైనిక్ స్కూళ్ల ఏర్పాటు 9) కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పెంపు 10) నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు 11) నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు 12) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఏఎస్ఈఆర్) 13) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ఫారిన్ ట్రేడ్ 14) నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ 15) ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్ఐ) క్యాంపస్ 16) అధునాతన వైద్య ఆరోగ్య పరిశోధనా కేంద్రం 17) కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయింపు 18) ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ యూనిట్ 19) ఐదు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం (హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– నాగ్‌పూర్, హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్–నల్లగొండ–మిర్యాలగూడ, సింగరేణి పారిశ్రామిక కారిడార్) 20) అంతర్జాతీయ స్థాయి కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ 21) మేడారం జాతరకు జాతీయ హోద 22) న్యూ డ్రైపోర్టు ఏర్పాటు 23) హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు -
తగ్గిన ‘జాతీయ’ ప్రభ
ఎన్నికల కుంభమేళాలో దేశవ్యాప్తంగా వేలాది రాజకీయ పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 2,500కు పైగా రాజకీయ పార్టీలున్నాయి. కానీ 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 53 పార్టీలు బరిలో నిలిచాయి. అందులో 14 మాత్రమే జాతీయ పార్టీలు. మిగతావి రాష్ట్ర పార్టీలు. దేశవ్యాప్తంగా కోట్లాది ఓటర్లను ఆకర్షించి అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీలుగా ఖ్యాతికెక్కిన జాతీయ పార్టీలు నెమ్మదిగా ప్రభ కోల్పోతున్నాయి. సత్తా చాటలేక చతికిలపడుతూ తమ ‘జాతీయ’ హోదాను కోల్పోతున్నాయి. అలా ఈ ఏడు దశాబ్దాల కాలంలో ఎనిమిది పార్టీలు ‘జాతీయ’ హోదా కోల్పోయాయి. డెభై ఏళ్లలో కొన్ని జాతీయ పార్టీలు విలీనం కాగా కొత్తవి ఉద్భవించాయి. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు పరిమితమైంది. దేశంలో ఎన్నికల పర్వాన్ని అక్షరబద్దం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన ‘లీప్ టు ఫెయిత్’ పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలున్నాయి. జాతీయ పార్టీ ట్యాగ్‌లైన్ తమకూ కావాలని 1951 లోక్‌సభ ఎన్నికలకు ముందు 29 రాజకీయ పార్టీలు పట్టుబట్టాయి. అయితే వాటిలో 14 పార్టీలకే ఆ హోదా దక్కింది. అయితే మెజారిటీ పార్టీలు దాన్ని నిలబెట్టుకోలేకపోయాయి. కేవలం నాలుగు పార్టీలు.. కాంగ్రెస్, ప్రజా సోషలిస్ట్ పార్టీ, సీపీఐ, జనసంఘ్ ఆ హోదాను నిలుపుకున్నాయి. అఖిల భారతీయ హిందూ మహాసభ, ఆలిండియా భారతీయ జనసంఘ్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్(మార్కిస్ట్), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్(రూకర్), కృషికార్ లోక్‌పార్టీ, బొల్‡్షవిక్ పార్టీ ఆఫ్ ఇండియా, రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ హోదా కోల్పోయాయి. దీంతో 1957 ఎన్నికలనాటికి పార్టీల సంఖ్య 15కు పడిపోయింది. వాటిలో నాలుగింటికే జాతీయ హోదా కొనసాగింది. అయితే 1962 ఎన్నికలనాటికి జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు, అన్ని పార్టీల సంఖ్య 29కి పెరిగింది. సోషలిస్ట్ (ఎస్ఓసీ), స్వతంత్ర (ఎస్‌డబ్ల్యూఏ) పార్టీలు జాతీయ హోదా పొందాయి. 1951 ఎన్నికల తర్వాత సీపీఐ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి పుష్కర కాలం ఆ హోదాలో కొనసాగింది. కానీ 1964లో పార్టీలోని సోవియట్, చైనా కమ్యూనిస్ట్ వర్గాలు వేరు కుంపటి పెట్టాయి. దీంతో సీపీఐ (మార్కిస్ట్) పురుడుపోసుకుంది. 1992లో 7 జాతీయ పార్టీలు 1992 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు నేషనల్ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనతాదళ్, జనతా పార్టీ, లోక్‌దళ్ పోటీలో ఉన్నాయి. 1996 సాధారణ ఎన్నికల్లో మొత్తం 209 పార్టీలు అధికారం కోసం పోటీపడ్డాయి. కాంగ్రెస్, ఆలిండియా కాంగ్రెస్ (తివారీ), బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనతా పార్టీ, సమతా పార్టీ, జనతాదళ్ రూపంలో ఎనిమిది పార్టీలకు జాతీయ హోదా దక్కింది. 1998 ఎన్నికలకొచ్చేసరికి పార్టీల సంఖ్య 176కు పడిపోయింది. ఈ దఫా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, జనతాదళ్, సీపీఐ, సీపీఎం, సమతా పార్టీ జాతీయ హోదాతో పోటీపడ్డాయి. 1999లో పార్టీల సంఖ్య 160కి పడిపోయింది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, జేడీ(ఎస్), జేడీ(యూ) జాతీయ పార్టీలుగా అదృష్టం పరీక్షించుకున్నాయి. 2014లో 464 పార్టీలు 2014 ఎన్నికల్లో ఏకంగా 464 పార్టీలు రంగంలోకి దూకాయి. జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు తగ్గింది. ఆనాడు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీలకు మాత్రమే జాతీయ హోదా ఉంది. 2016లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా జాతీయ హోదా సాధించి ఎన్నికల్లో పోటీ చేసింది. 2019లోనూ ఎక్కువ సీట్లు సాధించేందుకు శ్రమించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 674 పార్టీలు పోటీ చేయగా వాటిలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, తృణమూల్ రూపంలో ఏడు జాతీయ పార్టీలుగా నిలిచాయి. తర్వాత తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ జాతీయ హోదా కోల్పోయాయి. జాతీయ హోదా ఇలా... నిబంధనావళి ప్రకారం కనీసం మూడు రాష్ట్రాల నుంచి కనీసం రెండు శాతం ఎంపీ సీట్లను గెలిచిన పార్టీకే జాతీయ పార్టీ హోదా దక్కుతుంది. లేదంటే నాలుగు రాష్ట్రాల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు ఆ పార్టీకి పడాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో అప్పటికే రాష్ట్ర పార్టీ హోదా ఉండాలి. ► జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులకు ఒకే ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. ► దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తారు. జేపీ.. జనతా ప్రయోగం జయప్రకాశ్ నారాయణ్ (జేపీ), రామ్ మనోహర్ లోహియా, ఆచార్య నరేంద్ర దేవ్ ఏర్పాటుచేసిన సోషలిస్ట్ పార్టీ మూలాలు కాంగ్రెస్ వామపక్ష విభాగమైన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (సీఎస్పీ)లో ఉన్నాయి. జేపీ సోషలిస్ట్ పార్టీని జేబీ కృపలానీ సారథ్యంలోని కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలో విలీనం చేసి ప్రజా సోషలిస్ట్ పార్టీ (పీఎస్పీ)ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత పీఎస్పీ నుంచి జేపీ బయటికొచ్చారు. ► 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో జేపీ మళ్లీ జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. జేపీతో పాటు విపక్షాలు నేతలందరూ జైలు పాలయ్యారు. ► జేపీ విడుదలయ్యాక కొందరు పీఎస్పీ నేతలతో కలిసి భారతీయ లోక్‌దళ్‌ను స్థాపించారు. ► ఎమర్జెన్సీకారణంగా దేశంలోని విపక్ష పార్టీలపై నిషేధం కత్తి వేలాడటంతో ఇందిరను ఢీకొట్టేందుకు అంతా కలిసి జనతా పార్టీకి ప్రాణం పోశారు. 1977లో ఇందిరను ఓడించి జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచి్చంది. జాతీయ పార్టీగా ఆప్ తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ జాతీయ పార్టీ హోదాను కోల్పోయాక గతేడాది కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదా సాధించడం విశేషం. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆప్ మాత్రమే జాతీయహోదాలో తలపడుతున్నాయి. 543 లోక్‌సభ స్థానాలకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయహోదాతో వచ్చే మార్పులేంటి ?
హిమాచల్‌ప్రదేశ్‌లో ఖాతా తెరవలేకపోయింది. గుజరాత్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆప్ కలలు కంది. కానీ ఆ కలలన్నీ కల్లలైపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఊడవలేకపోయిన చీపురు మూలకూర్చుండిపోయింది. గుజరాత్ ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా రావడంతో ఆ పార్టీకి కాస్త బలం వచ్చినట్టయింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన పంజాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎరగవేయడంతో గుజరాత్లో కూడా ఆ పార్టీ ప్రబల శక్తిగా ఎదుగుతుందని అందరూ భావించారు. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా తన ఉనికిని చాటుతుందని అనుకున్నారు. కానీ రెండు రాష్ట్రాల్లోనూ ఆప్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఆప్‌కి జాతీయ పార్టీ హోదా దక్కడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రెండేళ్ల ముందు నుంచి రాష్ట్రంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ గుజరాత్‌పై దృష్టి పెట్టడం, సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ సత్తా చాటడంతో తొలిసారిగా రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. అయితే మొదట్నుంచి ఆప్ కాంగ్రెస్‌నే విమర్శిస్తూ ఆ పార్టీ ఓటు బ్యాంకునే లక్ష్యంగా చేసుకోవడంతో నామమాత్రంగానే మిగిలిపోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఆమ్ మొదట్లో విస్తృతంగా తిరిగినప్పటికీ అవినీతి ఆరోపణల కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్‌తో ఆప్ ఆశలు వదిలేసుకుంది. గుజరాత్లో వివిధ మీడియా సంస్థల పోల్స్ కూడా ఆప్‌కి 20 శాతం వరకు ఓట్లు వస్తాయని అంచనా వేశాయి. కానీ ప్రధాని నరేంద్ర మోదీకి సొంత గడ్డ మీదనున్న క్రేజ్ ముందు కేజ్రివాల్ నిలబడలేకపోయారు. చదవండి: (ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం) జాతీయ పార్టీ హోదా ‘‘గుజరాత్ ప్రజలు మాకు జాతీయ పార్టీ హోదా కట్టబెట్టారు. ఇప్పటివరకు దేశంలో కొన్ని పార్టీలకు మాత్రమే ఆ హోదా ఉంది. నిజంగా ఇది మాకో అద్భుతమైన విజయం’’.. గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అరవింద్ కేజ్రివాల్ పంపిన సందేశమిది. జాతీయ పార్టీకి హోదా రావడానికున్న షరతుల్లో ఒకటైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలో 6శాతం ఓట్లు, కనీసం రెండు సీట్లలో గెలిచి ఉండాలి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆప్ గోవాలో 6శాతం ఓట్లు, 2 సీట్లను సాధించింది. ఇప్పుడు గుజరాత్లో అయిదు సీట్లను గెలుచుకొని, 13శాతం ఓట్లతో జాతీయ పార్టీ హోదాని దక్కించుకుంది. దేశంలో ఉన్న జాతీయ పార్టీలివే.. మన దేశంలో ఇప్పటివరకు ఎనిమిది మాత్రమే జాతీయ పార్టీలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీకి మాత్రమే ఈ గుర్తింపు ఉంది. ఆప్‌ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తిస్తే తొమ్మిదో జాతీయ పారీ్టగా అవతరిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ జాతీయ హోదాతో వచ్చే మార్పులేంటి ? ►పార్టీకి జాతీయ హోదా వస్తే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే ఎన్నికల గుర్తు లభిస్తుంది ►సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆకాశవాణి, దూరదర్శన్‌లో బ్రాడ్కాస్ట్, టెలికాస్ట్ బాండ్స్ లభిస్తాయి ►40 మంది స్టార్ క్యాంపైనర్లు ప్రచారంలో పాల్గొనచ్చు. వారికయ్యే ఖర్చులు అభ్యర్థులకుండే ఖర్చుల పరిమితి నుంచి మినహాయిస్తారు. ►పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి రాష్ట్రాల్లో ప్రభుత్వ జాగాలు లభిస్తాయి. ►అభ్యర్థులు నామినేషన్ వేసినప్పుడు ఒకరే ప్రొపోజర్ ఉంటే సరిపోతుంది. -
‘పాలమూరు’కు హోదా ఇస్తారనుకున్నాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తున్నామని చెప్పేందుకు ఇటీవల కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే మహబూబ్‌నగర్ పర్యటనకు వచ్చినట్లు భావించామని ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కానీ, వీరి వైఖరి చూస్తుంటే పాలమూరుకు నిధులివ్వడం పక్కనబెట్టి ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు సృష్టించడమే ఉద్దేశంగా కనిపిస్తోందని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని వెంకటాపూర్, మాచన్‌పల్లితండాలో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ, సుష్మాస్వరాజ్ హామీ నెరవేర్చేందుకు కేంద్రమంత్రి వచ్చారని అనుకున్నామని, ఒకరి ఇంట్లో టిఫిన్, మరొకరి ఇంట్లో భోజనం, స్టార్ హోటల్లో సేదతీరుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. పాలమూరుకు జాతీయ హోదాతోపాటు రూ.లక్ష కోట్ల నిధులు విడుదల చేసి బీజేపీ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. పొలాలకు సాగునీరు పారించాలని తాము చూస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం రక్తం పారించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. -
కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం
న్యూఢిల్లీ: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. కాళేశ్వరానికి పెట్టుబడులు అనుమతులు లేవని, అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని కేంద్ర నీటి జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు స్కీంలోకి కాళేశ్వరాన్ని చేర్చే అర్హతలేదని వెల్లడించారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ 2016, 2018లో ప్రధానికి లేఖలు రాసినట్లు పేర్కొంది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అన్నారు. జాతీయ హోదా కావాలంటే.. సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరని, ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం ఉండాలని, ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలని, హైపవర్ స్టీరింగ్ కమిటీ అనుమతి ఇస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా అవకాశం ఉంటుందని లేఖలో కేంద్రమంత్రి పేర్కొన్నారు. చదవండి: హైదరాబాద్ మెట్రోలో డ్యాన్స్.. యువతికి షాకిచ్చిన అధికారులు -
మేడారానికి జాతీయ హోదా.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని కౌంటర్
సాక్షి, ములుగు జిల్లా: మేడారం జాతరకు జాతీయ హోదా విషయంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’ కు జాతీయ హోదా ఇవ్వకుంటే దేనికి ఇస్తారని తలసాని ప్రశ్నించారు. ఉత్తర భారతదేశంలో జరిగే పండుగలకు జాతీయ హోదా ఇస్తారా అని చురకలంటించారు. ఈ మేరకు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి తలసాని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పండుగలకు జాతీయ హోదా ఉండదని, మేడారానికి ఇవ్వమని స్పష్టం చేయడంపై స్పందించారు. కేంద్ర మంత్రి తలతోక లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీకి స్థలం కేటాయించి మూడేళ్ళు అవుతుందని, ఇప్పటి వరకు దానికి అతి గతి లేదని అన్నారు. బీజేపీ నేతలు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని దుయ్యబట్టారు. జాతరకు జాతీయ హోదా ఉండదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఇంతకముందు మేడారం జాతరకు జాతీయ హోదా ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పండుగలకు జాతీయ హోదా ఎక్కడలేదని, కావాలంటే విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. కేంద్ర ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి రేణుకాసింగ్, మాజీ రాష్ట్రమంత్రి ఈటల రాజేందర్, బిజేపి ఓబిసి సేల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్‌తో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. గిరిజనులు రెండేళ్లకోసారి జరుపుకునే ప్రకృతిపండుగ మేడారం జాతర అని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకుని కరోనా మహమ్మారి మీద విజయం సాధించి, సుఖసంతోషాలతో ఉండాలనీ కోరుకున్నానని పేర్కొన్నారు. చదవండి: 60 శాతం బస్సులు మేడారానికే.. హైదరాబాద్ పరిస్థితేంటి? గిరిజన విశ్వవిద్యాలయంకు 45 కోట్లు కేటాయించామని, త్వరలోనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర రాజధానిలో కేంద్రం మ్యూజియం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ప్రభుత్వం నిధుల కేటాయించిందని వెల్లడించారు.గిరిజనులకు బిజేపి, కేంద్రం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఏడుగురికి మంత్రులు ఇచ్చి, గిరిజనల అభ్యున్నతికీ ప్రధాని మోదీ దోహదపడుతున్నారని తెలిపారు. చదవండి: మేడారానికి హెలికాప్టర్ సర్వీసులు.. ఒక్కో ప్రయాణికుడికి ఎంతంటే? పోటెత్తిన భక్తులు మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. సమ్మక్క ఆగమనంతో రాత్రి నుంచి నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. దీంతో మేడారం జాతర ప్రాంగణమంతా భక్తజన సంద్రంగా మారింది. అటు వీఐపీల తాకిడి కూడా పెరిగింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు వనదేవతలను దర్శించుకొని ఎత్తుబంగారం సమర్పించుకున్నారు. సీఎం వస్తారా? రారా? ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ నాయకులు భావిస్తున్నారు. తోపులాట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్ మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిన సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. మీడియా ప్రతినిధులను పోలీసులు నేట్టేశారు. దీంతో జర్నలిస్టులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మీడియా ప్రతినిధులను సముదాయించారు. -
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి!
ఆదివాసీ అస్తిత్వం మేడారం జాతర. వారి పోరాటానికి చిహ్నం. అది జాతర కాదు, ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక. గిరిజన స్వయంపాలనకు దిక్సూచి అయిన మేడారం జాతర మొదలైంది. అమ్మతల్లుల జాతరలో ఆదివాసులే కాదు, సకల జనులూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు. జాతర నాలుగు రోజులూ... సత్తెంగల సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లిస్తూ... సంప్రదాయ వంటకాలను నైవేద్యంగా పెడుతూ... మరో లోకాన్ని సృష్టిస్తారు. ఇటువంటి జనజాతరకు ఎప్పటి నుంచో జాతీయ హోదా కల్పించాలని భక్తులూ, రాష్ట్రప్రభుత్వం ఎన్నో రోజుల నుంచి కోరుతున్నది. కానీ ఆ కల ఇంకా నెరవేరనేలేదు. దేశంలో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర రానేవచ్చింది. నేటి నుంచి ఫిబ్రవరి 19 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో... వివిధ రకాల పూజా ప్రక్రియలు, ఆదివాసుల ప్రత్యేక వస్త్ర ధారణ వంటి అంశాలు అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. ములుగు జిల్లా, తాడ్వాయి మండలం... మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన ఈ వేడుకకు జాతీయ హోదా ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి ఇప్పటి వరకు చాలాసార్లు ప్రతిపాదనలు వెళ్ళినా ఇంతవరకు అది సాకారం కాలేదు. స్థానిక ఆదివాసీల నమ్మకం ప్రకారం... సమ్మక్కను కోయల్లో చందా వంశస్థుల ఆడపడుచుగా భావిస్తారు. ఆమె బయ్యక్కపేటలో జన్మించింది. ఈడు వచ్చే కొలది ఆమె తాను ఇంటిలో ఉండలేనని, విడిగా ఉంటానని చెబుతూ వచ్చింది. చివరికి అక్కడి దట్టమైన అడవుల్లో ఉన్న ఒక కొండపైకి వెళ్లి దాన్నే తన నివాస స్థలంగా ఏర్పాటు చేసుకుందని స్థానికులు చెబుతారు. సమ్మక్క కొండ దిగి వచ్చి రోజూ స్నానం చేసే ఒక కొలను కూడా కొండ దగ్గరలో ఉందనీ, దాన్ని ‘జలకం బావి’ అని పిలుస్తామని వాళ్లు చెబుతున్నారు. మొదటలో బయ్యక్క పేటలోనే సమ్మక్క జాతర జరిగేది. కొన్ని కారణాల వల్ల అది మేడారానికి మారింది. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో మొదలయ్యే సమ్మక్క జాతర నాలుగు రోజులు జరుగుతుంది. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకువస్తారు. రెండవ రోజున మేడారం సమీపం లోని చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకొస్తారు. మూడో రోజు అమ్మవార్లకు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. తమ కోరికలు తీర్చమని భక్తులు బెల్లం (బంగారం)ను నైవేద్యంగా సమర్పించుకుంటారు. నాలుగవ రోజు పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయిస్తారు. అంటే వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి భక్తి శ్రద్ధలతో మళ్లీ ఆదివాసీ కోయలు చేరుస్తారు. ఇలా దీంతో జాతర ముగుస్తుంది. ఎంతో చరిత్ర, నేపథ్యం కలిగిన సమ్మక్క–సారలమ్మ జాతరను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1996లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2014లో ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా జాతర జరుపుతున్నది. ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 332.71 కోట్ల నిధులను కేటా యించింది. ఈ ఏడాది రూ.75 కోట్ల నిధులు కేటాయించి రవాణా, త్రాగునీరు, భద్రతా చర్యలు వైద్య సదుపాయాలు తదితర సదుపాయాల కోసం 21 ప్రభుత్వ శాఖలకు నిధులు కేటాయించింది. (చదవండి: పరాయీకరణ దిశలో మేడారం జాతర) రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆరు ప్రధాన రహదారుల ద్వారా ఈ జాతరకు 1 కోటి 30 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక మంది భక్తులు హాజరయ్యే పండుగ ఇది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఈ) ద్వారా జాతరకు ఎంత మంది వచ్చారో 99 శాతం కచ్చితత్వంతో తెలుసుకుంటారు. దేశంలో ఏ ఉత్సవంలోనూ వినియోగించని విధంగా కృత్రిమ మేథా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా, తొక్కిసలాట జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ఏర్పాట్లు చేస్తుంది. ఇంతటి చరిత్ర, నేపథ్యం కలిగిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రతిపాదన చేసి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. గత జాతరలో ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా ఈ మహా జాతర ప్రాముఖ్యత గురించి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి జాతీయ హోదా ఇప్పిస్తానని వాగ్దానం చేశారు. కానీ అది మాటలకే పరిమితమైంది కానీ చేతలకు నోచుకోలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ మహా జాతరకు జాతీయ హోదా కల్పించి నిధులు విడుదల చేస్తే జాతర ప్రాశస్త్యాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. ఆ తర్వాత యునెస్కో గుర్తింపునకూ మర్గం సుగమం అవుతుంది. - అంకం నరేశ్ వ్యాసకర్త ఉపాధ్యాయుడు -
అదంతా కాంగ్రెస్ పాపమే..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా చేసిన పాపం కాంగ్రెస్ పారీ్టదేనని ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఏపీలోని పోలవరానికి జాతీయ హోదా కల్పించి, కాళేశ్వరానికి ఆ హోదా రాకుండా చేసి కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకంటే రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పనిచేస్తున్న విషయాన్ని గమనించిన ప్రజలు ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. జాతీయహోదా కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరలేదని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం న్యాయం కాదన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశారని, ఇరిగేషన్‌శాఖ మంత్రిగా తాను కేంద్రమంత్రి గడ్కరీని కోరానని, పదుల సార్లు విజ్ఞప్తులతో పాటు, ప్రభుత్వం లేఖలు సైతం రాసిందన్నారు. ప్రాణహిత, ఇతర ప్రాజెక్టులను కోర్టులో కేసులు వేసి అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. శ్వేతపత్రం ప్రకటించాలి: జీవన్‌రెడ్డి బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరంను జాతీయ ›ప్రాజెక్టుగా గుర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. ఇటీవల రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు ఎం.ఏ.ఖాన్ వేసిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిస్తూ, ప్రతిపాదిత ప్రొఫార్మాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అందలేదని చెప్పారన్నారు. ఈ విషయంలో కేంద్రం తప్పుదోవ పట్టిస్తోందా లేక రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పడం లేదా అని ప్రశ్నించారు. ఇందులో బీజేపీ, టీఆర్ఎస్ దోబూచులాట ఏంటని జీవన్ రెడ్డి నిలదీశారు. దీనిపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయరంగం ప్రాధాన్యతాంశం కాగా ప్రభుత్వం రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా వంటివి సరిగా అమలుచేయడం లేదన్నారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్‌ను ఆరోగ్యశ్రీతో మిళితం చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు పీఆర్సీ, ఐఆర్ వంటివి ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఆకట్టుకున్న పల్లా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన ప్రసంగంతో సభను ఆకట్టుకున్నారు. తెలంగాణ వచి్చన నాడు సరైన బడ్జెట్ అంచనాలే లేని పరిస్థితినుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సీఎం పడిన కష్టాన్ని అర్థవంతంగా సభకు వివరించారు. తెలంగాణ ఏర్పాటయిన నాటినుంచి నేటి వరకు పలు కీలక రంగాలు కేసీఆర్ దార్శనికతతో ఎట్లా అభివృద్ధి చెందాయో సోదాహరణంగా, గణాంకాలతో సహా వివరిం చారు. అదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు తమ ప్రసంగాల్లో చేసిన విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చి పలు సందేహాలను నివృత్తి చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్, విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు సహా తెలంగాణను ఆర్థికంగా అంచెలంచెలుగా సీఎం ఎట్లా ముందుకు తీసుకుపోతున్నారో పల్లా వివ రించారు. ప్రతిపక్షాలకు రాజకీయాలే తప్ప తెలంగాణ ప్రజల బాగోగులు పట్టవన్నారు. నాటు పడవలు ఎక్కి మోటుమాటలు మాట్లాడు తున్నారని కాంగ్రెస్ సభ్యులను దుయ్యబట్టారు. బీజేపీ సభ్యులకు తెలంగాణ అంటే చిన్నచూపుఎందుకని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఏదీ? బడ్జెట్లో నిరుద్యోగ యువతకు భృతి చెల్లింపునకు సంబంధించి ప్రస్తావన లేదని బీజేపీ సభ్యుడు ఎన్.రాంచంద్రరావు విమర్శించారు. హైకోర్టును పాతబస్తీ నుంచి తరలించొద్దని ఎంఐఎం సభ్యుడు అమీనుల్ జాఫ్రీ విజ్ఞప్తి చేశారు. మాంద్యం నేపథ్యంలో భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఎలా సాధిస్తుందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు ఆకుల లలిత, పురాణం సతీశ్ బడ్జెట్‌పై ప్రసంగించారు. అనంతరం ఆదివారానికి సభ వాయిదా పడింది. -
కాళేశ్వరానికి జాతీయ హోదా అడిగారా లేదా?
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ కేంద్రాన్ని అడిగారో లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. తుమ్మిడిహెట్టి వద్ద రూ.లక్ష కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి రాజ్యసభలో ఎంపీ ఎం.ఎ.ఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా 2019 జూలై 1న సమాధానమిస్తూ.. 2016లో సీఎం కేసీఆర్ రాసిన లేఖ మినహా నిర్దేశిత రూపంలో తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని చెప్పారని ఆ లేఖలో గుర్తుచేశారు. టీఆర్ఎస్ నేతలేమో తాము అడిగినా బీజేపీ ఇవ్వడం లేదని చెబుతున్నారని, ఇందులో ఏది నిజమో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా అడిగి ఉంటే వాటిని బహిర్గతం చేసి రాజ్యసభలో అబద్ధం చెప్పిన కేంద్ర మంత్రికి సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఊసేలేని కాళేశ్వరం జాతీయ హోదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌కు కేంద్రం మొండిచెయ్యి చూపింది. రాష్ట్రంలో 70 శాతం భూభాగానికి సాగునీటిని అందించే ప్రాజెక్టుకు నిధులిచ్చి ఆదుకోవాలని కోరినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తావన రాలేదు. బడ్జెట్ కసరత్తులో భాగంగా రాష్ట్రాల ప్రతిపాదనలు, సూచనలు తీసుకొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో జూన్ 21 జరిగిన సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం తరఫున ఈ భేటికీ హాజరైన ఆర్థిక వ్యవహారాల ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జాతీయ హోదా అంశాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.88 వేల కోట్లు ఖర్చవుతున్నాయని, వాటి లో అధిక భాగం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా సమీకరించిన అప్పులేనని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. జూన్ 24న రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై ప్రసంగించిన టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు కూడా జాతీయ హోదాకై డిమాం డ్ చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావన చేయలేదు. జాతీయ హోదా అంశాన్ని పూర్తిగా విస్మరించింది. ఇక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు నిధులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా ఈ అంశాలను సైతం పక్కనపెట్టింది. ప్రధానమంత్రి కృషి సించయ్ యోజన కింద రాష్ట్రం నుంచి 11 ప్రాజెక్టులకు నిధులు అందాల్సి ఉంది. -
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కేంద్రాన్ని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు సోమ వారం లోక్‌సభలో ‘రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం’పై జరిగిన చర్చలో మాట్లాడారు. ‘తెలం గాణ ఏర్పడి కొద్దికాలమే అయినా రైతుల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ అనేక సాగునీటి ప్రాజెక్టులు ఆరంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును మూడేళ్లలో నిర్మించగలిగారు. దీనికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మొదటి నుంచీ కోరుతున్నాం. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చి ఐదేళ్లు గడిచినా అనేక నిబంధనలు అమలు కాకుండా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. నదుల అనుసంధానం చేపట్టి తద్వార కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా నిధులు అందజేయాలి’అని కోరారు. -
‘కాళేశ్వరానికి’ జాతీయ హోదా ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. మిషన్ భగీరథ, కాకతీయ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు నిధులివ్వాలన్నారు. కేంద్ర బడ్జెట్ కసరత్తులో భాగంగా రాష్ట్రాల ప్రతిపాదనలు, సూచనలు తీసుకొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎం కేసీఆర్ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ కాళ్వేరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం వల్ల ఆయన హాజరుకాలేకపోయారు. ఆయన తరఫున రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హజరై ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని చదివి వినిపించారు. కాళేశ్వం ప్రాజెక్టుకు జాతీయ హోదాతోపాటు బయ్యారం స్టీల్ ప్లాంట్ పనులను వేగవంతం చేయాలని, వెనుకబడిన జిల్లాల జాబితాలో రాష్ట్రంలోని 32 జిల్లాలను చేర్చాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలన్నారు.ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 88 వేల కోట్లు ఖర్చు అవుతున్నాయని, వాటిలో అధిక భాగం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా సమీకరించిన అప్పులే అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. స్టీల్‌ప్లాంట్ ప్రక్రియ వేగవంతం చేయాలి... ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు నిధులు కేటాయించాలని రామకృష్ణారావు కోరారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున, పాత జిల్లాలు తొమ్మిదింటికి మాత్రమే రూ. 450 కోట్లు కేటాయిస్తున్నారని, ఆ మొత్తాన్ని కొత్తగా ఏర్పాటైన జిల్లాలు కలిపి 32 జిల్లాలకు వర్తింపజేయాలని కోరారు. ఏపీ పునర్వి భజన చట్టం 2014 హామీ మేరకు ఏర్పాటు కావాల్సిన స్టీల్ ప్లాంట్ ఇంకా పెండింగ్ లోనే ఉందని, ఆ ప్రక్రియ వేగిరపరచాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించాలన్నారు. -
జెండా ఏదైనా.. హామీలే ఎజెండా!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారం రాష్ట్ర ప్రజల ఎజెండా దిశగా వెళుతోంది. తమను గెలిపిస్తే ఫలానా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ప్రజలకు హామీలిస్తున్నాయి. రాష్ట్రంలోని అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు విభజన చట్టంలో ఉండి అమలు కాని కార్యక్రమాలు, ఐటీఐఆర్, ఇతర అంశాలు రాజకీయ పార్టీలకు పచారా స్త్రాలుగా మారుతున్నాయి. ఆ రెండు ప్రాజెక్టులూ..! రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశం ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాళేశ్వ రం విషయంలో కేంద్రం సానుకూలంగా స్పం దించి ఉంటే బాగుండేదని బీజేపీని బోనులో నిలబెట్టే యత్నం చేస్తోంది. అయితే, తమను గెలిపించి కేంద్రంలో రాహుల్‌ను ప్రధాని చేస్తే రాష్ట్రంలోని ఏదో ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకువస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రజలకు చెప్తోంది. అందులో కాళేశ్వరంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను ఆ ప్రాధాన్యాలుగా ఎంచుకుంటోంది. విభజన అంశాలు తెరపైకి తమను 16 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే జాతీయ రాజకీయాల్లో కీలకమవుతామని టీఆర్ఎస్ ప్రకటించిన నాటి నుంచే రాష్ట్ర విభజన చట్టం లోని హామీలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే ఆ పార్టీ దగ్గర 15 మంది ఎంపీలున్నారని, అయి నా విభజన చట్టంలోని హామీలను కూడా సాధించలేకపోయారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన, ఉద్యాన వర్సిటీల ఏర్పాటు, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన లాంటి అంశాలు ఈ హామీల రూపంలో పెండింగ్‌లో ఉండటంతో వీటిని కూడా ఎన్నికల ప్రచారాస్త్రాలుగా చేసుకుని రాజకీయ పార్టీ లు ముందుకెళుతున్నాయి. పార్లమెంటులో ఆమోదించిన చట్టంలోని అంశాలను సైతం నెరవేర్చే పనిని బీజేపీ మర్చిపోయిందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఆ మూడూ కీలకమే..! వీటికి తోడు ఐటీఐఆర్, పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నల అంశం కూడా ఈసారి ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. ఐటీఐఆర్‌ను ప్రకటించి కేంద్రం వదిలేసిందని టీఆర్ఎస్ చెబుతుంటే 50 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టును తాము పూర్తి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కానీ, బీజేపీ మాత్రం రాష్ట్రం నుంచి సరైన రీతిలో ప్రతిపాదనలు వెళ్లనందునే ఈ ప్రాజెక్టు సకాలంలో మంజూరు కాలేదని ఓటర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇక, భారీ ఎత్తున నిజామాబాద్ లోక్‌సభకు నామినేషన్ల దాఖలుకు కారణమైన పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్న రైతుల అంశాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో చర్చనీయాంశమవుతున్నాయి. అనేక అంశాలపై... వీటితో పాటు హైదరాబాద్–కరీంనగర్ రైల్వేలైన్, స్మార్ట్‌సిటీల ఏర్పాటు, పోడు భూముల సమస్య పరిష్కారం, సింగరేణిలో కారుణ్య నియామకాలు, మెడికల్ కళాశాలల ఏర్పాటు, తుమ్మిడిహెట్టి బ్యారేజీ, సచివాలయ నిర్మాణం కోసం బైసన్‌పోలో గ్రౌండ్ అప్పగింత లాంటి కేంద్రంతో సంబంధమున్న అనేక అంశాలపై అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో తమదైన రీతిలో ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారు...కేసీఆర్ ప్రతిపాదిస్తున్న విధంగా జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ను బలీయమైన శక్తిగా నిర్ణయిస్తారా.. మోదీ, రాహుల్‌గాంధీల ప్రధాని అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతారా అన్నది వేచిచూడాల్సిందే..! రోడ్లు... ఓటుకు బాటలు తాము ప్రతిపాదించి కార్యరూపంలోకి తీసుకొస్తున్న రీజినల్ రింగురోడ్డు ఓట్ల వర్షం కురిపిస్తుందని టీఆర్ఎస్ ఆశిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఉపయుక్తమైన ఈ ప్రాజెక్టు రూ.12వేల కోట్ల వ్యయం అంచనాతో, 338 కిలోమీటర్లు మేర రెండు లేన్లలో ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే, ఇందులో కేంద్రం వాటానే రూ.10,500 కోట్లు ఉంటుంది. దీంతో కేంద్రంలో టీఆర్ఎస్ను కీలకం చేస్తే ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేస్తామని ఆ పార్టీ చెబుతోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలోని 3,155 కిలోమీటర్ల పొడవైన 25 జాతీయ రహదారులను ప్రతిపాదిస్తే కేవలం 1,388 కిలోమీటర్లను మాత్రమే కేంద్రం గుర్తించిందని, మిగిలింది గుర్తించలేదనే అంశాలను ప్రచారం చేస్తోంది -
కేసీఆర్ విన్నపాలు ఇవే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ జీవనరేఖ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి.. సీఎం కేసీఆర్ విన్నవించారు. బుధవారం ఢిల్లీలో ప్రధానిని కలిసిన కేసీఆర్.. రాష్ట్రానికి అవసరమైన 16 అంశాలతో కూడిన అభ్యర్థనల చిట్టాను ఆయనకు అందజేశారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఆయా అభ్యర్థనలను పరిష్కరించి నిధులు విడుదల చేయాలని కోరారు. రెండోసారి సీఎం అయ్యాక.. తొలిసారి ఆయన ప్రధానిని కలిశారు. లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసంలో బుధవారం సాయంత్రం 4 నుంచి ఐదు వరకు ఈ సమావేశం జరిగింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంపై కేసీఆర్‌ను ప్రధాని అభినందించారు. దేశం అన్నదాతకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని.. ఈ దిశగా తాము రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ వివరించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక తెలంగాణలో ఏర్పాటు కావాల్సిన జాతీయస్థాయి విద్యా సంస్థలు, మౌలిక సౌకర్యాల స్థాపనకు సంబం« దించి గతంలో వివిధ సందర్భాల్లో చేసిన అభ్యర్థనలను మరోసారి ప్రధానికి కేసీఆర్ వివరించారు. కేసీఆర్ విన్నపాలు ఇవే 1. తెలంగాణ నూతన సచివాలయ భవన నిర్మాణానికి, సమీపంలోని రాజీవ్ రహదారి, ఇతర రహదారుల విస్తరణకు వీలుగా బైసన్ పోలో, జింఖానా మైదానాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. దీనిపై రక్షణ శాఖ ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం తెలిపినా బదిలీ జరగలేదు. 2. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు. 3. హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు. 4. తెలంగాణలోని 21 కొత్త జిల్లాలకు జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలు ఏర్పాటు. 5. హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటు. 6. కేంద్ర ఉపరితల రవాణా శాఖ ప్రతిపాదించిన మేరకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)తో కలిసి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదిలాబాద్‌లోని సీసీఐ ప్లాంటును పునరుద్ధరించాలి. 7. జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్ఛరింగ్ జోన్ (నిమ్జ్)కు నిధులు విడుదల చేయాలి. 8. వరంగల్లులో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి వీలుగా రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలి. 9. కృష్ణానది పరివాహక ప్రాంత రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఉండేవని, కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో కృష్ణానది జలాల పంపిణీని నాలుగు రాష్ట్రాల మధ్య తిరిగి చేపట్టాలని, ఇందుకు కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ అంతర్రాష్ట నదీ జలాల వివాద చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూ)–1956లోని సెక్షన్–3 కింద తెలంగాణ రాష్ట్రం 2014 జూలై 7న కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేసిన సంగతిని సీఎం గుర్తుచేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేంద్ర జల వనరుల శాఖ ఈ చట్టంలోని సెక్షన్ 5(1) ద్వారా సంక్రమించిన అధికారాలతో ఈ ఫిర్యాదుపై విచారణకు కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడం గానీ, ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్‌ను విచారించమనడం కానీ చేయాలని వివరించారు. కానీ ఈ ఫిర్యాదును కేంద్రం పట్టించుకోకుండా కేవలం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 అమలు కోసం మాత్రమే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును పొడిగించిందని వివరించారు. సెక్షన్ 89 పరిధి చాలా పరిమితమని, ఇది తెలంగాణ హక్కులను కాపాడడంలో న్యాయం చేయదని నివేదించారు. అందువల్ల తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదును కేంద్రం పునఃపరిశీలించి అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టంలోని సెక్షన్ 5(1) కింద కేడబ్ల్యూడీటీ–2కి రెఫర్ చేయాలని కోరారు. 10. తెలంగాణకు జీవనరేఖగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని కేసీఆర్ కోరారు. ఈ భారీ నీటి పారుదల ప్రాజెక్టుకు ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని కోరారు. ఏడు పాత జిల్లాలకు తాగు, సాగు నీరు, జంట నగరాలకు తాగు నీరు అందించనున్న ఈ భారీ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం ద్వారా తెలంగాణకు సాయపడాలని కోరారు. 11. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, షెడ్యూలు 10 సంస్థల విభజనకు పరిష్కారం చూపాలి. 12. త్వరితగతిన నిధులు విడుదల చేస్తూ రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలి. 13. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సత్వరం పరిష్కరించాలి. 14. విభజన చట్టాన్ని అనుసరించి వరంగల్లు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలి. 15. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి తెలంగాణలోని వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.450 కోట్లను విడుదల చేయాలి. 16. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. హోం మంత్రితో సమావేశం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ కేసీఆర్ సమావేశమయ్యారు. సాయంత్రం 5.45 గంటలకు జరిగిన ఈ భేటీలో ఎంపీ వినోద్‌కుమార్, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి హైకోర్టు విభజనకు చర్యలు తీసుకున్నందుకు హోం మంత్రికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, షెడ్యూలు 10 సంస్థల విభజనకు సంబంధించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరారు. విభజన చట్టానికి సంబంధించి ఇతర పెండింగ్ అంశాలనూ సీఎం ప్రస్తావించినట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కేసీఆర్‌ను హైదరాబాద్‌లో కలుస్తా: అఖిలేష్ యాదవ్ దేశంలోని విభిన్న పార్టీలను ఫెడరల్ ఫ్రంట్ కిందికి తెచ్చేందుకు కేసీఆర్ కృషిచేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభినందించారు. బుధవారం ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడుతూ ‘అన్ని పార్టీలను ఏకతాటిపైకి తేవడం కొన్ని నెలలుగా సాగుతోంది. కేసీఆర్ ఈ దిశగా ప్రయత్నిస్తున్నందుకు అభినందనలు. ఫెడరల్ ఫ్రంట్‌గా పార్టీలన్నీ కలిసేందుకు ఆయన కృషిచేస్తున్నారు. ఢిల్లీలో 25, 26 తేదీల్లో కేసీఆర్‌ను కలవాల్సి ఉంది. కానీ నేను ఢిల్లీ వెళ్లలేకపోయాను. జనవరి 6 తరువాత హైదరాబాద్ వెళ్లి కలుస్తాను’అని అఖిలేష్ యాదవ్ చెప్పినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. కాగా కేసీఆర్ గురువారం వీలును బట్టి బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసే అవకాశం ఉంది. -
డిండి, పాలమూరుకు జాతీయ హోదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్ జిల్లా తాగు, సాగు అవసరాల కోసం చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి.. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లా అవసరాల కోసం చేపట్టిన డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్ అంశాలపై శుక్రవారం జరిగే కేంద్ర హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నదీ జలాలకు సంబంధించిన అంశాల్లో ఈ రెండు ప్రాజెక్టుల జాతీయ హోదా అంశాన్ని ప్రధానంగా చేర్చింది. ఇక కేంద్ర జల సంఘం టీఏసీ అనుమతులన్నీ ఇచ్చిన దృష్ట్యా కాళేశ్వరంనూ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలంగాణ కోరనుంది. రాష్ట్రం ప్రస్తావించనున్న ఇతర అంశాలు ఇవే.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతులు వచ్చిన వెంటనే గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ మేరకు ఎగువ రాష్ట్రాలకు 80 టీఎంసీల వాటా దక్కుతుంది. ఆ ప్రకారం 2011 జనవరిలో పోలవరానికి జల సంఘం అనుమతివ్వగానే మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీల వాటా వినియోగిస్తున్నాయి. నాగార్జునసాగర్ ఎగువన మిగతా 45 టీఎంసీల నీటిని రాష్ట్రం వాడుకునే అవకాశం ఉంది. తెలంగాణ కృష్ణా బేసిన్లో 36.45 లక్షల హెక్టార్ల సాగుకు యోగ్యమైన భూమి ఉన్నా 5.75 లక్షల హెక్టార్లే (15 శాతం) సాగవుతోంది. ఈ దృష్ట్యా 45 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలి. అలాగే పట్టిసీమ ద్వారా 2017–18 వాటర్ ఇయర్లో 100 టీఎంసీల నీటిని ఏపీ తరలించింది. ఈ జలాల్లోనూ రాష్ట్రానికి వాటా దక్కాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయగా అందుకు విరుద్ధంగా 50 లక్షల క్యూసెక్కులకు పెంచారు. జల సంఘం దీనిపై బ్యాక్‌వాటర్ అధ్యయనం చేయలేదు. 50 లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తే భద్రాచలం రామాలయంతో పాటు బొగ్గు నిక్షేపాలు, మణుగూరులోని మినరల్ ప్లాంటు, అనేక గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన చట్ట సవరణతో రాష్ట్రంలోని 6 మండలాలతో పాటు సీలేరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఏపీ పరిధిలోకి వెళ్లాయి. వీటిని తెలంగాణకు ఇచ్చేయాలి. ఆర్డీఎస్ పథకం కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీరు తరలించే కాల్వలు పూడికతో నిండిపోవడంతో 4.56 టీఎంసీలకు మించి అందడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో అడుగు మేర పెంచాలని నిర్ణయించగా ఇందుకు కర్ణాటక కూడా అంగీకరించింది. ఈ పనులకు ఏపీ అడ్డంకులు సృష్టిస్తున్నందున కేంద్ర జోక్యం చేసుకొని పనులు పూర్తయ్యేలా సహకరించాలి. కృష్ణా నదీ జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు తొలి విడతలో 19 టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని గతేడాది ఫిబ్రవరిలో కృష్ణా బోర్డు చెప్పినా ఇంతవరకు అమల్లోకి రాలేదు. రెండో విడత ఎక్కడో ఇంకా నిర్ణయించలేదు. దీంతో పోతిరెడ్డిపాడు వద్ద ఎక్కువ నీటిని బేసిన్ అవతలకు ఏపీ తరలిస్తోంది. దీన్ని అడ్డుకునేలా టెలిమెట్రీని తక్షణం అమల్లోకి తేవాలి. -
ఇకపై జాతీయ హోదా కుదరదు: గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇకపై రాష్ట్రాలు నిర్మించే సాగునీటి ప్రాజెక్టులకు జాతీ య హోదా ఇవ్వడం కుదరదని, ఆ విధానం ఇప్పు డు అమలులో లేద ని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. గురువారం ఉదయం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ సలీం సాగునీ టి ప్రాజెక్టులపై అడిగిన ఓ అనుబంధ ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ విషయం చెప్పారు. ఈశా న్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాల్లో నిర్మించే ప్రాజెక్టులకు 90% నిధులు కేంద్రం ఇస్తుందన్నా రు. కరువు ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టులకు కేంద్రం 60% వాటా భరిస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీ వినోద్ లేఖ గడ్కరీ ప్రకటనపై స్పందిస్తూ టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మంత్రికి లేఖ రాశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ద్వారా పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చినట్టుగానే, అదే చట్టం ద్వారా తెలంగాణ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకుగానీ, పాలమూరు ఎత్తిపోతల పథకానికిగానీ జాతీయ హోదా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. జాతీయ హోదా ఇచ్చే విధానం అమలుపై పునఃపరిశీలన చేయాలని కోరారు -
దేశం చూపు.. తెలంగాణ వైపు
సాక్షి సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టుతో అన్ని కాలాల్లో ప్రతి గ్రామానికి గోదావరి నీటిని అందించే బృహత్తర పథకాన్ని చేపట్టిన తెలంగాణ వైపు దేశం మొత్తం చూస్తోందని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. జిల్లా కేంద్రంలో హజ్ యాత్రికులకు సన్మానం, పెద్దకోడూరులో రూ.3 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్ హాస్టల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో ప్రాజెక్టులు నిర్మించడానికి 30 ఏళ్లు పట్టేదని, తెలంగాణ వచ్చాక 20 నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. దసరా నాడు అటూ ఇటూ గోదావరి నీటి ని తరలిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు బీమా పథకంతో ధీమాను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రూ.వెయ్యి కోట్లతో రాష్ట్రంలోని ప్రతి మండలంలో గోదాంలను నిర్మించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో సివిల్, ఎలక్ట్రికల్ కోర్సులకు మంచి డిమాండ్ ఉందని, ప్రభు త్వ, ప్రైవేటు రంగంలోనూ అవకాశాలున్నాయన్నా రు. మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని చెప్పారు. ఏడాదిలో ఎల్కతుర్తి జాతీయ రహదారి... ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ సమయంలో వరంగల్–ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చుచేసే విధంగా కేంద్ర ప్రణాళికలో చేర్పించామని హరీశ్‌రావు వెల్లడించారు. సిద్ది పేట జిల్లాలో రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. జిల్లాకు రెండు జాతీయ రహదారులు మంజూరు కావడంతో పారిశ్రామికంగా సిద్దిపేట మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట పరిసర ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రంగనాయక సాగర్ ద్వారా లక్షా పది వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. సమావేశం లో ఎమ్మెల్యే బాబూమోహన్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫరూఖ్ హుస్సేన్ పాల్గొన్నారు. -
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అన్ని అనుమతులు వచ్చినందున జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి హరీశ్‌రావు కోరారు. భారీ వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టిందని, కేంద్రం తరఫున కూడా తగిన సాయం అందించాలని విన్నవించారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్రు తేజావత్, మాజీ ఎంపీ మందా జగన్నాథం మంగళవారం గడ్కరీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసి కాళేశ్వరంపై చర్చించారు. అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ హోదాపై ప్రభుత్వ పరంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. 37 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు చేపట్టిన ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రం తనవంతు సాయం చేయాలని కోరారు. ప్రాజెక్టు అనుమతుల మంజూరులో గడ్కరీ ఎంతో సాయం చేశారన్న హరీశ్.. ప్రాజెక్టును చూసేందుకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించినట్లు తెలిపారు. -
కాళేశ్వరం హోదా.. మళ్లీ తెరపైకి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం కొలిక్కి రావడం, వివిధ కేంద్ర డైరెక్టరేట్ల నుంచి కీలక అనుమతులు లభించిన నేపథ్యంలో ప్రాజెక్టుకు జాతీయ హోదా దిశగా రాష్ట్ర ప్రభు త్వం మళ్లీ ప్రయత్నాలు వేగిరం చేసింది. ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర జల వనరుల సహాయ మంత్రి అర్జున్ రాం మేఘవాల్‌కు జాతీయ హోదా అంశమై వినతి పత్రం సమర్పించనుంది. రాష్ట్రం తరఫున 5 ఎజెండా అంశాలను పేర్కొంటూ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి శనివారం కేంద్రానికి లేఖ రాశారు. అదనపు వాటా కోసం పట్టు రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఇది వరకే కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధాని మోదీకి విన్నవించారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు నీటి పారుదల వర్గాలు తెలిపాయి. అలాగే కృష్ణా జలాల్లో అదనపు వాటాల అంశాన్ని 20వ తేదీ నాటి సమావేశాల్లో ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. ప్రస్తుతం కృష్ణాలో ఉన్న నికర జలాల వాటాను పెంచేలా ఒత్తిడి చేయాలని నిర్ణయించింది. పోలవరం, పట్టిసీమల ద్వారా ఏపీ గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న జలాల్లోనూ న్యాయ బద్ధంగా దక్కే వాటాల అంశాన్నీ చర్చించనుంది. అలాగే పోలవరంతో తెలంగాణలో ఉండే ముంపుపై పూర్తిస్థాయి అధ్యయనం అవసరాన్ని నొక్కి చెప్పాలని, దీనిపై చర్చించాలని కోరనుంది. పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్టుల కింద అదనపు నీటి వినియోగాన్ని తగ్గించేలా టెలిమెట్రీ వ్యవస్థను త్వరగా అమల్లోకి తెచ్చే అంశాన్ని ఎజెండాలో చేర్చింది. -
మేడారం అభివృద్ధికి రూ.200కోట్లు
-
'సమ్మక్కే నన్ను ఇక్కడకు రప్పించుకుంది'
సాక్షి ప్రతినిధి, వరంగల్: భవిష్యత్‌లో మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామని, ఇందులో భాగంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టేందుకు బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించబోతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మేడారానికి జాతీయ హోదా కల్పించాల్సిన అవసరం ఉందని, దీనిపై తానే స్వయంగా ప్రధాని మోదీతో మాట్లాడతానని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో అనేక అంశాలతో పాటు మేడారం జాతర కూడా నిర్లక్ష్యానికి గురైందని, అందువల్లే ఇక్కడ సరైన సౌకర్యాలు లేవన్నారు. శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మ వన దేవతలను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కోట్లాది మంది భక్తులు వచ్చే మేడారంలో భక్తులకు కనీస సౌకర్యాలు లేవన్నారు. గతంలో రెండేళ్లకోసారి జాతర జరిగేదని, ప్రస్తుతం ప్రతీరోజు భక్తులు వస్తున్నందున సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈరోజు సమ్మక్క తనను ఇక్కడకు రప్పించుని ఈ మాటలు చెప్పిస్తోందంటూ.. ‘‘మేడారంలో శాశ్వత ప్రతిపాదికన ఏర్పాట్లు చేసేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తాం. ఈ బడ్జెట్లోనే ఈ నిధులు మంజూరు చేస్తాం. జాతరకు సంబంధించి తగిన ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖకు ఇక్కడ తగినంత స్థలం అందుబాటు లేదు. జాతర ఏర్పాట్ల కోసం కనీసం 200 నుంచి 300 ఎకరాల స్థలం కావాలి. ఎంత ఖర్చయినా ఇక్కడ భూమిని సేకరించాలని అధికారులకు చెబుతాను. జాతర ముగిసిన తర్వాత పదిహేను రోజుల్లో మరోసారి మేడారం వచ్చి అధికారులతో మాట్లాడతా..’’ అని అన్నారు. జంపన్నవాగులో ఎప్పుడూ పరిశుభ్రమైన నీరు ఉండేలా డ్యామ్ నిర్మిస్తామని చెప్పారు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే గత జాతరకు రాలేకపోయానని పేర్కొన్నారు. వీర వనితల పోరాటానికి ప్రతీక మేడారం జాతర అని అన్నారు. జాతీయ హోదా ఇవ్వాల్సిందే తెలంగాణతోపాటు ఏడు రాష్ట్రాలకు చెందిన భక్తులు మేడారం వస్తున్నారని, నిన్ననే ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ మేడారం జాతరకు వచ్చి వెళ్లారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎంపీలు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన రాలేదన్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చే మేడారం జాతర దక్షిణ భారతదేశానికి కుంభమేళా వంటిందని, ఉత్తరాదిన కుంభమేళాకు చేస్తున్న ఏర్పాట్ల తరహాలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. మేడారానికి జాతీయ హోదా కల్పించే విషయంలో ప్రధాని మోదీతో తానే స్వయంగా మాట్లాడతానని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి గతంలో ఉద్యమం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం రావాలని సమ్మక్కకు మొక్కుకోగా.. అది తీరిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈసారి తెలంగాణను సుభిక్షం చేసేందుకు తాము నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాలని సమ్మక్కకు మొక్కుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రాజెక్టులకు అడ్డం పడే దుర్మార్గులకు బుద్ధి చెప్పాలని మొక్కుకున్నానని చెప్పారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసిన మంత్రులు, అధికారులను సీఎం అభినందించారు. జాతర నిర్వహణలో పోలీసులు–మీడియా మధ్య సమన్వయ లోపం వల్ల ఇబ్బంది వచ్చిందని, అందుకు చింతిస్తున్నానని అన్నారు. - వన దేవతలకు సమర్పించేందుకు బంగారం(బెల్లం)తో వస్తున్న సీఎం కేసీఆర్ -
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని వెల్లడించారు. ప్రాజెక్టును అడ్డుకోవాలని ఎన్ని శక్తులు ప్రయత్నించినా.. వాటిని అధిగమించి ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. -
హైదరాబాద్–బీజాపూర్.. ఓ రోడ్డు కథ
► ప్రమాద రహిత రహదారిగా అభివృద్ధికి 2011లో నిర్ణయం ► ఉచితంగా రూ.59 కోట్లు ఇచ్చిన ప్రపంచ బ్యాంకు ► ఆరేళ్లుగా పడకేసిన పనులు ► ఇప్పుడదే రోడ్డుకు జాతీయ హోదా.. 450 కోట్లతో అంచనా ► మరి ఈ పనులు ఎప్పటికి చేస్తారనే సందేహాలు సాక్షి, హైదరాబాద్: ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక సౌకర్యాలు తప్పనిసరి. అందులోనూ మంచి రోడ్లు ఉండాల్సిందే. మరి మంచి రోడ్డు అంటే ఏంటి..? కేవలం రోడ్డు నిర్మించడం మాత్రమేగాకుండా దానిని పూర్తిగా ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలి. ప్రమాదాలు జరిగినా వెంటనే పూర్తిస్థాయిలో అత్యవసర వైద్యం అందజేసే ఏర్పాట్లు ఉండాలి. ఇలాంటి నమూనా రహదారిని చూపుదామంటూ ప్రపంచబ్యాంకు ముందుకొచ్చింది. 2011లో ‘హైదరాబాద్–బీజాపూర్’ రహదారిని ఎంపిక చేసి.. ఉచితంగా నిధులు కూడా ఇచ్చింది. కానీ ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో ఆరేళ్లయినా పనులు పూర్తికాలేదు. 2011 నుంచి సాగుతూనే.. తన వద్ద రుణాలు తీసుకున్న దేశాలు/రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంకు అప్పుడప్పుడు నజరానాలు ఇస్తుంటుంది. ఆ క్రమంలోనే 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రమాదరహిత రహదారుల అభివృద్ధి కోసం ఉచితంగా నిధులిచ్చింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులతో ఆంధ్రా ప్రాంతంలో రెండు రోడ్లను, తెలంగాణలో ఒక రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇలా హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బీజాపూర్ వరకు ఉన్న రహదారిని ఎంపిక చేయగా.. ప్రపంచబ్యాంకు రూ.59 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో హైదరాబాద్ శివార్లలోని పోలీస్ అకాడమీ దగ్గరి నుంచి మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, కొడంగల్ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు 126 కిలోమీటర్ల రహదారిని మెరుగుపర్చాలి. సరిహద్దు నుంచి బీజాపూర్ వరకు పనులను కర్ణాటక నిర్వహిస్తుంది. ఏం చేయాలి..? ఈ ప్రమాద రహిత రహదారుల్లో అకస్మాత్తు మలుపులు ఉండొద్దు, కూడళ్లు విశాలంగా ఉండాలి, అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తించేందుకు లేజర్ గన్స్ ఏర్పాటు చేయాలి, హైవే పెట్రోలింగ్ వాహనాల పహారా ఉండాలి, ప్రమాదాలు జరిగితే వెంటనే అత్యవసర చికిత్స అందేలా ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలి.. ఈ మేరకు హంగులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రహదారుల శాఖ, పోలీసు, వైద్య ఆరోగ్యం, రవాణా తదితర విభాగాల ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. మూడు పెద్ద కూడళ్లు, 21 మలుపులను గుర్తించినా.. కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. ఇక అవసరమైన ఎనిమిది హైవే పెట్రోలింగ్ వాహనాలు ఎలా సమకూర్చాలా అన్న తర్జనభర్జనలోనే పోలీసు శాఖ ఉండిపోయింది. రెండు అంబులెన్సులు, ట్రామాకేర్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి వైద్యారోగ్య శాఖ ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. ఇంతలో ఆరేళ్లు గడిచి.. గడువు పూర్తికావడంతో.. విజ్ఞప్తి చేసి మరింత సమయం పొందారు. అయినా పనులేవీ సరిగా జరగడం లేదు. అంబులెన్సులు కొంటే నిర్వహణ బాధ్యత ఎలాగో తేలక చివరకు 108కే అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఆగిపోయారు. కొత్త ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి.. ఈ రోడ్డుతో సంబంధంలేని తాండూరు ఆసుపత్రిని వాడుకోవాలని నిర్ణయించారు. ఇక పోలీసుశాఖ రెండు చోట్ల ఔట్‌పోస్టు భవనాలు నిర్మించినా.. వాటిల్లో సిబ్బందిని, పరికరాలను ఏర్పాటు చేయలేదు. మొత్తంగా ‘ప్రమాద రహిత’ పనులు ప్రమాదంలో పడిపోయాయి. జాతీయ రహదారి సంగతేం చేస్తారో..? ఇటు ‘ప్రమాద రహిత రహదారి’ పనులు పూర్తికానే లేదు. ఈ ఏడాది మార్చిలో ఈ రోడ్డుకు జాతీయ రహదారి హోదా వచ్చింది. ఇది రూ.450 కోట్ల ప్రాజెక్టు. ఆ ప్రక్రియ అయితే ఇప్పటికీ మొదలుకాలేదు. దీనిని రెండు భాగాలుగా విభజించగా.. తొలి భాగానికి సంబంధించి కావాల్సిన భూమి ఎంతో కూడా తేల్చకపోవడం గమనార్హం. -
కేసీఆర్‌కు దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్ సిటీ: రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయహోదాను సాధించే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందా అని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరంపై ప్రజాభిప్రాయసేకరణ సందర్భంగా ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్టుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తున్నదని విమర్శించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ నేతలకు తగిన సమయంలో ప్రజలే బుద్దిచెప్తారని హెచ్చరించారు. శ్రీధర్‌బాబు అరెస్టు అప్రజాస్వామికమన్నారు. జాతీయహోదా సాధించడం చేతకాని ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో ప్రశ్నించేవారిపై పోలీసులతో దాడులు చేయించడం దారుణమని పొంగులేటి అన్నారు. -
మేడారం జాతరకు జాతీయ హోదా!!
హన్మకొండ: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర. ఈ జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం హన్మకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మేడారం జాతర ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేశామని, కేంద్ర గిరిజన శాఖ మంత్రిని కూడా జాతరకు ఆహ్వానించామని తెలిపారు. ఈ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. ఈ విషయంలో ఎంపీగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తానన్నారు. జాతరపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డాక్యుమెంటరీ రూపొందిస్తామని, ఈ డాక్యుమెంటరీ ద్వారా మేడారం జాతర విశిష్టతను, ప్రాశస్త్యాన్ని జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాల పాలనలో జాతర పనులు సక్రమంగా జరిగేవి కావని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు మందుగానే మంజూరుచేసి పనులు ముమ్మరం చేసిందన్నారు. జాతరకు 15 రోజుల ముందే పనులు పూర్తి కానున్నాయన్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నారని చెప్పారు. వరంగల్ జిల్లాలో గిరిజన విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై విచారణ పూర్తయితేనే వాస్తవాలు తెలుస్తాయని, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన విద్యార్థినుల తల్లిదండ్రులపై కేసు పెట్టిన అంశాన్ని పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీ పసునూరి దయాకర్, తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ కోరబోయిన విజయ్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్‌బాస్కర్ పాల్గొన్నారు. -
'ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించాలి'
ఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ప్రాజెక్టు డిజైన్ నివేదిక ఇస్తామని అన్నారు. అలాగే పత్తి మద్దతు ధర పెంచాలని కోరినట్టు తెలిపారు. తెలంగాణలో గోదాముల నిర్మాణానికి సహకరించాలని కేంద్రాన్ని కోరినట్టు హరీశ్‌రావు చెప్పారు. -
ప్రాణ‘హితం’ ఎలా?
-
ప్రాణ‘హితం’ ఎలా?
ప్రత్యామ్నాయాలపై కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష హైదరాబాద్: ‘ప్రాణహిత-చేవెళ్ల’కు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టుపై సుదీర్ఘ సమీక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో రాత్రి 11.30 గంటల వరకు దాదాపు ఆరున్నర గంటల పాటు ఇది కొనసాగింది. నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు, ఢిల్లీ నుంచి వచ్చిన సర్వే సంస్థ వ్యాప్కోస్ చైర్మన్ సహా ఇతర ప్రతినిధులు, రాష్ట్ర అధికారులతో కేసీఆర్ చర్చించారు. ప్రత్యామ్నాయ ప్రాజెక్టు సర్వే నివేదికను వీలైనంత త్వరగా అందజేయాలని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి కోరిన మీదట ముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ముంపు ప్రాంతాల సాకుతో ప్రాజెక్టు పాత డిజైన్‌పై పొరుగున ఉన్న మహారాష్ట్ర అభ్యంతరం తెలుపుతున్న దృష్ట్యా కొత్త ప్రతిపాదనలపై రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో గోదావరిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నుంచి 116 కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్లంపల్లికి కాకుండా, 110 కిలోమీటర్ల దూరాన ఉన్న కాళేశ్వరం దిగువన మేటిగడ్డకు నీటిని మళ్లించాలని భావిస్తోంది. ఈ మేరకు కొత్త డిజైన్‌పై సమగ్ర నివేదిక తయారీ బాధ్యతను వ్యాప్కోస్ సంస్థకు కట్టబెట్టింది. ఈ సంస్థ ఇంజనీర్లు 20 రోజులుగా మేటిగడ్డ ప్రాంతం లో నీటి లభ్యత, ప్రవాహ పరిమాణం, పర్యావరణ అనుకూలతలు తదితరాలపై సర్వే చేస్తున్నారు. ఈ నివేదిక రావడానికి మూడు నెలల సమయం పడుతుందని గతంలోనే సర్వే సంస్థ వెల్లడించింది. అయితే శుక్రవారం ఢిల్లీలో సీఎంతో భేటీ సందర్భంగా ప్రత్యామ్నాయ ప్రతిపాదనల నివేదికను తమకు త్వరగా సమర్పించాలని కేంద్ర మంత్రి ఉమాభారతి సూచించారు. దీంతో ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రాగానే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పనుల పురోగతిపై ఆరా తీశారు. సమావేశ వివరాలు బయటకు తెలియరాకున్నా, వీలైనంత త్వరగా నివేదికను అందజేయాలని సీఎం సూచించిన ట్లు సమాచారం. అయితే తమ కు కనీసం రెండు నెలల సమయం కావాలని వ్యాప్కోస్ ప్రతినిధులు స్పష్టం చేసినట్లు తెలిసింది. జాతీయ హోదా ప్లీజ్ న్యూఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి రాష్ర్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రమశక్తి భవన్లో ఆయన కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. పార్టీ ఎంపీ కవిత, రాష్ర్ట నీటిపారుదల శాఖ సలహాదారుడు విద్యాసాగర్‌రావు, కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరాం, ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు మాదిరిగా తెలంగాణలోనూ ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకం అమలు, దానిప్రయోజనాలను కేసీఆర్ వివరించారు. వరంగల్‌లో నిర్మించిన మిషన్ కాకతీయ స్తూపం ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఉమాభారతిని ఈ సందర్భంగా ఆహ్వానించారు. అలాగే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రావాల్సిన రూ. 297 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు ఏఐబీపీ(ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం) కింద రావాల్సిన పెండింగ్ నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని అంశాలను కేంద్ర మంత్రి సానుకూలంగా విన్నారని ఈ సమావేశం అనంతరం ఎంపీ కవిత మీడియాకు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని కాంక్షించిన వ్యక్తిగా, తెలంగాణలోనూ ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న ఆకాంక్షతో ఉన్నట్లు ఉమాభారతి చెప్పారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఏఐబీపీ నిధుల విడుదలకు మంత్రి సుముఖత వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు. రాష్ర్టంలో ఓ జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలన్న ఆకాంక్షతో కేంద్రం ఉందని, దానికి అనుగుణంగా ప్రాణహిత-చేవెళ్ల లే దా మరేదైనా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ర్టం తరఫున పంపిస్తామన్నారు. ఏ అంశంలోనైనా పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవడం తమకు ఇష్టం లేదని కవిత వ్యాఖ్యానించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలోనూ భ విష్యత్తులో మహారాష్ట్రతో ఇబ్బందులు రాకుండా చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. కాగా, కేసీఆర్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగివెళ్లారు. -
ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా ఇవ్వండి: కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు త్వరగా జాతీయ హోదా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని బుధవారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు, కేసులు ఉన్నప్పటికీ జాతీయ హోదా దక్కిందని, అయితే ప్రాణహిత విషయంలో ఇంకా జాప్యం జరుగుతోందన్నారు. జాతీయ జలవనరుల మరమ్మతులు, ఆధునీకరణ, సంరక్షణ ప్రాజెక్టు(ఆర్ఆర్ఆర్) పథకం కింద తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్‌కాకతీయ పనులను స్వయంగా వీక్షించాలని కోరా రు. జాతీయహోదా ప్రకటన ప్రక్రియను వేగవంతం చేయడంపై, ఆర్ఆర్ఆర్ నిధుల కేటాయింపుపై మంత్రి సానుకూలంగా స్పందించారని కవిత మీడియాకు తెలిపారు. -
'అర్హతలన్నీ ఉంటేనే ప్రాణహితకు జాతీయ హోదా'
న్యూఢిల్లీ: సాంకేతికంగా, ఆర్థికంగా ఆచరణసాధ్యంగా ఉండటంతోపాటు జాతీయ ప్రాజెక్టుకు ఉండాల్సిన అర్హతలను సంతృప్తిపరిస్తేనే ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా వస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు కూడా రావాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్ లాల్ జాట్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. -
‘ప్రాణహిత’పై నేడు ఢిల్లీకి విద్యాసాగర్‌రావు
హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయమై కేంద్ర జల సంఘం అడిగిన హైడ్రాలజీ లెక్కలపై వివరణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు గురువారం (నేడు) ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన శుక్రవారం కేంద్ర జల సంఘం చైర్మన్ ఏబీ పాండ్యాతో సమావేశమై హైడ్రాలజీ లెక్కలపై చర్చించనున్నారు. -
జాతీయ హోదాకు ఓకే!
-
జాతీయ హోదాకు ఓకే!
* ప్రాణహిత ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సుముఖత * మరోవారం రోజుల్లో అన్ని అంశాలపై చర్చిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హామీ * కొత్త రాష్ట్రానికి కేంద్రం సహకారం ఉంటుందని వెల్లడి * కేంద్రమంత్రితో సీఎం భేటీ.. ప్రాజెక్టులపై చర్చ * పోలవరం డిజైన్ మార్చాలని విన్నపం * దేవాదులకు తొలి విడతగా రూ. 64 కోట్ల విడుదలకు కేంద్రమంత్రి అంగీకారం * ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, దేవాదుల ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు పార్లమెంట్‌కు వెళ్లిన కేసీఆర్.. అక్కడ టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. విభజన చట్టంలోని హామీలను సాధించేం దుకు ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో చర్చించినట్టు సమాచారం. అనంతరం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభ పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, కవిత, బూర నర్సయ్యగౌడ్, సీతారాం నాయక్, బాల్క సుమన్, బీబీ పాటిల్, నగేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, తేజావత్ రామచంద్రుడు, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం వ్యక్తిగత కార్యదర్శి నర్సింగరావుతో కలిసి శ్రమశక్తి భవన్‌కు వెళ్లి కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరాంతోపాటు ఆ శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోండి.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్.. ఉమాభారతిని కోరారు. ఈ సందర్భంగా ఇందులో సాంకేతిక సమస్యలపై రాష్ట్ర, కేంద్ర జలవనరుల శాఖల అధికారులతో ఉమాభారతి చర్చించారు. ప్రధానంగా విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ప్రస్తావించగా, అందుకు కేసీఆర్ స్పందిస్తూ.. విద్యుత్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ‘ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రాతో ఏం లడాయి లేదుగా..’’ అని కేంద్రమంత్రి అడిగారు. ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం చెప్పారు. తర్వాత ఉమాభారతి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణకు కూడా జాతీయ ప్రాజెక్టు ఉండాలని నేను చాలా ఆత్రుతతో ఉన్నా. మా అధికారులతో వీలైనంత త్వరగా చర్చిస్తా. మేం చాలా సానుకూలంగా ఉన్నాం. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహాలు వద్దు’’ అని పేర్కొన్నారు. తెలంగాణలో దేవాదుల పూర్తి చేసేందుకు కూడా సహకరించాలని సీఎం కోరగా.. ఈ ప్రాజెక్టుకు వారం రోజుల్లో మొదటి విడత కింద రూ.64 కోట్లు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చండి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణకు అభ్యంతరాలు లేవని, అయితే కేంద్రం నిర్ణయంతో మూడు లక్షల మంది గిరిజనులు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్.. ఉమాభారతి దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న చోటు దేశంలోనే రెండో భూకంప తీవ్రత కల్గిన ప్రాంతంగా నివేదికలు వచ్చాయని, డిజైన్ మార్చాలని కోరారు. ఇందుకు మంత్రి ఉమాభారతి స్పందిస్తూ.. ‘పోలవరం విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవచ్చు కదా’ అని సూచించారు. అందుకు కేసీఆర్ స్పందిస్తూ.. దీనిపై చర్చించుకునేందుకు తమకేం ఇబ్బంది లేదన్నారు. అనంతరం చెరువులు, కుంటలను అనుసంధానం చేసే ‘మిషన్ కాకతీయ’ గురించి వివరించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. ప్రతి ఇంటికీ మంచినీటి నల్లా వేసే కార్యక్రమం గురించి సీఎం చెప్పగా.. కేంద్రం తరఫున సహకారం అందిస్తామని మంత్రి హామీనిచ్చారు. సమావేశం అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌కి బయలుదేరి వెళ్లారు. రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్ చేరుకున్నారు. సానుకూలంగా స్పందించారు: కవిత తెలంగాణకు కేంద్ర జలవనరుల శాఖ నుంచి సహకారం ఉంటుందని ఉమాభారతి హామీ ఇచ్చినట్టు టీఆర్ఎస్ ఎంపీ కవిత చెప్పారు. తెలంగాణ నా బిడ్డ లాంటిది: ఉమాభారతి ‘‘తెలంగాణ నాకు బిడ్డ లాంటిది. ఉద్యమంలో నేను మా పార్టీ తరపున వచ్చాను. తెలంగాణ పదం వింటేనే నా నోరు తీపి అవుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తన కాళ్లమీద తాను నిలబడేందుకు నా శాఖ తరఫున పూర్తిగా సహకరిస్తా’’ అని సీఎం కేసీఆర్‌తో ఉమాభారతి అన్నారు. ఇందుకు సీఎం.. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు హైదరాబాద్‌లో నా ఇంటికి వచ్చి ఆశీర్వదించారు. అప్పుడు నేను మీకు మొక్కిన ఫొటోనే పెద్దగా చేసి పెట్టుకున్నాను’’ అని గుర్తు చేశారు. ‘‘అప్పట్లో వార్తా పత్రికల్లోనూ ఆ ఫొటో పెద్దగా వచ్చింది. నాకు ఇంకా గుర్తుంది. అయినా అందులో తప్పేం లేదు. సోదరికి, సోదరి కూతుళ్లకు మొక్కడం మన సంప్రదాయం. కవిత నాకు కోడలు లాంటిది’’ అని మంత్రి ఆత్మీయంగా అన్నారు. ‘‘తెలంగాణ పేరిట ఉద్యమం చేసి చాలా మంది సీఎంలు అయ్యారు. ఆ తర్వాత వాళ్లంతా తెలంగాణకు శత్రువులుగా మారిపోయారు. మీరు మాత్రం ఎంతో తపస్సు చేసి తెలంగాణ సాధించుకున్నారు’’ అని కేసీఆర్‌ని అభినందించారు. -
ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి కొత్తగూడెం: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కలలుగన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కోరనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారన్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అంశాల వారీగా పార్లమెంట్లో ప్రస్తావించనున్నట్లు తెలి పారు. ఇటీవల విషజ్వరాలతో అనేకమంది మృత్యువాత పడ్డారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివరించారు. రాష్ట్ర విభజనకు పూర్వం ముంపు మండలాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఓటు వేశారని, ఇప్పుడు వారి సమస్యలను ప్రస్తావించేందుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముంపు మండలాల ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ ఏర్పాటు కోసం పార్లమెంట్లో ప్రస్తావిస్తానన్నారు. బంగారు తెలంగాణ తెస్తామని అనేక హామీలు గుమ్మరించిన కేసీఆర్ ఇప్పుడు ఆ హామీలను విస్మరిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తికాకపోవడం వల్ల అధికారుల కొరత ఉందని, అందువల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించడం విడ్డూరం అన్నారు. ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రబీలో వరి సాగు చేయవద్దని ప్రకటించిన కేసీఆర్ జూన్ 2వ తేదీనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఖరీఫ్ సాగు వద్దని రైతులను కోరితే ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు కాదన్నారు. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యతోపాటు ప్రస్తుతం నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. సీసీఐ ద్వారానే పత్తి కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని పొంగులేటి పేర్కొన్నారు. పత్తి క్వింటాలుకు రూ.4,050 చొప్పున కొనుగోలు చేయాలని కోరతామన్నారు. -
ప్రాణహితకు.. ప్రాణం!
సాక్షి, మంచిర్యాల : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు జీవం పోసుకోనుంది. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న ప్రభుత్వ డిమాండ్ త్వరలో నెరవేరేలా ఉంది. దీంతో ప్రాజెక్టుపై రైతులు పెట్టుకున్న ఆశలు ఫలించనున్నాయి. జిల్లా పరిధిలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిస్తున్న ‘బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి’ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రం సిద్ధమైంది. జాతీయ హోదా కల్పించేందుకు అవసరమైన కీలక నివేదికలు వీలైనంత త్వరగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివేదిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని చేజారనీయకుండా అవసరమైన నివేదిక రూపకల్పన కోసం కేంద్రంతో చర్చిస్తున్నారు. మొత్తం 18 విభాగాల నుంచి అనుమతులు తీసుకొస్తే.. కేంద్ర జల వనరుల శాఖ ప్రాణహితకు జాతీయ హోదా అనుమతి ఇస్తుంది. ఇప్పటి వరకు 13 విభాగాల నుంచి అనుమతులు రావడంతో మిగిలిన ఐదు విభాగాల నుంచి క్లియరెన్స్ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాధికారులు తలమునకలయ్యారు. ప్రాజెక్టు జాతీయ హోదా పొందితే నిధుల కొరతతో పడ కేసిన ప్రాణహిత నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతాయి. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యయంలో 90 శాతం నిధులు కేంద్ర ఆర్థిక సహాయ మండలి భరిస్తుంది. దీంతో పనులకు ఆటంకం లేకుండా పూర్తవుతాయి. నిధుల సమస్యకు తెర..! జలయజ్ఞంలో భాగంగా తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 డిసెంబర్ 16న రూ.38,500 కోట్ల అంచనాతో జిల్లా పరిధిలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేపట్టారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు వ్యయం రూ.43,500 కోట్లకు చేరింది. ఆ మహానేత హయాంలోనే ఇన్వెస్టిగేషన్, మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ప్రాజెక్టు కోసం రూ.1,025 కోట్లు ఖర్చు చేశారు. 2010-11 బడ్జెట్లో రూ.700 కోట్లు కేటాయించి రూ.33.57 కోట్లు విడుదల చేశారు. 2011-12 బడ్జెట్లో రూ.608.28 కోట్లు ప్రకటించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2012-13లో రూ.1,050 కోట్లు, 2013-14లో రూ.780 కోట్లు కేటాయించారు. వాటిలో నామమాత్రంగా ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేస్తున్న అరకొర నిధులతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. తెలంగాణలోని ఏడు జిల్లాలకు సాగు నీరందించి.. ప్రజల దాహార్తి తీర్చే బృహత్తర ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురవుతున్న నిధుల సమస్యకు పరిష్కారం లభించాలంటే జాతీయ హోదా కల్పించాలని ఎనిమిదేళ్లుగా పాలకులు, రైతులు కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు. తాజాగా ఆ దిశగా కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో అందరిలోనూ సంతోషం వ్యక్తమవుతోంది. మరో 50 వేల ఎకరాలు పెరిగిన లక్ష్యం.. ప్రాజెక్టు ఆరంభంలో జిల్లాలో ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరందించేందుకు గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఇటీవల జిల్లాలో నిర్వహించిన కొమురం భీమ్ వర్ధంతి వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆ లక్ష్యాన్ని మరో 50 వేలకు పెంచారు. ఇప్పుడు పూర్తిస్థాయి లక్ష్యం 1.50 లక్షలకు చేరింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే.. తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల వరకు 69.5 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతుతో మొత్తం 400 కాలువలు తీసి.. వాటి ద్వారా తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని మళ్లించనునున్నారు. దీంతో ప్రజల దాహార్తికీ తెరపడనుంది. తొలి విడతగా జిల్లాలోని కౌటాల మండలం రణవెల్లి నుంచి బెజ్జూరు మండలం కర్జోలీ వరకు కాలువలు తవ్వారు. రెండో విడతలో.. కర్జోలి నుంచి నెన్నెల మండలం మైలారం వరకు కాలువలు తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా విడతలుగా కాలువలు తీసి సాగు నీరందించనున్నారు. -
ప్రాణహితకు జాతీయ హోదా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరుతో పాటు తెలంగాణలోని దాదాపు సగం జనాభాకు తాగునీరును అందించే ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ‘బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి’ పథకంగా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తన సానుకూలతను వ్యక్తపరిచిన కేంద్ర ప్రభుత్వం... తాజాగా దీనికి సంబంధించి పలు కీలకమైన నివేదికలను వీలైనంత త్వరగా తమకు సమర్పించాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై ఆయా నివేదికల తయారీపై కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వంతో అవసరమైన సంప్రదింపులు, కార్యాచరణలో మునిగి తేలుతున్నారు. తెలంగాణలోని ఏడు కరువు పీడిత జిల్లాలకు నీటిపారుదల సదుపాయాన్ని కల్పించేందుకు 2008లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు మెజారిటీ ప్రజల దాహార్తిని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకూ నిర్మించే ఈ భారీ ప్రాజెక్టు కోసం.. దాదాపు రూ. 40 వేల కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో సార్లు విజ్ఞప్తులు కూడా చేశారు. జాతీయ హోదా పొందితే నిర్మాణ వ్యయంలో 90 శాతాన్ని కేంద్ర ఆర్థిక సహాయ మండలి భరిస్తుంది. ప్రాజెక్టుకు మొత్తం 18 విభాగాల నుంచి అనుమతులు తెచ్చుకుంటేనే కేంద్ర జల వనరుల శాఖ జాతీయ హోదాకు అనుమతిస్తుంది. ఇందులో ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు ఇప్పటికే నీటి పారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలు, సెంట్రల్ ఆసియల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, యంత్ర నిర్మాణ సంప్రదింపు సంస్థ, వ్యవసాయ శాఖ అనుమతులు లభించాయి. ఇక సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ రాష్ట్రంలోనే ఉండటంతో.. బ్యారేజీ కాలువల డిజైన్, గేట్లు, హైడ్రో సివిల్ డిజైన్, కాంక్రీట్ మాసోనరీ డ్యామ్ డిజైన్ వంటి మూడు నాలుగు అంశాల్లో కేంద్రం ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. గిరిజన సలహా మండలి ఆమోదం ప్రాజెక్టులకు సంబంధించి గిరిజన వ్యవహారాల శాఖ అనుమతి అత్యంత ముఖ్యమైనది. అత్యంత సున్నితమైన ఈ అంశానికి ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురయ్యే గిరిజన గ్రామాల ప్రజల ఆమోదం తప్పనిసరి. అక్కడి ప్రజల సమ్మతి తెలుపుతూ రాష్ట్ర గిరిజన సలహా మండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఈ మేరకు ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు సంబంధించి శనివారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గిరిజన సలహా మండలి ఏకగ్రీవంగా సమ్మతి తెలిపింది. మండలి తీర్మాన కాపీని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ద్వారా కేంద్ర గిరిజన శాఖకు సోమ లేదా మంగళవారం పంపనున్నారు. మరో నెల, నెలన్నర రోజుల్లో అన్నీ పూర్తి చేసి కీలక శాఖల అనుమతులను కేంద్ర జల సంఘానికి అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని ప్రభుత్వంలోని కీలక నేత ఒకరు వెల్లడించారు. ఇంకో ఐదు అంశాల్లో అనుమతులొస్తే.. ఐదు కీలకమైన అంశాలపై ఈ ప్రాజెక్టుకు వివిధ శాఖల నుంచి అనుమతులు పొందాలి. ఇందులో హైడ్రాలజీ(లభ్యమయ్యే నీరు), వ్యయ అంచనా, పర్యావరణ, అటవీ, గిరిజన వ్యవహారాలు, నీటి వనరుల శాఖల అనుమతులు అవసరం. హైడ్రాలజీకి సంబంధించి 1941 నుంచి 2003 మధ్య గల నీటి సమాచారాన్ని (వాటర్ డాటా) ఈ నెల 14న అందజేశారు. హైడ్రాలజీ విభాగం పరిశీలనలో ఉన్న ఈ అంశానికి సంబంధించి మరిన్ని సమగ్ర వివరాలను తెలియజేసేందుకు ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ మంగళవారం ఢిల్లీకి వె ళుతున్నారు. కేంద్ర జల సంఘం చైర్మన్ ఏబీ పాండ్యాతో వారు చర్చలు జరుపనున్నారు. ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి.. డీపీఆర్ ప్రకారం రూ.40,300 కోట్లుగా అంచనా వేశారు. ఈ వ్యయంపై కేంద్ర జల సంఘం కొన్ని వివరణలు కోరుతుండగా ఢిల్లీలోనే ఉన్న అధికారులు, సర్వే సంస్థ వ్యాప్కోస్ ప్రతినిధులు ఎప్పటికప్పుడు వివరణ అందజేస్తూ, చర్చలు జరుపుతున్నారు. పర్యావరణ, అటవీ శాఖ పరిధిలో రెండు రకాల అనుమతులు అవసరం ఉండగా... అందులో తొలి దశకు ఇప్పటికే క్లియరెన్స్ దక్కింది. అత్యంత కీలకమైన రెండో దశ అనుమతికి ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి ఉంది. తెలంగాణలో ఈ ప్రక్రియ పూర్తయినా మహారాష్ట్రలో ఇంకా జరగాల్సి ఉంది. ఇంతకుముందే ఒక సారి ఈ విషయమై మహారాష్ట్రతో చర్చలు జరిగాయి. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మరోసారి సంప్రదింపులు జరపాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు నిర్ణయించారు. అటవీ అనుమతుల కోసం ప్రాజెక్టు కింద ఎంత అటవీ భూమి పోతోందో అంత భూమి పరిహారంగా అటవీ శాఖకివ్వాలి. ఇందుకు సంబంధించి మొత్తం 7,673 ఎకరాల భూమి అవసరమని లెక్కతేల్చారు. ప్రస్తుతం సర్వే పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. దీనిని మరో వారం రోజుల్లో పూర్తి చేసి అటవీశాఖ ప్రధాన కార్యదర్శి ద్వారా కేంద్రానికి అందించనున్నారు. ప్రాజెక్టుకు కీలకమైన గిరిజన వ్యవహారాల శాఖ అనుమతి వచ్చేసింది. అయితే దీనిని ఇంకా కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. -
'దుమ్ముగూడెం'ను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించాలి: వైఎస్ జగన్
-
'దుమ్ముగూడెం'ను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించాలి: వైఎస్ జగన్
హైదరాబాద్: దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టేల్పాండ్ ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని లేఖలో ప్రధాని మోడీని వైఎస్ జగన్ కోరారు. ఖమ్మం, వరంగల్ , పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 4 లక్షల ఎకరాలు ఈ ప్రాజెక్ట్‌తో సాగులోకి వస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
‘ప్రాణహిత’కు జాతీయ హోదా కల్పించాలి
నల్లగొండ టుటౌన్ : రాష్ట్రంలోని 6 జిల్లాల్లో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించి సస్యశామలం చేసేందుకు రూపొందించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక మఖ్దూం భవన్లో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. శ్రీశైలం సొరంగ మార్గాన్ని పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. లక్ష రూపాయల వరకు రుణమాఫీని వెంటనే చేయాలన్నారు. పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడానికి స్థానిక నాయకులు చొరవ చూపాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. అనంతరం భువనగిరి సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లులో కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలుపుతూ సమ్మె పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తీర్మానించారు. పార్టీ శాసన సభాపక్ష నాయకుడు రమావత్ రవీంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు గులాం రసూల్, గోద శ్రీరాములు, వి.రత్నాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, జి.పాండరి, కేవీఎల్, వై.దామోదర్‌రెడ్డి, ఎల్.శ్రవణ్‌కుమార్, పల్లా దేవేందర్‌రెడ్డి, చేడే చంద్రయ్య, బి.భూపాల్, సృజన తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రాణహిత’ పై టాస్క్ఫోర్సు
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హరీష్‌రావు హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల పథకానికి జాతీయ హోదా సాధించడానికి టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి టి. హరీష్‌రావు తెలిపారు. వీలైనంత తొందరగా జాతీయహోదా లభించేలా ఈ బృందం కృషి చేస్తుందన్నారు. ఆదివారం వుంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయున వూట్లాడారు. భూగర్భ జల మట్టాన్ని పెంపొందించేందుకు చెక్‌డ్యాంలను నిర్మిస్తామని, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరిస్తామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సభాగౌరవాన్ని పెంచే విధంగా శాసనసభ సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. సభ జరిగే రోజుల్లో ఎక్కువ మంది సభ్యులు హాజరయ్యేలా చూస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన హరీష్‌రావును పలువురు మంత్రులు, శాసనసభ్యులు కలసి అభినందించారు. -
రెండు రోజుల్లో 'పోలవరం' కు జాతీయ హోదా
రెండు రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వెల్లడించారు. శనివారం సొంత నియోజకవర్గమైన ఏలూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ... విజయవాడ - గుంటూరు నగరాల మధ్య సీమాంధ్రకు రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ తరపున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేస్తానని కావూరి సాంబశివరావు తెలిపారు. -
పోలవరంపై ఢిల్లీకి అధికారులు!
అనుమతుల పెండింగ్ అంశం కేంద్రం దృష్టికి.. సంబంధిత ఫైళ్లకు తక్షణంక్లియరెన్స్ పొందడమే లక్ష్యం ముంపు గ్రామాల పరిస్థితి, జాతీయ హోదాపై మరింత స్పష్టత కోసం... సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై మరింత స్పష్టత కోసం దేశరాజధాని ఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యేక అధికారుల బృందం సిద్ధమైంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టు ముంపు గ్రామాలు, మండలాలు, జాతీయ హోదా వంటి విషయాలపై ఒక అంచనాకు రావడానికి వీలుగా ఈ బృందం ఢిల్లీ పర్యటనకు వెళుతోంది. ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ బృందం శనివారం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం ముంపు ప్రాంతంపై ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తి, ప్రాజెక్టు పనులపై ప్రభావం చూపకుండా ఉండేందుకు వీలుగా సదరు గ్రామాలను సీమాంధ్రలో కలపడానికి వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. అలాగే జాతీయ హోదా కింద ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని తామే భరిస్తామని కేంద్రం ఇంతకు ముందే ప్రకటించింది. అందుకు అవసరమైన అన్ని రకాల అనుమతులను కూడా పొందుతామని పేర్కొంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇంకా కొన్ని తుది అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా అటవీ, పర్యావరణ శాఖకు సంబంధించి తుది క్లియరెన్స్‌లను పొందాల్సి ఉంది. పక్క ఉన్న ఒరిస్సా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తుండడంతో ఈ అనుమతులను పెండింగ్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆయా శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై కేంద్రం దృష్టికి తీసుకురావాలని రాష్ట్రానికి చెందిన అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఇరిగేషన్ శాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించి అటవీ, పర్యావరణ శాఖలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను వెంటనే క్లియర్ అయ్యే విధంగా కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. అందులో భాగంగానే అధికారులు ఢిల్లీకి వెళుతున్నారు. రాష్ట్ర పర్యటనకు బాబ్లీ అధికారులు ! బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్రానికి చెందిన అధికారులు రాష్ర్టంలో పర్యటించారు. ఈ ప్రాజెక్టుకు ఇంతకు ముందే సుప్రీం కోర్టు అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల కమిటీ ఈ ప్రాజెక్టును పర్యవేక్షించనుంది. వచ్చే సీజన్ నుంచి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించనుంది. అందులో భాగంగా మహారాష్ట్రకు చెందిన ఇంజనీర్లు మన రాష్ర్ట అధికారులతో చర్చలు జరిపారు. -
ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి
భువనగిరి, న్యూస్‌లైన్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించి వెంటనే పూర్తి చేయాలని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువనగిరిలో బుధవారం ఏర్పాటు చేసిన యువగర్జన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో 50 లక్షల ఎకరాల భూమి సాగు నీరు లేక బీడుపడిపోయిందన్నారు. ఇందులో నల్లగొండ జిల్లా కూడా ఉందన్నారు. కేంద్రం పోలవరానికి జాతీయ హోదా కల్పించినట్లుగానే ప్రాణహిత చేవెళ్లకు కూడా ఆ హోదా కల్పించాలని కోరారు. ఆనాటి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముందున్న నల్లగొండ జిల్లా నేటి తెలంగాణ ఉద్యమంలోనూ అగ్రభాగాన ఉందని చెప్పారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని కాంగ్రెస్ నాయకులు జిల్లాలో సంబరాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జిల్లాకు చెందిన రాష్ర్టమంత్రి కుందూరు జానారెడ్డి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని ఆరోపించారు. తెలంగాణ విషయంలో ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు చేసిందేమీ లేదని చెప్పారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి బీజేపీ ఇచ్చిన మద్దతుతోనే రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని గుర్తుచేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయకపోతే బీజేపీ మద్దతు ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. వెయ్యిమంది చంద్రబాబులు, కిరణ్‌బాబులు వచ్చినా తెలంగాణను ఆపలేరన్నారు.అంతకుముందు పీవీ పౌండేషన్ అధినేత పీవీ శ్యాంసుందర్‌రావుకు కిషన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సభ్వత్యం ఇచ్చారు. పడమటి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో బీజేపీ జాతీయ నాయకుడు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు చింతా సాంబమూర్తి, పుష్పలీల, జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, నాయకులు పాశం భాస్కర్, పోతంశెట్టి రవీందర్, గోలి మధుసూదన్‌రెడ్డి, కర్నాటి ధనుంజయ్య, కసిరెడ్డి నర్సింహారెడ్డి, నర్ల నర్సింగరావు, చందా మహేందర్, సుర్వి శ్రీనివాస్, వేముల అశోక్, విజయపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.